Home /News /life-style /

Sleep: తస్మాత్​ జాగ్రత్త.. అతిగా నిద్రపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశం..

Sleep: తస్మాత్​ జాగ్రత్త.. అతిగా నిద్రపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తొమ్మిది గంటల కన్నా ఎక్కువ సేపు నిద్రపోయే వారిలో డిప్రెషన్‌ వచ్చే లక్షణాలు కూడా బయటపడ్డాయి. అలాగే ఏడుకన్నా తక్కువ గంటలు నిద్రపోయే వారిలోనూ ఈ లక్షణాలు కనిపించాయి

    నిద్రలేమి ఎంత ప్రమాదమో, అతి నిద్ర(sleep)తో కూడా అంతే అనర్ధం. అతిగా నిద్రపోయిన వారికి గుండె జబ్బులు(heart disease) , డిప్రెషన్‌(depression) వంటి సమస్యలు త్వరగా వచ్చే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక మనిషికి రోజుకి ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం. అంతకన్నా తక్కువసేపు నిద్రపోయేవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం 34 శాతం ఉన్నట్టు నిపుణులు తేల్చారు. అలాగే ఎనిమిది గంటల కన్నా ఎక్కువ నిద్రపోయేవాళ్లలో 35 శాతం గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్టు పరిశోధనలో తేలింది. అతి నిద్ర మూలంగా డీఎన్‌ఏ సైతం మారుతున్నట్టు వెల్లడైంది. తొమ్మిది గంటల కన్నా ఎక్కువ సేపు నిద్రపోయే వారిలో డిప్రెషన్‌ వచ్చే లక్షణాలు కూడా బయటపడ్డాయి. అలాగే ఏడుకన్నా తక్కువ గంటలు నిద్రపోయే వారిలోనూ ఈ లక్షణాలు కనిపించాయి. కనుక రోజూ ఎనిమిది గంటలు నిద్రపోవడం ఉత్తమం.

    అప్పుడప్పుడు తొమ్మిది గంటలు దాటినా ఫర్వాలేదు కానీ... రోజూ అతినిద్ర అలవాటు లేకపోవడమే మంచిది. అయితే ఓ పరిశోధన ప్రకారం అత్యధిక గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారిని పరిశీలిస్తే అందులో 80 శాతానికి పైగా రోజు 9 గంటలకు పైగా నిద్రించేవారేనట. మరో విషయం ఏంటంటే నిద్ర తక్కువున్నా ఆనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు మెండు. ముందే జాగ్రత్త.. నిద్ర మంచిదే కానీ, అతి నిద్రే ప్రమాదకరం.

    పగలు వద్దు రాత్రి ముద్దు..

    చాలా మంది రాత్రివేళ మిస్సయిన నిద్రను .. పగటి వేళ భర్తీ చేద్దాం అని అనుకుంటారు. కానీ, దాని వల్ల ఎలాంటి ఫలితం ఉండదని అధ్యయనాలు తెలుపుతున్నాయి. శరీరం రాత్రి వేళల్లో విశ్రాంతి తీసుకోవడానికి ఉదయం వేళల్లో చురుకుగా ఉంటుంది, కానీ .. రాత్రి వేళ విశ్రాంతి లేకుండా చేయడం .. ఉదయం వేళ బలవంతంగా విశ్రాంతి ఇవ్వడం వల్ల ఫలితం ఉండదు. ‘‘ ఆకలి వేసినప్పుడే అన్నం తినాలి. నిద్ర వచ్చినప్పుడే పడుకోవాలి. రాత్రి తినాల్సిన భోజనాన్ని .. మధ్యాహ్నానికి ఎలా వాయిదా వేసుకోలేమో .. అలాగే నిద్రను కూడా వాయిదా వేసుకోకూడదు ’’ అని పరిశోధకులు ఉదాహరణగా చెప్పారు. పగటి వేళ నిద్రపోవడం, నిద్రలేమి సమస్యలు వల్ల ఎక్కువ మంది టైప్ -2 డయాబెటీస్ ప్రమాదంలో గురవుతున్నారట.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Heart Attack, Life Style, Sleep

    తదుపరి వార్తలు