Health Tips : టైప్-2 డయాబెటిస్ తగ్గేందుకు ఈ ఆహారం తినండి...

Type 2 Diabetes : ఆకుకూరలు, కూరగాయల వంటివి టైప్-2 డయాబెటిస్‌ని వేగంగా తగ్గిస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది.

news18-telugu
Updated: September 18, 2020, 6:36 AM IST
Health Tips : టైప్-2 డయాబెటిస్ తగ్గేందుకు ఈ ఆహారం తినండి...
ప్రతీకాత్మక చిత్రం (credit - twitter - Blaine Gobbels)
  • Share this:
Type 2 Diabetes Tips : ఆరోగ్యకరంగా ఉండే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలు, పప్పులు, నట్స్ వంటి సహజసిద్ధమైన ఆహారాన్ని డైట్‌లో చేర్చుకుంటే... టైప్-2 డయాబెటిస్ తగ్గేందుకు వీలవుతుందని తాజా పరిశోధనలలో తేలింది. ఈ రోజుల్లో చాలా మంది సూపర్ మార్కెట్లలో రెడీ టూ ఈట్, జస్ట్ 2 మినిట్స్‌లో వండుకునే ఆహార పదార్థాల్ని ఎక్కువగా కొనుక్కుంటున్నారు. ఐతే... ఈ ప్రాసెస్ చేసిన ఫుడ్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదంటున్నారు పరిశోధకులు. ఇందుకు సంబంధించిన అధ్యయనం వివరాల్ని JAMA ఇంటర్నల్ మిడిసిన్ జర్నల్‌లో రాశారు. మొక్కల ఆధారితమైన సహజ సిద్ధమైన ఆహారం తింటే... డయాబెటిస్ రిస్క్ 23 శాతం తగ్గుతోందని తేలింది. తాజా ఆహారం తీసుకుంటూనే... షుగర్ కలిగివుంటే ఆహార పదార్థాలు, డ్రింక్స్, రిఫైన్డ్ చేసిన ఆహార పదార్థాల్ని తగ్గించుకుంటే... టైప్-2 డయాబెటిస్ రిస్క్ 30 శాతం దాకా తగ్గుతోందని పరిశోధనలో తేలింది.

హెల్తీ డైట్‌తోపాటూ... రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేస్తూ... శరీర బరువును కంట్రోల్ చేసుకుంటూ, స్మోకింగ్ చెయ్యకుండా ఉంటే... టైప్-2 డయాబెటిస్ తగ్గించుకునేందుకు వీలవుతుందంటున్నా్రు డాక్టర్లు. ఇప్పటివరకూ ఈ వ్యాధి రానివారు పై జాగ్రత్తలు తీసుకుంటే... వారికి ఇది సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయంటున్నారు. మొక్కల ఆధారిత ఆహారంలో షుగర్ చాలా తక్కువ. అదే రిఫైన్డ్ చేసిన ఆహార పదార్థాలు టైప్-2 డయాబెటిస్‌ని పెంచుతాయి. ముఖ్యంగా ఎక్సర్‌సైజ్ చెయ్యనివారు... ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ వంటివి తింటూ ఉంటే... వారికి టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.

అమెరికాలో 3 కోట్ల మందికిపైగా... అంటే... ప్రతీ 10 మందిలో ఒకరికి డయాబెటిస్ ఉంటోంది. ఆ డయాబెటిస్‌లో 95 శాతం మంది టైప్-2 డయాబెటిస్ కలిగి ఉంటున్నారని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ వేగంగా వ్యాపిస్తోంది. 1980లో 10.8కోట్ల మందికి డయాబెటిస్ ఉండేది. 2014లో ఆ సంఖ్య 42.4 కోట్లకు చేరిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

తాజా పరిశోధనలో టైప్-2 డయాబెటిస్ ఉన్న 23,544 మందిని పరిశీలించారు. ఎక్కువగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పప్పులు, తృణధాన్యాల వంటివి తినేవారికి టైప్-2 డయాబెటిస్ రిస్క్ తక్కువగా ఉంటోంది. అలాగే... బాడీ మాస్ ఇండెక్స్ - BMI (ఎత్తుకి తగిన బరువు) 25 నుంచీ 29.9 ఉండేవారు అధిక బరువు కింద లెక్కిస్తున్న పరిశోధకులు... అధిక బరువు పెరుగుతున్న కొద్దీ... టైప్-2 డయాబెటిస్ రిస్క్ కూడా పెరుగుతుందని చెబుతున్నారు.

డయాబెటిస్ తగ్గేందుకు బరువు తగ్గడమే సరైన పరిష్కారం అంటున్న పరిశోధకులు... అందుకోసం మొక్కల ఆధారిత సహజ సిద్ధమైన ఆహారం తినాలని సూచిస్తున్నారు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలు, పప్పుల వంటివి... శరీరాన్ని క్రమబద్ధీకరించి... అధిక బరువును తగ్గిస్తాయని చెబుతున్నారు. వాటిలోని యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ వంటివి... శరీరంలో చెడుకొవ్వును తరిమికొట్టి... టైప్-2 డయాబెటిస్ రిస్కును తగ్గిస్తాయని అంటున్నారు.


Pics : బొమ్మ కాదు బేబీ... ఇన్‌స్టాగ్రామ్ మోస్ట్ క్యూట్ గర్ల్ వయోలా
ఇవి కూడా చదవండి :


Health Tips : బరువు తగ్గాలా... కుంకుమ పువ్వుతో ఇలా చెయ్యండి...

Health Tips : పుట్టగొడుగుల సూప్... తయారీ విధానం ఇదీ...

Health Tips : డైటింగ్, ఎక్సర్‌సైజ్ రెండూ చేస్తున్నారా... డేంజరే

Health Tips : కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్... ఇంటి దగ్గరే తయారుచేసుకోండి

Health Tips : స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి 7 సహజ మార్గాలు
Published by: Krishna Kumar N
First published: September 18, 2020, 6:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading