హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Extramarital Affairs: మీ భార్య/భర్త మిమ్మల్ని మోసం చేస్తున్నారా..? ఇల్లీగల్ అఫైర్స్‌కి రీజన్ ఇదే.. ఎక్స్‌పర్ట్స్ చెప్పేది ఏంటంటే..?

Extramarital Affairs: మీ భార్య/భర్త మిమ్మల్ని మోసం చేస్తున్నారా..? ఇల్లీగల్ అఫైర్స్‌కి రీజన్ ఇదే.. ఎక్స్‌పర్ట్స్ చెప్పేది ఏంటంటే..?

మీ లైఫ్ పార్ట్‌నర్ మిమ్మల్ని మోసం చేస్తున్నారా..?

మీ లైఫ్ పార్ట్‌నర్ మిమ్మల్ని మోసం చేస్తున్నారా..?

పెళ్లయిన తర్వాత తమ భాగస్వామి కళ్లుగప్పి కొందరు వివాహేతర సంబంధాలు (Extramarital Affairs) పెట్టుకుంటారు. అయితే మంచి భర్త లేదా భార్య ఉండి కూడా ఇలా ఎందుకు చేస్తున్నారు? అనే ప్రశ్న కలగడం సహజం. ఇలా అడ్డదారులు తొక్కిడానికి కారణాలు కోకొల్లలు అని రిలేషన్‌షిప్ నిపుణులు (Relationship Experts) అంటున్నారు.

ఇంకా చదవండి ...

పెళ్లయిన తర్వాత తమ భాగస్వామి కళ్లుగప్పి కొందరు వివాహేతర సంబంధాలు (Extramarital Affairs) పెట్టుకుంటారు. అయితే మంచి భర్త లేదా భార్య ఉండి కూడా ఇలా ఎందుకు చేస్తున్నారు? అనే ప్రశ్న కలగడం సహజం. ఇలా అడ్డదారులు తొక్కిడానికి కారణాలు కోకొల్లలు అని రిలేషన్‌షిప్ నిపుణులు (Relationship Experts) అంటున్నారు. వారు దంపతుల మధ్య వివాహేతర సంబంధానికి దారితీసే ప్రధాన కారణాలను తాజాగా వివరించారు. వారి ప్రకారం, భార్య లేదా భర్త దగ్గర శారీరక సుఖం దొరకకపోతే వారు పక్కదారి పట్టవచ్చు. ఎందుకంటే కొందరు కొన్నిసార్లు పవిత్రమైన సంబంధాల కంటే లైంగిక సంతృప్తికి, శారీరక సుఖానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎమోషనల్ సపోర్ట్ అందకపోయినా వారు తప్పటడుగులు వేసే అవకాశం ఉంది. భాగస్వామిపై కోపం వచ్చినా లేదా ఇతరులపై ఎక్కువ ప్రేమ కలిగినా వివాహేతర బంధం ఏర్పడవచ్చు. దాంపత్య జీవితంలో ఒకరిపై ఒకరు ఆసక్తిని కోల్పోయినప్పుడు వారిలో ఎవరో ఒకరు ఇతరులకు ఆకర్షితులవుతారని.. అప్పుడే ఇలాంటి బంధాలు స్టార్ట్ అవుతాయని రిలేషన్‌షిప్ నిపుణులు చెబుతున్నారు.

ఆలుమగలు అన్న తరువాత ఒకరికొకరు తగిన ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఒకరిపై ఒకరు శ్రద్ధ చూపించడం చాలా ముఖ్యం. కానీ ఆ శ్రద్ధ లోపిస్తే వారి బంధంలో మూడవ వ్యక్తి వచ్చే అవకాశం ఉంది. పట్టించుకునే వారి కోసం భార్యాభర్తల్లో ఎవరో ఒకరు పాకులాడే అవకాశాలు ఎక్కువ. రిలేషన్‌షిప్ నిపుణులు చెప్పిన ప్రకారం, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వేరే వారిపై కోరికలు పుట్టడానికి ప్రధాన కారణం వారి మధ్య శారీరక, మానసిక సంబంధం సరిగా లేకపోవడం. ఇద్దరు భాగస్వాములు చాలా కాలంగా శారీరకంగా విడిగా ఉంటే.. వారి వివాహబంధం ప్రమాదంలో పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

 ఇదీ చదవండి: వారెవ్వా వాట్సాప్.. రోజుకో కొత్త ఫీచర్లు.. ఇక ఎవరికి తెలియకుండా లెఫ్ట్ అయ్యే ఫీచర్.. ఎలాగో లుక్కేయండి !


ఒకరితో ఒకరు మెరుగైన మానసిక బంధం కలిగి లేకపోయినా అది విడాకులకు దారి తీయవచ్చు. అదెలాగంటే హస్బెండ్ లేదా వైఫ్ ఒకరికొకరు మానసికంగా కనెక్ట్ కాకపోతే వారు వేరే వ్యక్తిని వెతుక్కోవచ్చు. ఇలా మూడో వ్యక్తితో ఏర్పడే మానసిక బంధంలో శృంగారం జరగకపోవచ్చు. కానీ వారు మానసికంగా ఒకరిపై ఒకరు బాగా ఆధారపడి సెక్స్, వ్యక్తిగత విషయాలు వంటివి మాట్లాడుకుంటారు. ఒకరి గురించి ఒకరు అతిగా ఆలోచిస్తుంటారు. ఇలాంటి బంధం ఎక్కువ కాలం సాగితే ఒకరినొకరు వదులుకోలేక వివాహబంధాన్నే తుంచేస్తారు. భాగస్వామిని ఇల్లు, పిల్లలను చూసుకోవడానికే పరిమితం చేసినా వారు తప్పు చేసే ఆస్కారం ఉంది. అలానే ఒంటరిగా ఉన్న జీవిత భాగస్వామి వివాహేతర సంబంధాన్ని పెట్టుకోవడానికి మొగ్గు చూపవచ్చు.

సోషల్ మీడియాలో ఉన్న ప్రైవసీని సద్వినియోగం చేసుకుంటూ కొందరు తమ జీవిత భాగస్వాములను మోసం చేస్తుంటారు. సోషల్ మీడియా ద్వారా వారు తప్పు చేసినా అదేం పెద్ద నేరం కాదనే భావనలో ఉంటారు. ఈ పరిచయాలే చివరికి కొంప ముంచుతాయి. భార్యాభర్తలు ప్రతిరోజూ కాసేపు ప్రశాంతంగా కూర్చొని తమకున్న అన్ని సమస్యల గురించి చెప్పుకుంటే భవిష్యత్‌లో ఎలాంటి కలతలూ, మనస్పర్ధలు, వివాహేతర సంబంధాలు పెట్టుకునే అవసరాలు రావని సెక్సాలజిస్టులు, సైకాలజిస్టులు చెబుతున్నారు. వివాహేతర సంబంధాలు తాత్కాలికంగా సుఖం ఇచ్చినా చివరికి అవి తట్టుకోలేని బాధను కలిగిస్తాయని హెచ్చరిస్తున్నారు.

First published:

Tags: After marriage, Illegal affairs, Illegal relationship, Life Style

ఉత్తమ కథలు