Home /News /life-style /

EATING BANANAS WILL MAKE YOU SLEEP COMFORTABLY AND PEACEFULLY AT NIGHT PRV

Sleep tips: అరటి పండు తింటే రాత్రిళ్లు నిద్ర తొందరగా, హాయిగా పడుతుందా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అరటి పండ్లలో (banana) సహజసిద్ధమైన కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది. ఇవి మంచి నిద్రకు సహాయపడతాయట. ఆ విషయం ఒకసారి తెలుసుకుందాం..

    ఉరుకుల పరుగుల జీవితం ఒత్తిడితో కూడిన ఉద్యోగం.. అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు.. ఆరోగ్యాన్ని పాడు చేసే సరికొత్త పోకడలు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల (health problems)తో నేటి రోజులలో జనాలు బాధపడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. సాధారణంగా మనిషి జీవన శైలిలో తినడానికి పడుకోవడానికి ఉదయం నిద్ర (sleep) లేవడానికి కూడా ఒక సమయం సందర్భం అంటూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

    కానీ నేటి రోజుల్లో మాత్రం సమయం అంటూ ఏదీ లేదు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు తినడం ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు పడుకోవడం (sleeping).. ఇక ఇష్టం వచ్చినప్పుడు లేవడం లాంటివి చేస్తున్నారు ఎంతో మందిపై ఆరోగ్య సమస్యలు దూసుకొచ్చి మీద పడి పోతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో యువత (youngsters) పెద్దలు అందరూ కూడా ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ఏది అంటే నిద్రలేమి (Insomnia) అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం అధునాతన జీవనశైలిలో ఒత్తిడితో కూడిన లైఫ్ లీడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఈ క్రమంలోనే ఎంతోమంది పడుకున్నప్పటికీ నిద్ర (sleep) పట్టక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా నిద్రపట్టక పోవడానికి కారణాలు ఏమైనప్పటికీ నిద్రపట్టడానికి మాత్రం కొన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్ని టిప్స్ (sleep tips) పాటిస్తే హాయిగా నిద్ర పోవ‌చ్చు. వాటి గురించి ఒక‌సారి తెలుసుకుందాం..



    అరటి పండ్లలో (banana) సహజసిద్ధమైన కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది. ఇవి మంచి నిద్రకు సహాయపడతాయి. అరటి పండ్లలో ప్రోబయోటిక్స్ పెంచడంలో సహాయపడే ఎంజైములు ఉంటాయి. ప్రీబయోటిక్స్ తినడం వల్ల మీరు ప్రశాంతంగా నిద్రపోతారు (sleep). ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు.వ్యాయామం తర్వాత కోలుకోవడం కోసం చెర్రీస్ (Cherries) తీసుకుంటే మంచిది. అయితే ఈ పండు మంచి రాత్రి నిద్ర పొందడానికి కూడా సహాయపడుతుంది. మోంట్‌మోరెన్సీ టార్ట్ చెర్రీ జ్యూస్‌ను రోజుకు రెండుసార్లు 14 రోజుల పాటు తాగితే రోజు నిద్రకంటే మరో 84 నిమిషాల పాటు ఎక్కువసేపు నిద్రపోగలరని (will sleep) ఒక అధ్యయనంలో తేలింది. మెలటోనిన్ ఉంటుంది. ఇది రాత్రిపూట పీనియల్ గ్రంథి ద్వారా విడుదలయ్యే హార్మోన్. ఇది మీకు మంచి రాత్రి నిద్రపోవడానికి సహాయపడుతుంది. దీనితో కూడిన బెర్రీలు మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

    మంచి రాత్రి నిద్ర (good sleep) రావాలంటే ఆహారంలో తేనె (Honey) చేర్చండి. సహజ చక్కెర, తేనె ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది. ఇది ట్రిప్టోఫాన్ , సెరోటోనిన్‌లను మెదడుకు ప్రసారం చేయడంలో సహాయపడుతుంది. ఇది శరీరం విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Banana, Sleep tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు