Home /News /life-style /

EFFECTIVE TIPS THAT CAN HELP RECOVER FROM DENGUE FASTER RNK

Dengue virus: ఈ చిట్కాలతో డెంగీని త్వరగా తరిమేయొచ్చు!

విటమిన్‌ డీ పొందడానికి ఎండలో కాసేపు ఎక్సర్‌సైజ్‌ చేయడం మంచిది. సమతూల్య ఆహారం కోసం తెలుపు రంగుల్లో ఉండే చక్కెరతోపాటు ప్రాసెస్డ్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.

విటమిన్‌ డీ పొందడానికి ఎండలో కాసేపు ఎక్సర్‌సైజ్‌ చేయడం మంచిది. సమతూల్య ఆహారం కోసం తెలుపు రంగుల్లో ఉండే చక్కెరతోపాటు ప్రాసెస్డ్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.

విటమిన్‌ డీ పొందడానికి ఎండలో కాసేపు ఎక్సర్‌సైజ్‌ చేయడం మంచిది. సమతూల్య ఆహారం కోసం తెలుపు రంగుల్లో ఉండే చక్కెరతోపాటు ప్రాసెస్డ్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.

రుతుపవనాల్లో Monsoon  మార్పులు అనేక వ్యాధులకు కారణాలు. ఇందులో భాగంగానే డెంగీ Dengue కూడా విజృంభిస్తోంది. ఇది ఏడిస్‌ దోమ ద్వారా వ్యాపిస్తుంది. దీంతో అధిక జ్వరం, తలనొప్పి, నీరసం, శ్వాసకోశ సమస్యలు, వాంతులు, వికారం వంటి సమస్యలు వస్తాయి.

డెంగీని నివారించడానికి ఉత్తమ మార్గం.. దోమలను నివారించడం. డెంగీ బారిన పడిన వారు త్వరగా కోలుకోవడానికి కొన్ని ఆహారపు అలవాట్లు, వారి జీవనశైలిలో మార్పులు చేసుకోవడం మంచిది. డెంగీ నీరు నిలిచిన చోట దోమల బ్రీడింగ్‌ వల్ల వ్యాధి పెరుతుంది. అయితే, ఆరోగ్య నిపుణులు కొన్ని ఉత్తమ మార్గాలను సూచించారు.. అవేంటో తెలుసుకుందాం.

ఏ పనులు చేయాలి?
డెంగీతో బాధపడుతున్నవారికి వారి వ్యాధి నిరోధక శక్తి పెరగటానికి తగినంత విశ్రాంతి అవసరం. ఇది ప్రస్తుతం పరిస్థితుల్లో కాస్త కష్టమే అని నిపుణులు చెబుతున్నారు.

వాటర్‌..
రోజూ కనీసం 3–4 లీటర్ల నీరు తాగాలి. పండ్ల రసం (చక్కెర లేకుండా) కూడా మంచిదే. డెంగీ త్వరగా నయం కావాలి అంటే..ఎక్కువ శాతం లిక్విడ్‌ ఫ్లూయిడ్స్‌ తీసుకోవడం మేలు. మజ్జిగ, లేత కొబ్బరి నీళ్లు, సోంపు నీరు తాజా పండ్ల రసాలు కూడాడా ప్రభావవంతంగా పనిచేస్తాయి.

 కొవిడ్‌.. డెంగీ మధ్య తేడాను ఇలా గుర్తించవచ్చు!


తినాల్సిన ఆహారం..
సీట్రస్‌ ఫ్రూట్స్‌ అయిన కీవీ, ఉసిరి, ఆరెంజ్, పైనాపిల్, దానిమ్మ, బొప్పాయి వంటి పండ్లు తినాలి. కూరగాయాల సూప్‌లను తాగడం మర్చిపోవద్దు. కిచిడీ, ముంగ్‌దాల్‌ సూప్‌ వంటి తేలికపాటి ఆహారం కేవలం ఇంట్లో వండిన వాటినే తినాలి. గోధుమ రొట్టెలను తినడం కంటే.. జొన్న రొట్టెలు తినడం మంచిది. ప్రాసెస్డ్, ఫాస్ట్‌ఫుడ్‌ వంటి ఫుడ్‌కు దూరంగా ఉండాలి. అలాగే వీలైనంత వరకు చక్కెర పదార్థాలను తినకూడదు.

రెమిడీ..
బొప్పాయి ఆకుల రసాన్ని (20 ఎంఎల్‌ రెండు లేదా మూడుసార్లు) తాగాలి.
ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పెరగటానికి ఇది మంచి ఆహారం. రుచి కాస్త చేదుగా ఉంటుంది.. కాబట్టి కొద్దిగా తేనెను కలిపి తీసుకోవచ్చు. తిప్పతీగ రసంతో, వీట్‌గ్రాస్, ఉసిరిని కలిపి తీసుకుంటే ఇమ్యూనిటీ పెరగడంతోపాటు ప్లేట్‌లెట్‌ సంఖ్య పెరుగుతుంది.

కాస్త ఆరోగ్యం కుదుట పడిన తర్వాత సాధ్యమైనంత వరకు విటమిన్‌ డీ పొందడానికి ఎండలో కాసేపు ఎక్సర్‌సైజ్‌ చేయడం మంచిది. సమతూల్య ఆహారం కోసం తెలుపు రంగుల్లో ఉండే చక్కెరతోపాటు ప్రాసెస్డ్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. డెంగీ వేరియంట్లు కూడా పెరుగుతున్నాయి. సాధ్యమైనంత వరకు దోమకాటుకు దూరంగా ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
Published by:Renuka Godugu
First published:

Tags: Dengue fever

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు