Cashews: జీడిపప్పును రోజూ తినే అలవాటుందా..? ఆరోగ్యానికి మంచిదో.. కాదో తెలుసుకోండి..!

జీడిపప్పు

మీకు జీడిపప్పు తినే అలవాటుందా..? అయితే వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ముందు తెలుసుకోండి..!

  • Share this:
శరీరానికి పోషకాలు అందించే ఆహారాలన్నింటిలో డ్రైఫ్రూట్స్, నట్స్ ది ముఖ్య పాత్ర. నట్స్ లో అందరూ ఎక్కువగా ఇష్టపడే వాటిలో ముందుంటుంది జీడి పప్పు. ధర కాస్త ఎక్కువైనప్పటికీ జీడిపప్పును ఎన్నో రకాల ఆహార పదార్థాల్లో ప్రత్యేకంగా ఉపయోగిస్తారు కాబట్టి దాని రుచికి మనమంతా అలవాటు పడిపోయాం. అయితే రుచికరంగా ఉండటమే కాదు.. జీడిపప్పులో ఎన్నో పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి శరీరానికి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి.

జీడిపప్పు ఎంతో ఆరోగ్యకరం..
వీటిలో చక్కెర శాతం తక్కువ.
జీడిపప్పులో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి
ఎముకలు, మెదడుకు మేలు చేకూర్చే పోషకాలైన రాగి, మెగ్నీషియం, యాంటిఆక్సిడెంట్లు లాంటివి కూడా ఇందులో ఎక్కువే.
తక్కువ మోతాదులో తీసుకుంటే బరువు తగ్గడానికి కూడా ఇవి తోడ్పడతాయి.
గుండే ఆరోగ్యానికి మంచిది.
డయాబెటిస్ రోగులకు మంచి డైట్ గా పనిచేస్తుంది. రుచితో పాటు పోషకాలను అందిస్తుంది.
శక్తిమంతమైన ప్రొటీన్లు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

ఇందులోని పోషకాలు
జీడిపప్పులో ప్రొటీన్ల తో పాటు కొవ్వులు కూడా ఉంటాయి. ఇవి మన శరీరానికి అవసరమైనవి కాబట్టి తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మంచి జరుగుతుంది.
జీడిపప్పులో సూక్ష్మ పోషకాలు కూడా ఉన్నాయి..
ఇందులోని రాగి మీ మెదడు, రోగనిరోధక వ్యవస్థ మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది.
విటమిన్ కే.. రక్తం గడ్డకట్టే అవసరాలను తీరుస్తుంది
మెగ్నీషియం.. వ్యాధి నివారణకు తోడ్పడుతుంది
కాల్షియం.. ఎముకల, దంతాల దృఢత్వాన్ని కాపాడుతుంది.

జీవిత కాలం పెంచుతుంది.
జీడిపప్పులో శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫినైల్స్, కెరోటినాయిడ్స్ లాంటివి ఉన్నాయి. ఇది శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లను కూడా పెంచుతుంది. తద్వారా జీవిత కాలం కూడా పెరుగుతుందట.

బరువు తగ్గిస్తుంది.
జీడిపప్పు ఆరోగ్యకర రీతిలో బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కొవ్వు శాతం తగ్గించేందుకు తోడ్పడతాయి. ఓ పరిశోధన ప్రకారం రోజుకు కొన్ని జీడిపప్పులను తీసుకోవడం వల్ల ఉబకాయం, టైప్-2 డయాబెటిస్ తగ్గుతుందట. ముడి జీడిపప్పులో ఔన్సుకు 157 క్యాలరీలు ఉన్నప్పటికీ మన శరీరం అందులో 84 క్యాలరీలను మాత్రమే గ్రహిస్తుంది. అదే వేయించినప్పుడు పూర్తి క్యాలరీలను శరీరం గ్రహించగలుగుతుంది.
ఇది కూడా చదవండి: నిద్ర లేవగానే కాఫీ తాగుతున్నారా..? కాఫీ తాగేందుకు కరెక్ట్ టైం ఏదో మీకు తెలుసా..?

గుండెకు మంచిది.
జీడిపప్పు గుండెకు చాలా మంచి కలిగిస్తుంది.. 2017లో ఓ అధ్యయనం ప్రకారం వారానికి 2 గుప్పిళ్లు జీడిపప్పులు తినేవారిలో గుండె జబ్బు ప్రమాదం 15 నుంచి 23 శాతం తక్కువగా ఉంటుందని తేలింది. మరొక అధ్యయనంలో బంగాళదుంప చిప్స్ కు బదులు రోజూ జీడిపప్పును అల్పాహారంగా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చని తేలింది. కేవలం 28 రోజుల్లోనే ఈ మార్పు కనిపిస్తుందని తేల్చారు. చెడు కొవ్వును తగ్గించడం, రక్త పోటును తగ్గించడం వల్ల జీడిపప్పు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

డయాబెటిస్ రోగులకు ఉపయోగకరం..
వేయించిన జీడిపప్పులు రోజూ తినడం వల్ల టైప్-2 డయాబెటిస్ తగ్గుతుందట. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఇవి టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. స్నాక్స్ గా వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. రోజువారీ క్యాలరీల్లో 10 శాతం తగినంత జీడిపప్పు తీసుకుంటే 8 వారాల తర్వాత బ్లడ్ షుగర్ స్థాయులు తగ్గడం గమనించవచ్చు.
ఇది కూడా చదవండి: టమోటాలతో ఇన్ని లాభాలా..? బ్లాక్ హెడ్స్, మొటిమల సమస్యలకు ఇలా చెక్ పెట్టండి..!

గర్భాధారణలోనూ..
జీడిపప్పులోని పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు పిండాన్ని అభివృద్ధి చేయడానికి అద్భుతంగా పనిచేస్తాయి. జంతువులపై చేసిన అధ్యయనంలో తల్లులు జీడిపప్పు తిన్నప్పుడు శిశువులు వేగంగా ప్రతిచర్యలు చేయడం, బలమైన జ్ఞాపకశక్తి కలిగి ఉండడం వంటివి పరిశోధకులు కనుగొన్నారు.

రోజువారీ ఆహారంలో జీడిపప్పును ఎలా జోడించాలి..
కొన్ని పచ్చి జీడిపప్పులు మధ్యాహ్నం సమయంలో తినవచ్చు. కొద్దిగా ఉప్పు లేదా తేనె వేసి వేయించుకుంటే తింటే ఇంకా రుచిగా ఉంటుంది. జీడిపప్పును ఇతర నట్స్ తో లేదా డ్రైఫ్రూట్స్ తో కలిపి తీసుకుంటే మంచిది. అంతేకాకుండా వీటిని ఫ్రూట్ సలాడ్ పై చల్లుకుని తింటే ఇంకా బాగుంటుంది. సూప్ లో లేదా జీడిపప్పు పాలలో వేసి తీసుకోవచ్చు. జావ, స్మూతీస్, టోస్ట్ లేదా స్నాక్ బార్స్, ఐస్ క్రీమ్ ఇలా రకరకాల పదార్థాల రూపంలో తీసుకోవచ్చు.
Published by:Hasaan Kandula
First published: