కరోనా వ్యాధి రాకుండా ఎదుర్కోవాలన్నా...వచ్చినా దాన్ని జయించాలన్నా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ప్రతిరోజూ ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఇందుకోసం వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్-సీ పుష్కలంగా ఉండేవి ఎక్కువ తీసుకోవాలి. వేరే దారిలేక జంక్ ఫుడ్ తింటున్నవారికీ, రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్‌లు చెయ్యలేకపోతున్నవారికీ వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. మనం తినే ఆహారంలో అన్ని రకాల పోషకాలూ ఉండాలి. విటమిన్లూ, మినరల్స్ కలిగి ఉండాలి. మీకు తరచుగా అలసట వస్తున్నా, మాటిమాటికీ మూడ్ మారిపోతున్నా, కండరాల్లో నొప్పులు వస్తున్నా, జుట్టు, స్కిన్ ఎండిపోతున్నా... మీకు సీ విటమిన్ తగ్గిపోతున్నట్లు లెక్క. మన శరీరానికి విటమిన్ సీ రెగ్యులర్‌గా అవసరం. ఇది వ్యాధినిరోధక శక్తిని పెంచడమే కాదు... శరీర కణాలు పాడవకుండా చేస్తుంది. అంతేకాదు... అధిక బరువును తగ్గించి... బాడీ మెటబాలిజం (అన్నీ సక్రమంగా పనిచేసేలా చెయ్యడం)ను సరిచేస్తుంది. విటమిన్ సీ రెగ్యులర్‌గా తీసుకోవడానికి ఈ పండ్లను తినాలి.
నిమ్మకాయ : మన మార్కెట్లలో ఏడాది మొత్తం దొరికే వాటిలో నిమ్మకాయలు ఒకటి. వీటిలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. పైన చెప్పిన ప్రయోజనాలతోపాటూ... ఇంకా చాలా ఉపయోగాలుంటాయి నిమ్మకాయల రసం తీసుకుంటే. అందువల్ల రెగ్యులర్‌గా నిమ్మరసం తాగాలి. కొద్దిగా చక్కెర లేదా సాల్ట్ వేసుకొని తాగొచ్చు.
ఉసిరి : ఇదో అద్భుత ఔషధ గుణాలున్న కాయ. ఉసిరి కాయల్లో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉసిరికాయలు తిన్నా, వాటి రసం తాగినా బాడీలో చెడు బ్యాక్టీరియా చచ్చిపోతుంది. వైరల్ ఇన్ఫెక్షన్ల వంటివి రావు. దగ్గు, జలుబు కూడా పరారవుతాయి. అందువల్ల వీలు దొరికినప్పుడల్లా... ఉసిరి కాయలు తినండి.
చెర్రీస్ : ఎరుపు రంగులో మెరిసిపోయే ఈ పండ్లలో పోషకాలు మెండుగా ఉంటాయి. విటమిన్ సీ చాలా ఎక్కువగా ఉంటుంది. రోజూ వీటిని తింటే... మనకు కావాల్సిన విటమిన్ సీ బాడీకి అందుతుంది. కాకపోతే, ఇవి కాస్త రేటు ఎక్కువే. అందువల్ల వీటిని ఎక్కువ మంది కొనుక్కోరు. అయినప్పటికీ... అప్పుడప్పుడైనా వీటిని తింటే మంచిదే.
మిగతా విటమిన్లలాగా... విటమిన్ సీ మన శరీరంలో స్టాక్ ఉండదు. బాడీలో వేడి పెరిగితే, విటమిన్ సీ బయటకు వెళ్లిపోతుంది. అందువల్ల దీన్ని మనం రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉండాల్సిందే. పెద్దవాళ్లకు రోజుకు 40 మిల్లీ గ్రాముల విటమిన్ సీ అవసరం. ఐతే... ఇదే విటమిన్ ఎక్కువగా తీసుకున్నా... కడుపునొప్పి, డయేరియా (అతిసారం) వంటివి వస్తాయి. కాబట్టి... జాగ్రత్తగా సరిపడా తీసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health Tips, Tips For Women, Weight loss, Women health