హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Pumpkin Seeds: ఈ గింజలు తిన్నారంటే చాలు.. కిడ్నీలో రాళ్ళు ఇట్టే కరిగిపోతాయి.. అంతే కాదు మరెన్నో లాభాలు !

Pumpkin Seeds: ఈ గింజలు తిన్నారంటే చాలు.. కిడ్నీలో రాళ్ళు ఇట్టే కరిగిపోతాయి.. అంతే కాదు మరెన్నో లాభాలు !

ఈ గింజలు తిన్నారంటే చాలు.. కిడ్నీలో రాళ్ళు ఇట్టే  కరిగిపోతాయి

ఈ గింజలు తిన్నారంటే చాలు.. కిడ్నీలో రాళ్ళు ఇట్టే కరిగిపోతాయి

గుమ్మడి (pumpkin )గింజల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఎన్నో వందల ఏళ్ల క్రితమే వాటి గింజల్లో ఔషధ గుణాలు ఉన్నాయని గుర్తించారు మన భారతీయులు. వీటిని తరచూ తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు(stones) కరిగిపోతాయి, మూత్రాశయ ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇంకా చదవండి ...

గుమ్మడి గింజల్లో పోషకాలు(Nutrient) సమృద్ధిగా ఉంటాయి. ఎన్నో వందల ఏళ్ల క్రితమే వాటి గింజల్లో ఔషధ గుణాలు ఉన్నాయని గుర్తించారు మన భారతీయులు. వీటిని తరచూ తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయి, మూత్రాశయ ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే హైబీపీ తగ్గించడంలో ఈ గింజలు కీలకపాత్ర పోషిస్తాయి. గుమ్మడి(Pumpkin) గింజల్లో B1, B2, B3, B5, B6, B9, C, E, K వంటి విటమిన్‌లు పుష్కలంగా ఉంటాయి. వీటితో ప్రధాన ఉపయోగాలు ఏంటో చూద్దాం.

క్యాన్సర్ నిరోధకంగా..

సైన్స్ డైరెక్ట్‌లోని ఒక రిపోర్ట్ ప్రకారం.. గుమ్మడి గింజల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి వీటిని తరచు తీసుకుంటే కొలొరెక్టల్, రొమ్ము, కడుపు క్యాన్సర్‌ల రిస్క్‌ తగ్గుతుంది.

మధుమేహ నియంత్రణలో..

గుమ్మడి గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో మధుమేహం ఉన్నవారు ఈ గింజలను తింటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

మెరుగైన నిద్రకు..

గుమ్మడి గింజల్లో అమినో యాసిడ్ ఉంటుంది. ఇది మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. అలాగే వీటిలో ట్రిప్టోఫాన్, జింక్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ నిద్రను మెరుగుపర్చడంలో ముఖ్య భూమికను పోషిస్తాయి. నిద్రను మెరుగుపర్చడం కోసం నిద్రపోయే ముందు ఒక గ్రాము గుమ్మడి గింజలను తినండి.

ఎముకల బలానికి..

గుమ్మడి గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఈ పోషకం ఎముకలు బలంగా పెరిగేలా చేస్తుంది. అలాగే రక్తపోటు, రక్తంలో షుగర్ లెవల్స్, గుండె, ఎముకల ఆరోగ్యానికి సరిపడినంత మెగ్నీషియం లెవల్స్ అవసరం. గుమ్మడికాయ గింజలు ఎముకలు పగుళ్లు వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తాయి.

ఇదీ చదవండి:  Punjab Schools: తెలుగు భాషకు అరుదైన గౌరవం.. ఆ రాష్ట్రంలో బోధించాలని నిర్ణయం.. తలలు పట్టుకుంటున్న టీచర్లు!

చర్మ సంరక్షణకు..

గుమ్మడి గింజలు, వాటి నూనె చర్మ సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే విటమిన్ ఏ, సీ.. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. గాయాలను నయం చేయడంలో కొల్లాజెన్ ఔషధంగా పనిచేస్తోంది. ఇది చర్మాన్ని యవ్వనంగా, ముడతలు లేకుండా ఉంచేందుకు సహాయపడుతుంది. గుమ్మడి గింజల నూనెలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, కెరోటిన్ ఉంటాయి. ఇవి మొటిమలు, బొబ్బలు, చర్మ సంబంధ దీర్ఘకాలిక మంటలను నయం చేస్తాయి. ఈ గింజలను స్క్రబ్, లోషన్ రూపంలో లేదా మసాజ్ చేసినప్పుడు బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి కూడా రక్షణ పొందవచ్చు.

గుండె జబ్బుల నివారణకు..

గుమ్మడికాయ గింజలను తరచు తీసుకుంటూ ఉండాలి. దీంతో కొలెస్ట్రాల్ , రక్త నాళాలు గట్టిపడకుండా ఇవి నిరోధిస్తాయి. అలాగే కొరోనరీ ఆర్టరీ వ్యాధి, స్ట్రోక్ వంటి వివిధ గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో గుమ్మడి గింజలు అద్భుతంగా పనిచేస్తాయి.

జుట్టు పెరుగుదలకు..

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు గుమ్మడి గింజల్లో మంచి మోతాదులో ఉంటాయి. అలాగే జింక్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీంతో బట్టతల సమస్యను తొలగించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే జుట్టు రాలడం లాంటి సమస్యలను నివారించడంలో సహాయకారిగా పనిచేస్తాయి.

కాగా, ఆహారంలో గుమ్మడికాయ గింజలను అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు. వీటితో స్మూత్‌గా గార్నిష్ చేసుకోవచ్చు. అలాగే పెరుగు లేదా తృణధాన్యాలతో కలుపుకోవచ్చు. అంతేకాకుండా కుకీలుగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇంకా సలాడ్ కూడా చేసుకోవచ్చు.

Published by:Mahesh
First published:

Tags: Blood pressure, Cancer, Health Tips, Sugar

ఉత్తమ కథలు