Home /News /life-style /

EXCESSIVE CONSUMPTION OF CHOCOLATE MAY CAUSE MANY HEALTH ISSUES KNOW IMPORTANT THINGS PVN

Chocolate : చాక్లెట్లు తినేవాళ్లు ఈ విషయం తెలుసుకోండి..లేకుంటే మీ ఆరోగ్యానికే ప్రమాదం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Chocolate Side Effects  : చాక్లెట్లు(Chocolate)అంటే ఇష్టపడనివాళ్లు తక్కువమందే ఉంటారు. అన్ని వయసుల వారు చాక్లెట్ తినడానికి ఇష్టపడతారు. దేశంలో చాక్లెట్ క్రేజ్ వేగంగా పెరుగుతోంది. ప్రజలు ఇప్పుడు ఒకరికొకరు చాక్లెట్లను బహుమతులుగా ఇచ్చకుంటున్నారు. సంతోషకరమైన సందర్భాలలో కూడా చాక్లెట్లను తినడం ప్రారంభించారు.

ఇంకా చదవండి ...
    Chocolate Side Effects  : చాక్లెట్లు(Chocolate)అంటే ఇష్టపడనివాళ్లు తక్కువమందే ఉంటారు. అన్ని వయసుల వారు చాక్లెట్ తినడానికి ఇష్టపడతారు. దేశంలో చాక్లెట్ క్రేజ్ వేగంగా పెరుగుతోంది. ప్రజలు ఇప్పుడు ఒకరికొకరు చాక్లెట్లను బహుమతులుగా ఇచ్చకుంటున్నారు. సంతోషకరమైన సందర్భాలలో కూడా చాక్లెట్లను తినడం ప్రారంభించారు. పిల్లలు తమ పుట్టినరోజున స్కూల్ లో చాక్లెట్లు పంచడం,ప్రేమికులు గిఫ్ట్ లుగా చాక్లెట్లు ఇచ్చుకోవడం ఇలా చాక్లెట్లు కూడా మన రోజువారీ జీవితంలో ఓ భాగమైపోయాయి. కొందరికి రోజూ చాక్లెట్లు తినడమంటే చాలా ఇష్టం. అయితే ఎక్కువగా చాక్లెట్ తినడం ఆరోగ్యానికి ప్రమాదకరనమని నిపుణులు చెబుతున్నారు. ఇది మీకు వింతగా అనిపించవచ్చు, కానీ ఇది పూర్తిగా నిజం. చాక్లెట్ కొంత మొత్తంలో మాత్రమే తినాలి. దాని వ్యసనం మీకు సమస్యలను కలిగిస్తుంది. చాక్లెట్లు ఎక్కువగా తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం

    అధ్యయనం ఏం చెబుతోంది?

    లివ్ స్ట్రాంగ్ రిపోర్ట్ ప్రకారం...చాక్లెట్‌లను అధికంగా తినడం వల్ల మన శరీరానికి చాలా నష్టం వాటిల్లుతుంది. చాక్లెట్ తినడం వల్ల అలర్జీ వస్తుంది. 2017 జర్నల్ ఆఫ్ ఫుడ్ ప్రొటెక్షన్ రిపోర్ట్‌లో.. చాక్లెట్ వల్ల కలిగే అలర్జీ గురించి సవివరంగా చెప్పబడింది. అలర్జీ సమస్యతో బాధపడేవారు చాక్లెట్లు తక్కువగా తినాలి. చాక్లెట్‌లో టాక్సిన్స్ కూడా ఉండవచ్చు. ఇందులో ఉండే అదనపు కాడ్మియం, నికెల్ మీ శరీరంలో పేరుకుపోతాయి. ఇది చాలా నష్టాన్ని కలిగిస్తుంది.

    Skin care tips : టవల్ తో మొఖం తుడుచుకుంటున్నారా?అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం

    చాక్లెట్‌లో హానికరమైన బ్యాక్టీరియా

    యాంటిజెన్ కాలుష్యం అనేది చాక్లెట్ ఉత్పత్తి యొక్క అతిపెద్ద ప్రమాదాలలో ఒకటి. ఫుడ్ కంట్రోల్ జర్నల్‌ 2015లో ప్రచురించబడిన కథనంలో...ఒక అధ్యయనంలో భాగంగా పరీక్షించబడిన 25 శాతం చాక్లెట్ శాంపిల్స్ లో బ్యాక్టీరియా కాలుష్యం కనుగొనబడింది. ఈ బ్యాక్టీరియా ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. చాక్లెట్ వల్ల కూడా గుండెల్లో మంట వస్తుంది. అమెరికన్ సొసైటీ ఫర్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఎండోస్కోపీ ప్రకారం... చాక్లెట్ అన్నవాహిక స్పింక్టర్ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది గుండెల్లో మంట సమస్యకు దారితీస్తుంది.



    చాక్లెట్ బరువును పెంచుతుంది

    బరువు తగ్గాలనుకునే వారు చాక్లెట్‌కు దూరంగా ఉండాలి. మార్చి 2015లో జరిపిన ఒక పరిశోధన చాక్లెట్ తినడం, బరువు పెరగడం మధ్య సంబంధాన్ని వెల్లడించింది. ఋతుక్రమం ఆగిపోయిన మహిళలను మూడేళ్లపాటు పరిశోధకులు సర్వే చేశారు. చాక్లెట్‌లు ఎక్కువగా తీసుకునే మహిళలు బరువు పెరిగే అవకాశం ఉందని ఫలితాలు వెల్లడించాయి.
    Published by:Venkaiah Naidu
    First published:

    Tags: Chocolate, Chocolates

    తదుపరి వార్తలు