HOME »NEWS »LIFESTYLE »egg halwa recipe how to make egg halwa it is good for health in winter sk

Egg Halwa Recipe: కోడిగుడ్డు హల్వా.. కొత్తగా ఉంది కదూ.. మీరూ ట్రై చేయండి..

Egg Halwa Recipe: కోడిగుడ్డు హల్వా.. కొత్తగా ఉంది కదూ.. మీరూ ట్రై చేయండి..
ప్రతీకాత్మక చిత్రం

Egg Halwa Recipe: వంటింట్లో ఉన్న పదార్థాలతో తక్కువ సమయంలో దీన్ని తయారు చేసుకోవచ్చు. మీరూ ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది. మరి కోడిగుడ్డు హల్వాకు ఏయే పదార్థాలు కావాలి? ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

  • Share this:
    Egg Halwa Recipe: మనకు ఎన్నో రకాల హల్వాలు తెలుసు. క్యారెట్ హల్వా, సొరకాయ హల్వా, శనగపిండి హల్వా.. ఎన్నో ఇలా వెరైటీ ఉన్నాయి. కానీ గుడ్డుతో కూడా హల్వా చేస్తారని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కోడిగుడ్డు హల్వా.. ఎంతో రుచిగా ఉంటుంది. పైగా ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా చలికాలంలో శరీరానికి వెచ్చ దనాన్ని అందించే ఆహారం ఇది. వంటింట్లో ఉన్న పదార్థాలతో తక్కువ సమయంలో దీన్ని తయారు చేసుకోవచ్చు. మీరూ ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది. మరి కోడిగుడ్డు హల్వాకు ఏయే పదార్థాలు కావాలి? ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

    కావాల్సిన  పదార్థాలు:


    గుడ్లు -5

    చక్కెర- 200 గ్రాములు

    మిల్క్ మేడ్ - 200 గ్రాములు

    పాలు - 200 మి.లీ.

    జీడిపప్పు - 11-12

    బాదం పప్పు- 8-10

    పిస్తా - 8-9

    యాలకుల పొడి- 1 టేబుల్ స్పూన్

    నెయ్యి - 50 గ్రాములు

    డాల్డా - 50 గ్రాములు

    ఫుడ్ కలర్ - తగినంత

    కోడి గుడ్డు హల్వా తయారీ:

    ముందుగా చక్కెరను మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. లేదంటే సూపర్‌మార్కెట్‌లో చక్కరె పొడిని తీసుకున్నా సరిపోతుంది. చక్కెర పొడిలో యాలకుల పొడి వేసి కలపాలి. ఆ తర్వాత గుడ్లను పగులకొట్టి చక్కెర మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు మిల్క్ మేడ్, పాలు, నెయ్యి, డాల్డా వేయాలి. అన్నింటినీ మిక్సీలో వేసి చిక్కటి పేస్ట్‌లా చేయాలి. మీకు నచ్చిన ఫుడ్ కలర్ కొంచెం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై బాణలి పెట్టి ఈ మిశ్రమాన్ని వేసి సన్నని మంటపై ఉడికించుకోవాలి. ఎక్కువ మంట పెడితే మాడిపోతుంది. అందుకే సిమ్‌లోనే కుక్ చేసుకోండి. మిశ్రమాన్ని బాగా కలుపుతూ ఉండాలి. లేదంటే కడాయికి అతుకుపోయే అవకాశముంది. కాసేపయ్యాక నెయ్యిపైకి తేలుతుంది. ఆ తర్వాత మరో 5 నిమిషాలు కుక్ చేయాలి. ఇక మీ కోడిగుడ్డ హల్వా సిద్ధమయినట్లే. స్టవ్ ఆఫ్ చేసి..పైన బాదం, జీడిపప్పు, పిస్తాతో గార్నిష్ చేసుకోవాలి. వేడివేడిగా తింటే టేస్ట్ అద్దిరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి.
    Published by:Shiva Kumar Addula
    First published:January 20, 2021, 13:32 IST