Health Tips : షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే బిర్యానీ ఆకు

Health Tips | బిర్యానీల్లో ప్రధాన మసాలాగా మారిన బిర్యానీ ఆకు తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. రకరకాల ఆరోగ్య సమస్యలకు చక్కని పరిష్కారంగా ఈ ఆకుని వాడతాం. అవేంటో చూడండి.

Amala Ravula | news18-telugu
Updated: June 22, 2019, 3:39 PM IST
Health Tips : షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే బిర్యానీ ఆకు
షుగర్ పేషెంట్స్‌ ఆలు తినొచ్చా..
Amala Ravula | news18-telugu
Updated: June 22, 2019, 3:39 PM IST
బిర్యానీ ఆకు.. కేవలం ఓ ఆహార పదార్థమేకాదు.. ఆరోగ్యాన్నిచ్చే అద్భుతమైన ఔషధం కూడా. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ఆయుర్వేద మందుల్లోనూ ఈ ఆకులను వాడతారు. ఈ ఆకులను పొడి చేసి లేదా నేరుగా తీసుకోవడం వల్ల అనేక సమస్యలను దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా షుగర్ వ్యాధి, గుండెసమస్యల వంటి ప్రమాదకర సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు.

* బిర్యానీ ఆకులు ఆరోగ్యానికి ఎంతగానో మంచిది. కొన్ని సందర్భాల్లో ఆహారం జీర్ణం కాక ఇబ్బంది పడుతుంటాం. అలాంటప్పుడు గ్లాసు నీటిల పావు స్పూన్ బిర్యానీ ఆకుల పొడిని కలిపి తాగితే ఫలితముంటుంది.
* బిర్యానీ ఆకుల పొడిని ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తీసుకుంటే షుగర్ స్థాయిలు కూడా అదుపులోకి వచ్చి మధుమేహం తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

* ఈ పొడిని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతోగుండె సంబంధ సమస్యలు రావు.
* బ్రెస్ట్ క్యాన్సర్‌కి వ్యతిరేకంగా పోరాడే లక్షణాలు బిర్యానీ ఆకుల్లో ఉన్నాయని చెబుతారు.


* ముఖ్యంగా కిడ్నీల్లో రాళ్లతో ఇబ్బంది పడేవారు.. బిర్యానీ ఆకులను పొడిగా చేసి రెగ్యులర్‌గా నీటిలో కలుపుకుని తాగుతుండాలి.
* బిర్యానీ ఆకులతో టీ చేసుకుని తాగితే ఒత్తిడి మాయమవుతుంది.
Loading...
* సహజసిద్ధంగానే ఈ ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలుంటాయి. కాబట్టి నొప్పులను తగ్గించడంల ఇవి ముందుంటాయి.
* ఆరోగ్యపరంగానే కాదు.. సౌందర్యపోషణలోనూ బిర్యానీ ఆకులు బాగా పనిచేస్తాయి. నీటిలో ఈ ఆకులను వేసి మరిగించి ఆ నీటిని జుట్టుకి పట్టించి కడిగితే.. ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. చుండ్రు కూడాపోతుంది.

ఇవి కూడా చదవండి..

మెనోపాజ్ సమస్యలను తగ్గించే చిట్కాలు
First published: June 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...