• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • EXAMS TIPS 6 TIPS FOR SUCCESSFUL EXAM PREPARATION HERE ARE FULL DETAILS RA

Exam Tips : ఇలా చదివితే సబ్జెక్ట్ గుర్తుంటుంది.. ఎగ్జామ్స్ టైమ్‌లో ఈ 6 టిప్స్ పాటించండి..

Exam Tips : ఇలా చదివితే సబ్జెక్ట్ గుర్తుంటుంది.. ఎగ్జామ్స్ టైమ్‌లో ఈ 6 టిప్స్ పాటించండి..

ప్రతీకాత్మక చిత్రం

పరీక్షలనగానే చాలు.. అందరికీ ఒకటే టెన్షన్.. దీంతో చదివింది కాస్తా మర్చిపోతాం అలాకాకుండా మనం ఎంతవరకూ చదివామో.. అలానే పరీక్షల్లో రాసి ఫుల్ స్కోర్ చేయాలంటే కొన్ని టిప్స్ పాటించండి..

  • Share this:
ఎంత చదివామన్నది ముఖ్యం కాదు.. పరీక్షల్లో ఎంత బాగా రాశామన్నదే ముఖ్యం. అవును చాలా మంది పరీక్షల కోసం ఎప్పట్నుంచో ప్రిపేర్ అవుతారు.. 24గంటలు అదేపనిగా చదువుతారు. కానీ మార్కులు చూస్తే అంతంత మాత్రమే.. మరికొంతమంది పరీక్షలకు కొన్ని రోజుల ముందునుంచి చదివినా సరే ఎక్కువమార్కులు స్కోర్ చేస్తారు. దీనికి కారణం పరీక్షల సమయంలో సరైన నియమాలు పాటించడం. మరి ఆ నియమాలు ఏంటో.. ఎలా చదివితే సబ్జెక్ట్ బాగా గుర్తుండి ఎగ్జామ్స్ చక్కగా రాస్తామో చూద్దాం.
* పరీక్షల సమయంలో ఎక్కువగా టెన్షన్ పడుతుంటారు. కానీ ఇలా చేయడం వల్ల చదివింది మర్చిపోతారు. కాబట్టి టెన్షన్ అవసరం లేదు. రోజూ కాలేజ్, స్కూల్‌కి వెళ్లినట్టే వెళ్లి ఎగ్జామ్స్ రాయాలి.
* మంచి నిద్ర ఉంటే మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. దీని వల్ల ఎగ్జామ్స్ చక్కగా రాయొచ్చు. కాబట్టి పరీక్షలయ్యాక బాగా నిద్రపోదాం అనుకోకుండా సరైన నిద్రపోయి ఆ తర్వాత చదవండి. దీనివల్ల ఏం చదివినా బాగా గుర్తుంటుంది.
* ఈ సమయంలో ఫాస్ట్ ఫుడ్, మసాలా ఐటెమ్స్‌ పక్కనపెట్టడం చాలా మంచిది. తక్కువ మోతాదులోనే బలమైన ఆహారం అంటే నట్స్, జ్యూస్‌లు, గుడ్లు ఇలా తీసుకోవడం మంచిది.
* ఒక్కోసారి ఎంత చదివినా అసలు బుర్రకెక్కదు. ఇలాంటి సమయంలో ఇంకా చదివే బదులు కాస్తా బ్రేక్ ఇచ్చి పాటలు వినడమో.. ఇష్టమైన మరేదో పని చేయడమో చేయాలి. ఆ తర్వాత ఆ సబ్జెక్ట్‌ని చదవాలి. అయినా సరే అలానే ఉంటే వేరే సబ్జెక్ట్ చదివి అనంతరం ఆ సబ్జెక్ట్ చదవాలి.
* పాఠాలను ఎప్పుడూ కూడా బట్టి పట్టొద్దు.. సబ్జెక్ట్‌ని అర్థం చేసుకోవాలి. దీంతో.. ఏ ప్రశ్న ఇచ్చిన బాగా రాస్తాం.
* ఎంతసేపు చదవడమే కాకుండా.. నడవడం, వ్యాయామం, పాటలు వినడం వంటివి చేస్తుండాలి.
First published:

అగ్ర కథనాలు