Winter Food : శీతాకాలం చర్మాన్ని సంరక్షించుకోవడం పెద్ద పనే. ముందు చర్మం పొడిబారడం దగ్గర సమస్య ప్రారంభం అవుతుంది. చర్మంలో తేమ తగ్గిపోయి పొలుసుల్లా రాలడం ప్రారంభమవుతుంది. కొంతమంది ఎన్ని లోషన్లు వాడినా చర్మం కాంతి విహీనంగానే కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ సీజన్లో చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహారంలో కొన్ని మార్పులు అవసరం. బాదం వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను డైలీ డైట్లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని పొందవచ్చు. మెడికల్ డైరెక్టర్, కాస్మొటాలజిస్ట్ డాక్టర్ గీతికా మిట్టల్ శీతాకాలంలో తప్పక తినాల్సిన మూడు ఆహార పదార్థాలను పంచుకున్నారు. ఆ వివరాలు..
డ్రై స్కిన్‌కి పాలకూరతో చెక్
పాలకూర పోషకాలతో నిండి ఉంటుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. టోన్డ్, షైనీ స్కిన్‌ని ఇస్తుంది. ఈ ఆకు కూరలో ఉండే ఐరన్ రక్తహీనత ఉన్నవారికి ఎంతో మంచిది. దీనిలోని ల్యూటిన్ ఎండ దెబ్బ నుంచి చర్మాన్ని కాపాడుతుంది. సలాడ్లు, సూప్‌లు, భోజనంలో పాలకూరను చేర్చుకోవచ్చు. దీని రసం స్కిన్‌ని డిటాక్స్ చేస్తుంది. డ్రై స్కిన్ నివారిస్తుంది. దీనిలో ఎ, సి విటమిన్లు ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా దొరుకుతాయి. ఇవి చర్మ వ్యాధులను నయం చేయడంలో సహాయపడతాయి. రక్త ప్రవాహాన్ని పెంచి చర్మాన్ని లోపల నుంచి శుభ్రం చేస్తాయి. పాలకూర బచ్చలి జాతి ఆకుకూరల్లో ఒకటి. ఈ జాతి ఆకు కూరలన్నీ చర్మ సంరక్షణకు ఉపకరిస్తాయి.
Blender cleaning tips: బ్లెండర్లను శుభ్రం చేయడం చాలా సులభం..! ఈ చిట్కాలు పాటించండి..
సూర్య కిరణాల నుంచి రక్షించే బాదం
చలికాలంలో బాదం చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇదో హెల్తీ స్నాక్. బాదంపప్పులో ఉండే విటమిన్ ఇ సూర్యుడి నుండి వచ్చే హానికరమైన UV కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. రాత్రి నానబెట్టిన బాదం ఉదయాన్నే తినడం మంచిది. దీనిలోని పోషక విలువల కారణంగా బాదంను బ్యూటీ ఫుడ్‌గా పరిగణిస్తారు. బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్, హైడ్రేటింగ్ ఎలిమెంట్స్ ఉంటే ఈ గింజలను మీ సూప్‌లు, సలాడ్లలో చేర్చుకోండి.
శుభ్రమైన చర్మం కోసం అవకాడో
చర్మ ఆరోగ్యానికి అవోకాడో ఎంతో మంచిది. దీన్ని కేవలం సలాడ్లోనే కాకుండా సూప్, షేక్ కూడా చేసుకుని తినొచ్చు. దీనిలో వివిధ పోషకాలతోపాటు విటమిన్ ఇ, హెల్తీ ఆయిల్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచుతాయి. అవకాడోలో ఉండే మోనోశాచ్యురేటెడ్ కొవ్వులు చర్మంలో తేమను పట్టి ఉంచడంలో సహాయపడతాయి. అవకాడోలో ఉండే గ్లుటామైన్ అమినో యాసిడ్ చర్మాన్ని శుభ్రపరచడంలో సాయం చేస్తుంది. పర్యావరణ కారకాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Healthy food, Lifestyle, Skin care