Health Tips : అన్నం ఇలా తింటే బరువు పెరగరు.. ఎన్నో లాభాలు..

ఎక్కువగా బరువు ఉండడం ఇప్పుడు ప్రతీఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య. దీనికి అనేక కారణాలున్నాయి. తాజాగా తేలిన విషయమేంటంటే.. తినేటప్పుడు కూర్చునే పద్ధతి ద్వారా కూడా బరువు పెరుగుతారని తేలింది. ఆ వివరాలేంటో చూడండి...

Amala Ravula | news18-telugu
Updated: June 12, 2019, 6:05 PM IST
Health Tips : అన్నం ఇలా తింటే బరువు పెరగరు.. ఎన్నో లాభాలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇప్పుడు ప్రతీఒక్కరూ చైర్స్, డైనింగ్ టేబుల్ సిస్టమ్స్‌కి అలవాటుపడి అలా తింటున్నారు. కానీ, ఇది ఎంతమాత్రం మంచిది కాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. పాతకాలంలో నేలపై కూర్చొని తింటే ఎన్నో ప్రయోజనాలుంటాయని ముఖ్యంగా బరువుపెరగమని చెబుతున్నారు. మనం పూర్వకాలంలో పాటించే ఎన్నో విషయాలు ఆరోగ్య సంబంధితమైనవని, చేసే ప్రతీపనిలోనూ సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయని చెబుతున్నారు. కాబట్టి అప్పట్లో ఎలా నేలపై కూర్చుని తిన్నారో అలా తినడం వల్లే ఎక్కువ ప్రయోజనాలుంటాయని చెబుతున్నారు.

నేలపై మనం సుఖాసనంలో కూర్చొని అన్నం తింటుంటాం. ఇలా చేయడం వల్ల ఏకాగ్రత పెరగడమే కాకుండా శరీరభాగాలకు సమానంగా రక్తప్రసరణ జరుగుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా మలబద్ధకం, గ్యాస్, ఉదర సంబంధిత సమస్యలు ఉండవని ఈ కారణంగా ఓవర్ వెయిట్ కూడా కంట్రోల్‌లో ఉంటుందని చెబుతున్నారు. మరో విషయమేంటంటే ఇలా నేలపై కూర్చొని తినడం వల్ల నడుంనొప్పి తగ్గుతుందని చెబుతున్నారు.

ఈ వీడియో కూడా చూడండి..

First published: June 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading