Home /News /life-style /

EATING MORE SUGAR IN CHILDHOOD MAY LEADS TO SOME ILLNESS IN FUTURE AK

Children Food: పిల్లల ఆహారం విషయంలో ఈ జాగ్రత్త కచ్చితంగా తీసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Children: బాల్య దశలో చక్కెర, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో సూక్ష్మజీవులు ఏర్పడతాయని, పెద్దయ్యాక చక్కర వినియోగాన్ని తగ్గించినప్పటికీ వాటి ప్రభావం కొనసాగుతుందని అధ్యయనం తేల్చి చెప్పింది.

    పంచదార అన్న పదం వినగానే నోట్లో నీళ్ళూరుతాయి. ముఖ్యంగా చిన్నతనంలో పంచదారను ఎక్కువగా తింటుంటాం. అయితే, చిన్నతనంలో ఇలా చక్కెర, కొవ్వు పదార్థాలు తినడం వల్ల అనేక సమస్యలు వస్తాయని, శరీరంలో ఫంగస్, బ్యాక్టీరియా ఏర్పడుతుందని ఎలుకలపై జరిగిన ఒక అధ్యయనంలో తేలింది. బాల్య దశలో చక్కెర, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో సూక్ష్మజీవులు ఏర్పడతాయని, పెద్దయ్యాక చక్కర వినియోగాన్ని తగ్గించినప్పటికీ వాటి ప్రభావం కొనసాగుతుందని అధ్యయనం తేల్చి చెప్పింది. మానవుల, జంతువుల ప్రేగులలో పేరుకుపోయే ఈ బ్యాక్టీరియా శిలీంధ్రాలు, పరాన్నజీవులు, వైరస్లను ఏర్పరుస్తాయని అధ్యయనం పేర్కొంది. దీనితో పాటు శరీర రోగనిరోధక శక్తి తగ్గించి, ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తుందని స్పష్టం చేసింది.

    అధ్యయన ఫలితాలపై థియోడర్ గార్లాండ్ మాట్లాడుతూ "అతిగా చక్కర వినియోగించడం వల్ల శరీరంలో కలిగే ప్రతికూల ప్రభావాలపై మా అధ్యయనం కొనసాగింది. మా పరిశోధన కోసం ఎలుకలను ఎంచుకున్నాము. మా అధ్యయనం ఎలుకలపై జరిగినప్పటికీ, దీని ఫలితాలు 6 సంవత్సరాలలోపు పిల్లలకు కూడా వర్తిస్తాయి. పిల్లలు కొవ్వు, చక్కెర అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల, వారిలో గట్ మైక్రో బ్యాక్టీరియా ఏర్పడుతుంది." అని ఆయన అన్నారు.

    నాలుగు గ్రూపులుగా విభజించి ఎలుకలపై అధ్యయనం..
    అధ్యయనం కోసం, మొత్తం ఎలుకలను నాలుగు గ్రూపులుగా విభజించారు. వాటిలో మొదటి గ్రూపుకు ఆరోగ్యకరమైన ఆహారం, రెండో గ్రూపుకు చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాన్ని అందించారు. ఇక మూడో గ్రూపుకు సాధారణ ఆహారాన్ని కొనసాగిస్తూనే క్రమం తప్పకుండా రన్నింగ్ వంటి వ్యాయామలను చేయించారు. నాలుగో గ్రూపుకు ఎక్సర్సైజ్ లేకుండా సాధారణ ఆహారన్ని కొనసాగించారు. ఇలా, దాదాపు మూడు వారాల పాటు తమ పరిశోధనను కొనసాగించారు.

    Weight Loss: బరువు తగ్గాలని ట్రై చేస్తున్నారా.. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా చేయండి

    మీరు నాన్ వెజ్ తినరా ?.. అయితే ప్రొటీన్లు పుష్కలంగా లభించే ఈ ఆహారాలను తీసుకోండి..

    మూడు వారాల తర్వాత అన్నింటికీ ఎటువంటి వ్యాయామం లేకుండా సాధారణ ఆహారాన్ని అందజేశారు. ఆ తర్వాత వాటిని 14 వారాల పాటు ప్రయోగశాలలో పెట్టి అధ్యయనం చేయగా.. అనేక ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. చక్కర, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తిన్న ఎలుకల్లో బ్యాక్టీరియా పరిమాణం గణనీయంగా పెరిగడమే కాకుండా, వాటిలో రోగనిరోధక శక్తి తగ్గిందని కనుగొన్నారు. అంతేకాక, ఈ రకమైన బ్యాక్టీరియా జీవక్రియపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని అధ్యయనంలో తేలింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Children, Sugar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు