Food Alert: రోజూ బియ్యం తింటే క్యాన్సర్​ వచ్చే ప్రమాదం.. జాగ్రత్తలు తీసుకోండిలా..

ప్రతీకాత్మక చిత్రం

ఈ రోజుల్లో బియ్యంతో తయారు చేసే పదార్థాల వినియోగం కూడా వేగంగా పెరుగుతోంది. అయితే, బియ్యంలో ఆర్సెనిక్ ఉండటంతోనే సమస్య వచ్చింది. దీని కారణంగా క్యాన్సర్​ ముప్పు పొంచి ఉంది.

  • Share this:
    ప్రపంచంలో చాలా మంది అన్నం(food) తింటారు. ఇది మామూలే కదా అనుకుంటున్నారా? అయితే మనం తినే ఆహారం.. ముఖ్యంగా బియ్యం(rice)లో క్యాన్సర్​ను కలిగించే హానికర పదార్థాలు కూడా ఉన్నాయని తెలిసింది. ఈ రోజుల్లో రైస్​ను పాలకు ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగిస్తున్నారు. బియ్యంతో తయారు చేసే పదార్థాల వినియోగం కూడా వేగంగా పెరుగుతోంది. అయితే, బియ్యంలో ఆర్సెనిక్ ఉండటంతోనే సమస్య వచ్చింది. దీని కారణంగా క్యాన్సర్​ ముప్పు పొంచి ఉంది. అయితే దీనికి పరిష్కారం ఉందా అంటే ఉందంటున్నారు నిపుణులు(experts). ఆర్సెనిక్ సహజంగా తయారయ్యే ఒక మూలకం. అది మట్టి, నీళ్లలో కూడా ఉంటుంది. ఆర్సెనిక్ విషపూరితం కావచ్చు.  భారత్ లో ఈశాన్య రాష్ట్రాల్లో బియ్యంలో ఆర్సెనిక్ స్థాయి గురించి చాలాసార్లు ఆందోళన చెందింది. ఇంతకు ఈ హానికర పదార్థాలు బియ్యంలోకి ఎలా వచ్చాయో తెలుసుకుందాం..

    బియ్యంలో ఆర్సెనిక్ స్థాయి ఎక్కువగా ఉంటుందట. మనుషుల్లో క్యాన్సర్​ రావడానికి ఆర్సెనిక్ కారణం కావచ్చు.  వరి పొలాలకు నీళ్లు ఎక్కువగా ఉపయోగించడం దీనికి ప్రధాన కారణం. దానివల్ల ఆర్సెనిక్ మట్టిలో నుంచి వరి ధాన్యంలోకి చేరడం చాలా సులభం అవుతుంది. బియ్యంలో ఆర్సెనిక్ ఉండటంపై  ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO), ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ గైడ్‌లైన్స్ విడుదల చేసింది.  తెల్లటి పాలిష్ వరి అన్నాన్ని తింటే టైప్ -2 మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గోధుమ రంగులో ఉండే ముతకబియ్యపు అన్నం తినడం వల్ల ఈ ముప్పు తగ్గుతుంది. పాలిష్డ్ బియ్యం బదులు ముడి బియ్యం వినియోగిస్తే టైప్ -2 మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. పీచుపదార్థం, ఖనిజాలు, విటమిన్లు, ఫైటోకెమికల్స్ వంటి అవసరమైన పోషకాలు గోధుమరంగు బియ్యంలో ఎక్కువగా ఉంటాయి. భోజనం చేశాక .. రక్తంలో చక్కెర పరిమాణాన్ని కూడా ఎక్కువగా పెంచడం. బియ్యాన్ని పాలిష్ చేయడం వల్ల విటమిన్లు, ఖనిజాలు, పోతాయి.

    మనకు వరే ఆధారం..

    ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో వరి ప్రధాన ఆహారంగా ఉంది. బియ్యం సరఫరా తగినంత ఉండటం కూడా ఆహార భద్రతకు చాలా ముఖ్యం. ఆహార పదార్థాల్లో ఆర్సెనిక్ లాంటి విషపూరిత పదార్థాలు ఉండటం వల్ల మనుషులకు నష్టం కలగవచ్చు. అది దూరం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్సెనిక్ ఎంత ఉంటే తక్కువ ప్రమాదకర కేటగిరీలోకి వస్తుంది అంటే దానికి మనం అమెరికాకు చెందిన ఓ ఏజెన్సీ రిపోర్ట్ పరిశీలిస్తే... 70 కిలోలకు పైగా బరువున్న వ్యక్తి రోజుకు వంద గ్రాముల బియ్యం వినియోగించడం సరిపోతుందట. కానీ ఈ గణాంకాలను రోజువారీగా తీసుకునే లక్ష్యంగా చూడకూడదు. ఎందుకంటే, అవసరమైన ఆహార పదార్థాలు, నీళ్ల ద్వారా కూడా మన శరీరంలోకి ఆర్సెనిక్ చేరవచ్చు అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ఉడికించే సమయంలో నీళ్లు మార్చడం కూడా అన్నంలో ఆర్సెనిక్ స్థాయిని తగ్గిస్తుంది. ఇలా మనం క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడొచ్చు.
    Published by:Prabhakar Vaddi
    First published: