వెజిటేరియన్ ఫుడ్‌ తీసుకుంటే ఎక్కువరోజులు బతుకుతారట.. ఇదిగో ప్రూఫ్..

అందరూ జీవిస్తారు. కానీ, జీవించినంత కాలం ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. ఇలా హెల్దీగా ఉండేందుకు కొన్ని ఆహారాలున్నాయి. అందులో ముఖ్యంగా చిలగడదుంప ఒకటి. ఇది ఊరికే చెబుతున్నది కాదు.. ఇందుకు ఖచ్చితమైన ఆధారాలు కూడా ఉన్నాయి.

Amala Ravula | news18-telugu
Updated: March 14, 2019, 11:16 AM IST
వెజిటేరియన్ ఫుడ్‌ తీసుకుంటే ఎక్కువరోజులు బతుకుతారట.. ఇదిగో ప్రూఫ్..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: March 14, 2019, 11:16 AM IST
జపాన్‌లోని ఒకినావ దీవుల్లో జీవించే ప్రజలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అక్కడి జనాభాల్లో ప్రతిలక్ష మందిలో నూరెళ్లు పూర్తిచేసుకున్నవారు 70మంది వరకూ ఉంటారు. ఇది ఎలా సాధ్యమని ఎంతోమంది శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. ఈ క్రమంలోనే ఓ విషయం తెలిసింది. అదేంటంటే.. అక్కడి ప్రజలు చాలావరకూ ప్రోటీన్ ఫుడ్ కంటే పిండిపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తింటారు. అందులో ఖచ్చితంగాచిలగడదుంప ఉండేలా చూసుకుంటారు.
ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్, గుండెజబ్బులు, అల్జీమర్స్ వంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. దీనివల్ల ఒత్తిడి తగ్గి ఆయుష్షు పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

అదేవిధంగా, ఒకినావా ప్రజలు చక్కని ఆహారనియమాలు పాటిస్తారని, పచ్చని కూరగాయలు, ఆకుకూరలు తింటూ మాంసాన్ని తక్కువగా తింటారట. వీరు తీసుకునే ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉండి కెలోరీలు తక్కువగా ఉంటాయి. అదేవిధంగా.. శారీరక శ్రమ కూడా వీరి ఆరోగ్యానికి మూలకారణం అంటున్నారు.
First published: March 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...