EATING THESE 4 FOOD ITEMS WITH CURD HAVING MANY HEALTH BENEFITS HERE DETAILS NS
Health Tips: పెరుగుతో పాటు ఈ 4 పదార్థాలు కలిపి తింటే ఆరోగ్యానికి మంచిది.. అవేంటంటే?
ప్రతీకాత్మక చిత్రం
మనలో చాలా మంది నిత్యం పెరుగు తీసుకుంటూ ఉంటాం... అయితే పెరుగుతో పాటు ఈ 4 ఫుడ్ ఐటెమ్స్ కలిపి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
పెరుగు ప్రోబయోటిక్ కాబట్టి దానిని తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. వేసవిలో పెరుగును క్రమం తప్పకుండా తీసుకుంటే గుండెల్లో మంట ఆగిపోయి కడుపు చల్లబడుతుంది. పెరుగు మీ ఎముకలకు కూడా మంచిది. ఇందులోని కాల్షియం మీ దంతాలు మరియు గోళ్లను బలపరుస్తుంది. పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ కండరాలు సరిగ్గా పని చేస్తాయి. (Curd Benefits For Health). పెరుగులో కొన్ని పదార్థాలు కలిపి తినడం వల్ల అనేక వ్యాధులు తగ్గుతాయి. పెరుగులో క్యాల్షియం, ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో లాక్టోస్, ఐరన్ మరియు ఫాస్పరస్ కూడా ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పెరుగు కలపడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పెరుగు మరియు జీలకర్ర:
పెరుగు, జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మీరు బరువు సమస్యతో బాధపడుతుంటే, మీరు పెరుగుతో జీలకర్ర తింటే, మీరు ఖచ్చితంగా దాని నుండి ప్రయోజనం పొందుతారు. దీని కోసం ముందు మీరు జీలకర్రను కాస్త వేయించండి. ఆ తర్వాత పెరుగులో కలుపుకుని తినాలి.
2. పెరుగు-చక్కెర -
పెరుగు మరియు చక్కెర మీ ఆరోగ్యానికి మంచిది. ఈ రెండింటిని కలపడం వలన దగ్గు తగ్గుతుంది. మీకు ఎనర్జీ కూడా లభిస్తుంది.
3. పెరుగు మరియు సెంధవ్ ఉప్పు -
పెరుగు మరియు సైంధవ లవణం కలిపి తింటే ఎసిడిటీ రిస్క్ తగ్గుతుంది.
4. పెరుగు మరియు గుడ్డు -
పెరుగు మరియు కోడిగుడ్డు కలిపి తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి మేలు జరుగుతుంది. మీకు పంటి నొప్పి ఉంటే, ఈ రెండు పదార్థాలను కలిపి తినండి. ఇది నోటి అల్సర్ల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.