Health Tips : పిల్లలు లేనివారు ఈ జాగ్రత్తలు తీసుకోండి..

Health Tips | చాలామంది దంపతులు తల్లిదండ్రులు కావాలనుకుంటారు. అందుకోసం ఎంతో ఖర్చు పెడతారు. హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటారు. అయితే.. ఆడవారిలో రకరకాల కారణాలుంటాయి. మగవారిలో మాత్రం.. శుక్రకణాలు కారణంగానే సంతానలేమి సమస్య ఏర్పడుతుంది. అలాంటివారు.. జీవనశైలి విషయంలో కొన్ని మార్పులు చేయడం వల్ల సత్ఫలితాలు పొందుతారు.

Amala Ravula | news18-telugu
Updated: June 30, 2019, 5:44 PM IST
Health Tips : పిల్లలు లేనివారు ఈ జాగ్రత్తలు తీసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం వల్ల శుక్రకణాలు బాగా ఉత్పత్తి అవుతాయి. దీంతో సంతాన సమస్యలు దూరమవుతాయని తేలింది. కాబట్టి పిల్లలు కావాలనుకునేవారు తరచూ ఎక్సర్‌‌సైజ్‌లు చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా.. కాలుష్యం కారణంగా వీర్యకణాల సంఖ్య తగ్గుతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి.. కాలుష్యంలో బయటికి వెళ్లినప్పుడు తగినజాగ్రత్తలు తీసుకోవాలి.

వీటితో పాటు ఆహార విషయాల్లోనూ కొన్ని మార్పులు చేసుకోవాలి. గుమ్మడి విత్తనాలు సంతాన సమస్యలను దూరం చేయడంలో బాగా పనిచేస్తాయి. వీటిని ఏ రూపంలో తీసుకున్నా ఫలితం ఉంటుంది. ఇక చేపలు ఎక్కువగా తినడం వల్ల మగవారిలో వీర్యం నాణ్యంగా ఉంటుందని.. అందువల్ల పిల్లలు కావాలనుకునేవారు రెగ్యులర్‌గా చేపలు తీసుకోవాలని చెబుతున్నారు.

అదేవిధంగా.. టమోటాలోని లైకోఫిన్ సంతానసమస్యలు దూరం చేస్తుంది. వీటితోపాటు నువ్వులు కూడా రెగ్యులర్‌గా తీసుకుంటుంటే చాలావరకూ ఫలితం కనబడుతుందని నిపుణులు చెబుతున్నారు.
First published: June 30, 2019, 5:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading