Health Tips : రోజూ ఇవి తినండి... బరువు తగ్గడం గ్యారెంటీ

Weight Loss : ఈ రోజుల్లో బరువు తగ్గడమన్నది పెద్ద సమస్య. జిమ్‌లకు వెళ్లి కసరత్తులు చేసినా... చాలా మంది ఓవర్ వెయిట్‌తోనే ఉంటారు. అలాంటి వారు ఈ సింపుల్ చిట్కా పాటిస్తే... వెంటనే కాకపోయినా... కొన్ని రోజుల్లో బరువు తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: December 3, 2019, 9:17 AM IST
Health Tips : రోజూ ఇవి తినండి... బరువు తగ్గడం గ్యారెంటీ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మన శరీరంలో కొవ్వుకీ, విటమిన్ Cకి లింక్ ఉంటుంది. విటమిన్ సీ... సమృద్ధిగా ఉంటే... అది శరీర బరువును బ్యాలెన్స్ చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. వేరే దారిలేక జంక్ ఫుడ్ తింటున్నవారికీ, రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్‌లు చెయ్యలేకపోతున్నవారికీ వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. మనం తినే ఆహారంలో అన్ని రకాల పోషకాలూ ఉండాలి. విటమిన్లూ, మినరల్స్‌ కలిగి ఉండాల. మీకు తరచుగా అలసట వస్తున్నా, మాటిమాటికీ మూడ్ మారిపోతున్నా, కండరాల్లో నొప్పులు వస్తున్నా, జుట్టు, స్కిన్ ఎండిపోతున్నా... మీకు సీ విటమిన్ తగ్గిపోతున్నట్లు లెక్క. మన శరీరానికి విటమిన్ సీ రెగ్యులర్‌గా అవసరం. ఇది వ్యాధినిరోధక శక్తిని పెంచడమే కాదు... శరీర కణాలు పాడవకుండా చేస్తుంది. అంతేకాదు... అధిక బరువును తగ్గించి... బాడీ మెటబాలిజం (అన్నీ సక్రమంగా పనిచేసేలా చెయ్యడం)ను సరిచేస్తుంది. విటమిన్ సీ రెగ్యులర్‌గా తీసుకోవడానికి ఈ పండ్లను తినాలి.

vitamin c, weight loss, over weight, boost immunity, weight loss foods, loss weight, easy tips, tips to weight loss, vitamin C rich foods, vitamin c, vitamin c benefits, అధిక బరువు, బరువు తగ్గడం ఎలా?, బరువు తగ్గించే చిట్కాలు
ప్రతీకాత్మక చిత్రం


నిమ్మకాయ : మన మార్కెట్లలో ఏడాది మొత్తం దొరికే వాటిలో నిమ్మకాయలు ఒకటి. వీటిలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. పైన చెప్పిన ప్రయోజనాలతోపాటూ... ఇంకా చాలా ఉపయోగాలుంటాయి నిమ్మకాయల రసం తీసుకుంటే. అందువల్ల రెగ్యులర్‌గా నిమ్మరసం తాగాలి. కొద్దిగా చక్కెర లేదా సాల్ట్ వేసుకొని తాగొచ్చు.

vitamin c, weight loss, over weight, boost immunity, weight loss foods, loss weight, easy tips, tips to weight loss, vitamin C rich foods, vitamin c, vitamin c benefits, అధిక బరువు, బరువు తగ్గడం ఎలా?, బరువు తగ్గించే చిట్కాలు
ప్రతీకాత్మక చిత్రం
ఉసిరి : ఇదో అద్భుత ఔషధ గుణాలున్న కాయ. ఉసిరి కాయల్లో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉసిరికాయలు తిన్నా, వాటి రసం తాగినా బాడీలో చెడు బ్యాక్టీరియా చచ్చిపోతుంది. వైరల్ ఇన్ఫెక్షన్ల వంటివి రావు. దగ్గు, జలుబు కూడా పరారవుతాయి. అందువల్ల వీలు దొరికినప్పుడల్లా... ఉసిరి కాయలు తినండి.

vitamin c, weight loss, over weight, boost immunity, weight loss foods, loss weight, easy tips, tips to weight loss, vitamin C rich foods, vitamin c, vitamin c benefits, అధిక బరువు, బరువు తగ్గడం ఎలా?, బరువు తగ్గించే చిట్కాలు
ప్రతీకాత్మక చిత్రం


చెర్రీస్ : ఎరుపు రంగులో మెరిసిపోయే ఈ పండ్లలో పోషకాలు మెండుగా ఉంటాయి. విటమిన్ సీ చాలా ఎక్కువగా ఉంటుంది. రోజూ వీటిని తింటే... మనకు కావాల్సిన విటమిన్ సీ బాడీకి అందుతుంది. కాకపోతే, ఇవి కాస్త రేటు ఎక్కువే. అందువల్ల వీటిని ఎక్కువ మంది కొనుక్కోరు. అయినప్పటికీ... అప్పుడప్పుడైనా వీటిని తింటే మంచిదే.మిగతా విటమిన్లలాగా... విటమిన్ సీ మన శరీరంలో స్టాక్ ఉండదు. బాడీలో వేడి పెరిగితే, విటమిన్ సీ బయటకు వెళ్లిపోతుంది. అందువల్ల దీన్ని మనం రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉండాల్సిందే. పెద్దవాళ్లకు రోజుకు 40 మిల్లీ గ్రాముల విటమిన్ సీ అవసరం. ఐతే... ఇదే విటమిన్ ఎక్కువగా తీసుకున్నా... కడుపునొప్పి, డయేరియా (అతిసారం) వంటివి వస్తాయి. కాబట్టి... జాగ్రత్తగా సరిపడా తీసుకోవాలి.

 

ఇవి కూడా చదవండి :

యాపిల్ గురించి మీకు తెలియని ఆశ్చర్యకర విషయాలు... చకచకా...

మీ మొబైల్ లో యాప్స్‌ డైరెక్టుగా ఎవరికైనా పంపాలా... సింపుల్... ఇలా చెయ్యండి

వాట్సాప్ సీక్రెట్ ట్రిక్... అవతలి వాళ్లకు తెలియకుండా వాళ్ల స్టేటస్ చూడటం ఎలా?

ట్రూకాలర్ నుంచీ మన నంబర్ తీసేయడం ఎలా? సింపుల్ ట్రిక్... ఫాలో అవ్వండి మరి

ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించాలా? మీ కోసమే ఈ వెబ్‌సైట్లు... ట్రై చెయ్యండి మరి
First published: December 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>