అబ్బాయిలతో కలిసి రెస్టారెంట్స్‌కి వెళ్తున్నారా..

ప్రతీకాత్మక చిత్రం

చాలా విషయాల్లో అమ్మాయిలు ముందుంటారు. కానీ.. తిండి విషయంలో మాత్రం కాస్తా వెనుకే అని చెబుతున్నాయి పరిశోధనలు.. ఆ వివరాలేంటో తెలుసుకోండి.

  • Share this:
కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్స్‌తో కలిసి రెస్టారెంట్స్, హోటల్స్‌కి వెళ్తుంటాం. ఇష్టంగా తింటుంటాం. ఇలాంటి సందర్భాల్లో అమ్మాయిలు కాస్తా తక్కువగా తినడం.. అబ్బాయిలు ఎక్కువగా తినడం చూస్తుంటాం. అది కేవలం ఆ సందర్భంలోనే అనుకుంటే పొరపాటే. ఏ సందర్భాల్లోనైనా అబ్బాయిలతో కలిసి అమ్మాయిలు రెస్టారెంట్స్‌కి వెళ్లినప్పుడు అమ్మాయిలకంటే అబ్బాయిలే ఎక్కువగా లాగించేస్తారట. ఇది ఊరికే చెప్పే మాటలు కాదు.. 105మంది పెద్దవాళ్లపై రెండు వారాల పాటు పరిశీలంచిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తెలియజేశారు.

కార్నెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ పరిశోధనలో తేలిన విషయమేంటే.. అమ్మాయిలతో ఉన్నప్పుడు వారిగురించి గొప్పగా అనుకోవాలని అబ్బాయిలు ఇలా చేస్తారని తెలిసింది. ఆడవారితో కూర్చుని తినే మగవారు 93 శాతం ఎక్కువగా తింటే... తోటి పురుషులతో కూర్చుని తినేవారు.. 86శాతం తిన్నారు. ఆడవాళ్లుమాత్రం.. మగవారు, ఆడవారు ఎవరున్నా సరే ఒకేలా తింటారట.


మామూలు విషయాల్లోనే అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలని మగవారు తెగ తాపత్రయపడతారు. ఈ నేపథ్యంలో ఎన్నో స్టంట్స్ చేస్తుంటారు. కాబట్టి.. ఆడవారితో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా తిని తమ శక్తిసామర్థ్యాలు ఇవేనని చెప్పే ప్రయత్నమే అని చెబుతున్నారు పరిశోధకులు. సో... చెప్పాల్సింది చెప్పాం.. రెస్టారెంట్‌కి వెళ్లడం వెళ్లకపోవడం మీ ఇష్టమేనని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
First published: