హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Skincare with Watermelon: మీ స్కిన్ డల్‌గా కనిపిస్తుందా..? ఇది తింటే మిలమిలా మెరిసిపోవడం ఖాయం..!

Skincare with Watermelon: మీ స్కిన్ డల్‌గా కనిపిస్తుందా..? ఇది తింటే మిలమిలా మెరిసిపోవడం ఖాయం..!

పుచ్చకాయతో చర్మ సౌందర్యం

పుచ్చకాయతో చర్మ సౌందర్యం

వానాకాలంలో తలెత్తే అన్ని చర్మ సమస్యలకు పుచ్చకాయ (Watermelon) చెక్ పెడుతుంది. దీనిని సరిగ్గా వాడుకుంటే మీ స్కిన్ మెరిసిపోతుంది. మరి ఈ పుచ్చకాయను అందమైన చర్మం కోసం ఎలా వాడాలో చూద్దాం.

ప్రతి కాలంలో చర్మంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఒక కాలం మారి ఇంకొక కాలంలోకి అడుగుపెట్టగానే చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుకునేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ప్రస్తుతం వర్షాకాలం (Monsoon) కొనసాగుతోంది కాబట్టి ఈ కాలానికి అనుగుణంగా చర్మ సంరక్షణ (Skin Care)పై తగిన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ సీజన్‌లో ఒక్కోసారి ఎండలు మండి పోవడం వల్ల గాలిలో తేమ శాతం పెరిగి చర్మంపై ప్రభావం పడుతుంది. ఒకేసారి వచ్చే ఈ మార్పులకు చర్మం సిద్ధంగా ఉండదు కాబట్టి మెరుస్తున్న చర్మం ఒక్కసారిగా డల్ అయిపోతుంది. జిడ్డు, మొటిమలు వచ్చే చర్మం ఉన్నవారికి ఈ కాలం మరింత ఇబ్బంది పెడుతుంది. అయితే వానాకాలంలో తలెత్తే అన్ని చర్మ సమస్యలకు పుచ్చకాయ (Watermelon) చెక్ పెడుతుంది. దీనిని సరిగ్గా వాడుకుంటే మీ స్కిన్ మెరిసిపోతుంది. మరి ఈ పుచ్చకాయను అందమైన చర్మం కోసం ఎలా వాడాలో చూద్దాం.

* చర్మ రక్షణకు పుచ్చకాయ

పుచ్చకాయలు ఎండాకాలంలోనే దొరుకుతాయి. వేసవి కాలంలో అందుబాటులోకి వచ్చే పుచ్చకాయలు వర్షాకాలంలోనూ లభిస్తాయి. ఈ రుచికరమైన పుచ్చపండులో విటమిన్లు A, C, E పుష్కలంగా లభిస్తాయి. ఈ విటమిన్లు కొల్లాజెన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. విటమిన్ సి కొల్లాజెన్‌ను నియంత్రించి ముఖంపై వృద్ధాప్య గీతలు, ముడతలను తగ్గిస్తుంది. ముడతలు తిరిగి రాకుండా సహాయపడుతుంది. పుచ్చకాయలోని గుజ్జు మాత్రమే కాదు దాని తొక్క, గింజలు కూడా పోషక విలువలు అందజేస్తాయి. ముఖ్యంగా తొక్కలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు వాపును తగ్గించడంలో సహాయపడతాయి. వీటి గింజలను వేయించుకొని తినడం ద్వారా కూడా మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. పుచ్చకాయను రకరకాల మార్గాల్లో వాడుతూ చర్మ సౌందర్యాన్ని రక్షించుకోవచ్చు. డార్క్ స్పాట్స్, మచ్చలు, బ్యాడ్ స్కిన్ టోన్‌ను వదిలించడంలో పుచ్చకాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది.

* చర్మం మిలమిల మెరిసేందుకు పుచ్చకాయను ఎలా ఉపయోగించాలి?

- పుచ్చకాయను మీ ఆహారంలో భాగం చేసుకోవాలి. పుచ్చకాయ మీ శరీరం, చర్మాన్ని ఆరోగ్యంగా, హైడ్రేట్ గా ఉంచుతుంది.

- స్కిన్ కేర్ రొటీన్‌లో పుచ్చకాయను స్కిన్ టోనర్‌గా కూడా ఉపయోగించవచ్చు. అరకప్పు పుచ్చకాయ రసం తీసుకుని అందులో కొన్ని చుక్కల తేనె, రోజ్ వాటర్, వాటర్ కలపితే సహజసిద్ధమైన స్కిన్ టోనర్ రెడీ అయిపోతుంది. దీనిని రోజులో ఒకట్రెండు సార్లు ముఖంపై అప్లై చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

- మీ ముఖాన్ని తేమగా ఉంచడానికి, కొన్ని పుచ్చకాయ ముక్కలను మెత్తగా చేసి, రెండు-మూడు టేబుల్ స్పూన్ల పచ్చి పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై అప్లై చేసి 10-12 నిమిషాల పాటు అలాగే ఉంచాలి, ఆ తర్వాత శుభ్రంగా బ్రష్ చేసుకోవాలి.

- ఒక పుచ్చకాయ తొక్కను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోని వాటిని బ్లెండర్‌లో వేయాలి. అందులో కొంత నిమ్మరసం యాడ్ చేయాలి. దీన్ని బ్లెండ్ చేసి, పేస్ట్‌ను ఐస్ ట్రేలో యాడ్ చేసుకోవాలి. ఐస్ లాగా మారిన ఈ పేస్టుతో ముఖంపై రుద్దుకుంటే చర్మ రంధ్రాలలో పేరుకుపోయిన దుమ్ము, ధూళి తొలగిపోతాయి.

- సూర్య కిరణాల వల్ల తలెత్తే టానింగ్, ఫొటోఏజింగ్ నుంచి రక్షించుకోవడానికి పుచ్చకాయతో తయారుచేసిన సన్‌స్క్రీన్‌లను ఎంచుకోవడం మంచిది.

First published:

Tags: Fruits, Health, Skin care, Water melon

ఉత్తమ కథలు