చర్మం(skin) అందంగా ఉండటానికి మెరవడానిక చాలా రకాల క్రీములు, లోషన్స్ వాడి ఉంటారు. అయితే.. ఇంట్లో తయారు చేసిన ప్రొడక్ట్స్ ని ఖచ్చితంగా నిర్లక్ష్యం చేసి ఉంటారు. చాలామందికి ఇంట్లో తయారు చేసిన ప్రొడక్ట్స్ వల్ల పొందే లాభాలు తెలియవు. అలాగే.. హోం మేడ్ ప్రొడక్ట్స్ వల్ల.. అనవసర సైడ్ ఎఫెక్ట్స్ కి కూడా దూరంగా ఉండవచ్చు. మార్కెట్ లో తయారు చేసే ప్రొడక్ట్స్ లో చాలా కెమికల్స్ ఉంటాయి. ఇవి.. త్వరగా ఫలితాన్ని ఇచ్చినప్పటికీ.. చర్మానికి మెల్లి మెల్లిగా హాని చేస్తాయి. బియ్యం పిండి చర్మానికి అద్భుతమైన ఫలితాలు ఇచ్చే హోం ప్రొడక్ట్స్ లో ఒకటి. కెమికల్ ప్రొడక్ట్స్ కంటే.. చాలా మంచి ఫలితాన్నిస్తుంది. బియ్యం పిండి (rice flour) యొక్క గరుకుదనం వల్ల మృత చర్మ కణాలు తొలగిపోతాయి. చర్మంపై గల స్వేద రంధ్రాలలోని మురికిని, క్రిములను తొలగించి మొటిమలు(pimples) రాకుండా నివారిస్తుంది. చర్మంపై అందం(beauty) నిగారిస్తుంది. ఈ బియ్యం పిండితో ఇంకా ఏమేం కలిపితే చర్మం మెరుస్తుందో ఓ సారి తెలుసుకుందాం..
బియ్యాన్ని భారతదేశంలో ప్రధాన ఆహారంగా వాడుతుంటారు. బియ్యం తో కేవలం అన్నమే కాకుండా రకరకాల పిండి వంటలు, స్వీట్లు, వడియాలు తయారు చేస్తూ ఉంటారు. కానీ బియ్యాన్ని కేవలం ఆహారంగానే కాకుండా సౌందర్య పోషణకు కూడా ఉపయోగించవచ్చు. ముందుగా మనం ఓ రెండు స్పూన్ల బియ్యం పిండి(rice flour), ఓ ఒకటిన్నర స్పూన్ పెరుగు, ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ తేనేని తీసుకోవలె. పదార్థాలన్నింటినీ ఒక బౌల్ లోకి తీసుకొని బాగా కలిపి పేస్ట్ లాగ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా తీసుకొని మొహం మీద గుండ్రంగా(round) తిప్పుతూ రాసుకోవాలి. మెడ మీద చేతుల మీద కూడా రాసుకోవచ్చు. ఆరాక గట్టిగా అయిపోయి ముఖా(face)నికి పట్టేసినట్లు అవుతుంది. మాస్కు వేసుకోవాలి. అనంతరం నవ్వడం, మాట్లాడటం, తినడం లాంటివి చేయకూడదు. కంటి చుట్టూ ఉండే ప్రదేశం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి అక్కడ అప్లై(apply) చేయకూడదు. మాస్క్ ఎండి పోయే వరకు అలాగే ఉండ నిచ్చి తర్వాత కొద్దిగా కొద్దిగా తడి చేస్తూ మెల్లగా రిమూవ్ చేయాలి. అంతే కానీ గట్టిగా తీయకూడదు. తర్వాత ఒక 4 గంటల వరకు సబ్బు(soap) ఉపయోగించకూడదు. మాస్క్ తీయగానే ఆ ప్రదేశంలో చేతితో తాకి చూస్తే స్కిన్ చాలా సున్నితంగా జారిపోతున్నట్లుగా అనిపిస్తుంది. అది అలానే ఉండాలంటే మాస్క్ తీసేయగానే ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా చేస్తే చర్మం కాంతి వంతగా కనిపిస్తుంది.
అంతేకాకుండా ఆయిలీ స్కిన్(oil skin) నివారించడానికి బియ్యం పిండి(rice flour) చక్కటి పరిష్కారం. కార్న్ స్టార్చ్, బియ్యం పిండి కలిపి పెట్టుకోవాలి. బయటకు వెళ్లాలి అనుకున్నప్పుడు ఫేస్ పౌడర్(face powder) లా దీన్ని ఉపయోగిస్తే.. అదనపు ఆయిల్ ని పీల్చుకుని.. ఫ్రెష్ లుక్ అందిస్తుంది. మరో పద్దతిలో బియ్యం పిండి, అలో వెరా జెల్, తేనె కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత.. శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు(pimples), మచ్చలు తొలగిపోతాయి. నలుపుదనం కూడా తగ్గిపోతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Beauty tips, Face mask, Life Style, Rice