Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    Garlic Prawns Recipe: సండే జాలీడే... వెల్లుల్లి రొయ్యల కర్రీ ట్రై చేయండి... చాలా ఈజీ

    Garlic Prawns : వెల్లుల్లి మన గుండెకు చాలా మంచిది. రొయ్యలు హెల్తీ ఫుడ్. ఈ రెండింటితో చేసే రెసిపీ అద్భుతంగా ఉండటమే కాదు... టేస్ట్ అదిరిపోతుంది. ఎలా తయారుచెయ్యాలో తెలుసుకుందాం.

    news18-telugu
    Updated: November 1, 2020, 3:23 AM IST
    Garlic Prawns Recipe: సండే జాలీడే... వెల్లుల్లి రొయ్యల కర్రీ ట్రై చేయండి... చాలా ఈజీ
    వెల్లుల్లి రొయ్యల కర్రీ (credit - twitter - pasko's balkan grill)
    • Share this:
    Garlic Prawns : వీకెండ్స్‌లో చాలా మంది చికెన్, మటన్‌తోపాటూ... చేపలు, రొయ్యల్ని ఎక్కువగా వండుకుంటారు. ఐతే... ఎప్పుడూ ఒకేలా వండుకు తింటే స్పెషల్ ఏముంటుంది? కొత్తదనం ఉండాలి కదా. పూర్వమైతే... వరైటీగా వండేందుకు బామ్మలనో, అవ్వలనో అడిగితే... వాళ్ల కాలంలో ఎలా వండేవాళ్లో చెప్పేవాళ్లు. ఇప్పుడు అంతా డిజిటల్ యుగం కదా. ఏ యూట్యూబ్‌లోనో, బ్లాగుల్లోనో వెతికితే... కొత్త వంటలు ఎలా చెయ్యాలో తెలిసిపోతోంది. ఐతే... చాలా మంది రొటీన్ వంటలే చెబుతున్నారు తప్ప కొత్తదనం కనిపించట్లేదన్న విమర్శలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రొయ్యల కర్రీనే తీసుకుంటే... రొయ్యల ఫ్రై, రొయ్యల పులుసు ఇలాంటివే తప్ప... పూర్తి కొత్త వరైటీలు చెప్పట్లేదంటున్నారు చాలా మంది. మనం మాత్రం ఇప్పుడు పూర్తి కొత్త వంటకం నేర్చుకుందాం.

    కావాల్సినవి :

    రొయ్యలు - 24
    వెల్లుల్లి - 5 రెబ్బలు
    ఎండుమిర్చి - 2
    ఆలివ్ ఆయిల్ - పావు కప్పు (వేరే ఆయిల్ కూడా వాడొచ్చు)
    పార్స్‌లీ ఆకులు (Parsley leaves) ఇవి లేకపోతే కొత్తిమీర వాడొచ్చు.

    అర టీస్పూన్ సాల్ట్ అండ్ పెప్పర్
    నిమ్మకాయ - 1

    తయారీ విధానం -
    - ముందుగా రొయ్యల్ని తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. అన్నింటినీ తొక్క తీశాక... చల్లటి నీటితో నెమ్మదిగా కడిగెయ్యాలి.
    - వెల్లుల్లి రెబ్బల్ని ఒలిచి, ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలు చేసికోవాలి. పార్స్‌లీ ఆకుల్ని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి.
    - స్టవ్‌పై బాణలి (pan) పెట్టి... ఆలివ్ ఆయిల్‌ను పొయ్యాలి. నూనె కాస్త వేగిన తర్వాత... సిమ్‌లోనే ఉంచి... వెల్లుల్లి రెబ్బల ముక్కల్ని వెయ్యాలి. అవి బంగారు-గోధుమ రంగులోకి మారేవరకూ నెమ్మదిగా అటూ ఇటూ కదుపుతూ ఉండాలి.
    - ఇప్పుడు రొయ్యల్ని అందులో వేసి... అర టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ పెప్పర్‌ను వెయ్యాలి. నెమ్మదిగా అటూ ఇటూ కదుపుతూ... 6 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించాలి. అన్ని రొయ్యలూ... అన్ని వైపులా గోల్డెన్-బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఉడికించాలి.
    - ఇప్పుడు కట్ చేసిన ఎండుమిర్చిని వెయ్యాలి. ఇలా వండిన తర్వాత... కొద్దిగా ఉప్పు వెయ్యాలి.
    - ఇప్పుడు స్టవ్ ఆపేసి... కర్రీ కాస్త వేడి తగ్గాక... నిమ్మరసం పిండి అందులో వెయ్యాలి. అలాగే... తరిగిన పార్స్‌లీ ఆకులను కూడా వెయ్యాలి.
    - బాణలిలోనే కూరను అటూ ఇటూ నెమ్మదిగా కదపాలి. మొత్తం కర్రీ అంతా నిమ్మరసం, పార్స్‌లీ ఆకులు చేరేలా చెయ్యాలి.
    - ఇప్పుడు ఓ ప్లేట్‌లో కర్రీని వేసి... సెర్వ్ చేస్తే... లొట్టలేసుకొని తినడం గ్యారెంటీ అంటున్నారు వంటల నిపుణులు. ఈ కర్రీని రైస్‌తోపాటూ... బ్రెడ్‌తోనూ కలిపి తినవచ్చు. ఆలస్యమెందుకు ట్రై చెయ్యండి మరి.
    Published by: Krishna Kumar N
    First published: November 1, 2020, 3:10 AM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading