మటన్ ఫ్రెష్‌గా ఉందో.. లేదో.. ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు..

నాన్‌వెజ్ ప్రియులు ఇష్టంగా తినవాటిలో మటన్ ఒకటి. అయితే, ఈ కల్తీ ఆహారం మధ్యలో సరైన మటన్ ఏదో తెలుసుకోవాలంటే.. ఓ సారి చూడండి..

Amala Ravula | news18-telugu
Updated: June 15, 2019, 5:12 PM IST
మటన్ ఫ్రెష్‌గా ఉందో.. లేదో.. ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: June 15, 2019, 5:12 PM IST
మటన్ అంటే చాలామంది ఎంతో ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి కూడా చాలమంచిది. గతంలో అయితే ఆన్‌లైన్ ఉండేది కాదు, కల్తీ కూడా జరిగేది కాదు.. దీంతో నిరభ్యంతరంగా మటన్ షాపుకి వెళ్లి తీసుకుని వండుకునేవాళ్లం.
కానీ, నేడు కల్తీ ఎక్కువైపోయింది. దీంతో.. ఏది మంచి మటనో తెలుసుకోవడం కష్టంగా మారింది. ఇలాంటి సందర్భంలో కొన్ని పరీక్షల ద్వారా మంచి మటన్‌ని గుర్తించొచ్చు. మంచి మటన్ ఎప్పుడూ పాలిపోయినట్లుగా ఉండదు.. జ్యూసీగా ఉంటుంది. ఇలా చూసి తీసుకోవాలి.

అదే విధంగా.. రక్తం, నీరు కారుతుంటే వాటిని తీసుకోకూడదు. ముఖ్యంగా ఎక్కువగా ఎరుపు రంగులో ఉంటే అందులో కొవ్వు అధికంగా ఉన్నట్లు గుర్తించాలి. గులాబీ, ఎరుపు మధ్య రంగులో ఉన్న మటన్ ఎప్పుడూ మంచిదే.

అదేవిధంగా, చాలామంది బోన్‌లెస్ మటన్‌ని ఎక్కువగా తింటారు. అలా కాకుండా బోన్‌తో ఉన్న మటనే రుచిగా ఉంటుంది. పైగా ఆ మటన్ త్వరగా ఉడుకుతుంది కూడా.
సాధ్యమైనంతవరకూ ఆన్‌లైన్‌లో మటన్ తీసుకోకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
First published: June 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...