Home /News /life-style /

ESSENTIAL SAFETY TIPS YOU MUST FOLLOW DURING MONSOON AND RAINY SEASON PVN

Monsoon safety tips: వర్షాకాలంలో తప్పనిసరిగా పాటించాల్సిన సేఫ్టీ టిప్స్

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Safety tips during monsoon : వర్షాకాలం(Monsoon)లో చాలా మంది ప్రజలు తమ ఇళ్లలో ఉండటానికి ఇష్టపడతారు,వర్షం పడుతున్నప్పుడు బయట కంటే ఇంట్లో మీరు సురక్షితంగా ఉంటారు. కానీ వర్షాకాలంలో మీరు ఇంట్లో కూడా పూర్తిగా సురక్షితంగా ఉండరని మీకు తెలుసా?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
Safety tips during monsoon : వర్షాకాలం(Monsoon)లో చాలా మంది ప్రజలు తమ ఇళ్లలో ఉండటానికి ఇష్టపడతారు,వర్షం పడుతున్నప్పుడు బయట కంటే ఇంట్లో మీరు సురక్షితంగా ఉంటారు. కానీ వర్షాకాలంలో మీరు ఇంట్లో కూడా పూర్తిగా సురక్షితంగా ఉండరని మీకు తెలుసా?. అవును, వర్షంలో ఇంట్లోని కొన్ని ముఖ్యమైన వాటిని విస్మరించడం మీకు ప్రమాదాన్ని సృష్టిస్తుంది. దీని కారణంగా మీరు ఏదైనా పెద్ద ప్రమాదం లేదా అవాంఛనీయ సంఘటనల బారిన పడవచ్చు. కొన్ని రెయిన్ సేఫ్టీ చిట్కాలను పాటించడం ద్వారా మిమ్మల్ని మీరు పూర్తిగా సురక్షితంగా ఉంచుకోవచ్చు.

పాదాలకు ప్రత్యేక శ్రద్ధ
వర్షాకాలంలో మీ పాదాలను వర్షపు నీటి నుండి దూరంగా ఉంచడానికి ప్రయత్నించండి. వర్షపు నీటిలో బ్యాక్టీరియా ఉంటుంది. దీని వల్ల పాదాలకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వర్షంలో నడవడం మానుకోండి. అలాగే బయటి నుంచి వచ్చిన తర్వాత పాదాలను సబ్బుతో కడగడం మర్చిపోవద్దు.
విద్యుత్ తీగలకు దూరంగా ఉండండి
వర్షం కురుస్తున్న సమయంలో కరెంట్‌ తీగలకు విద్యుత్‌ ప్రవహించే ప్రమాదం ఉంది. కాబట్టి వర్షాకాలంలో విద్యుత్ వైర్లను తాకకుండా ఉండండి. అలాగే, వర్షంలో ఎలక్ట్రికల్ వస్తువులకు దూరంగా ఉండాలని పిల్లలకు సూచించండి.
ఇంటి తలుపులు మూసేయండి
వర్షం సమయంలో ఇంటి కిటికీలు, తలుపులు మూసి ఉంచండి. దీని వల్ల ఇంట్లోకి వాన జల్లులు రావు. అదే సమయంలో వర్షం రాక ముందు విరిగిన గోడ, పైకప్పు మరమ్మత్తు చేయించడం మర్చిపోవద్దు.

Women do not like these habits : మగాడిలోని ఈ ఐదు అవాలట్లు స్త్రీకి అస్సలు నచ్చవంట!

కీటకాల నుండి రక్షణ
వర్షాకాలంలో ప్రతి ఇంట్లోనూ కీటకాలు, చీడపురుగుల సమస్య సర్వసాధారణం అవుతుంది. వర్షపు దోమలు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు కారణమవుతాయి. అదే సమయంలో, ఈగలు, బొద్దింకలు కూడా ఇంటిని అపరిశుభ్రంగా మార్చడానికి ప్రయత్నిస్తాయి. అటువంటి పరిస్థితిలో, వర్షపు పురుగులను వదిలించుకోవడానికి, ఇంట్లో స్ప్రే, బ్యాక్టీరియా కిల్లర్ ఉంచండి.


డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త
వర్షం సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోవద్దు. మీ వాహనం వర్షపు నీటిలో జారిపోతుందో లేక గుంతలోకి వెళ్తుందో అనే భయం ఉంది. అందువల్ల వర్షంలో జాగ్రత్తగాడ్రైవింగ్ చేయడం మంచిది.
ఎలక్ట్రానిక్స్ ఆఫ్ చేయండి
వర్షాకాలంలో విద్యుత్ వోల్టేజీ పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను చార్జింగ్ లో అలాగే ఉంచడం వల్ల మీ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడవచ్చు. అందుకే వర్షం పడినప్పుడు టీవీ, ఫ్రిజ్, కూలర్, ఏసీ వంటి వాటిని జాగ్రత్తగా ఆఫ్ చేయండి.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Monsoon, Monsoon rains

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు