హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

World Lung Cancer Day: క్యాన్సర్ మరణాలకు ఇదే మెయిన్ రీజన్.. ఇదొక్కటి పాటిస్తే మీకు పునర్జన్మే..!

World Lung Cancer Day: క్యాన్సర్ మరణాలకు ఇదే మెయిన్ రీజన్.. ఇదొక్కటి పాటిస్తే మీకు పునర్జన్మే..!

క్యాన్సర్ మరణాలకు ఇదే మెయిన్ రీజన్.. ఇదొక్కటి పాటిస్తే మీకు పునర్జన్మే..!

క్యాన్సర్ మరణాలకు ఇదే మెయిన్ రీజన్.. ఇదొక్కటి పాటిస్తే మీకు పునర్జన్మే..!

ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 1న నిర్వహిస్తారు. అమెరికన్ లంగ్ అసోసియేషన్, లంగ్‌ ఫోర్స్‌ ఊపిరితిత్తుల క్యాన్సర్‌ఫై అవగాహన కల్పిస్తుంది. వ్యాధిని ముందస్తుగా గుర్తించాల్సిన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

ఇంకా చదవండి ...

ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 1న నిర్వహిస్తారు. అమెరికన్ లంగ్ అసోసియేషన్, లంగ్‌ ఫోర్స్‌ ఊపిరితిత్తుల క్యాన్సర్‌ఫై అవగాహన కల్పిస్తుంది. వ్యాధిని ముందస్తుగా గుర్తించాల్సిన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం మానవ ఆరోగ్యానికి ఎంతో అవసరం. సకాలంలో వైద్య సహాయం పొందవచ్చు. భారతదేశంలో నమోదవుతున్న మొత్తం క్యాన్సర్‌ కేసుల్లో 5.9 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు ఉంటున్నాయి. ఈ క్యాన్సర్ సంబంధిత మరణాలే 8.1 శాతం నమోదవుతున్నాయి. ఒక నివేదిక ప్రకారం.. భారతదేశంలో క్యాన్సర్ తీవ్రత 2025 నాటికి 29.8 మిలియన్లకు పెరుగుతుందని అంచనా.

* ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే ఏంటి?

ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చినప్పుడు.. అసాధారణ రీతిలో, రెట్టింపు సంఖ్యలో కణాలు పెరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాలకు ఇది ప్రధాన కారణాలలో ఒకటిగా నిలుస్తోంది. ఊపిరితిత్తులు శరీరంలో శ్వాస అవయవాలు. అవి మనం పీల్చే గాలిని ఫిల్టర్ చేసి రక్తప్రవాహానికి ఆక్సిజన్‌ను సరఫరా చేస్తాయి. గాలిని సరైన శరీర ఉష్ణోగ్రతకు తీసుకురావడంలో ఊపిరితిత్తులు సహాయపడతాయి. ఈ జంట అవయవాలు శరీరం వాసనను గ్రహించడంలో కూడా సహాయపడతాయి.

* ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు ఏంటి?

హైదరాబాద్‌, యశోద హాస్పిటల్స్‌, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మోనాలజీ, స్లీప్ మెడిసిన్ డాక్టర్ విశ్వేశ్వరన్ బాలసుబ్రమణియన్ మాట్లాడుతూ..‘ఊపిరితిత్తుల క్యాన్సర్ పురుషులు, మహిళలను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ క్యాన్సర్‌ ప్రధానంగా ధూమపానం చేసేవారిలో కనిపించినప్పటికీ, 10 నుంచి 15 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్లు ధూమపానం చేయనివారిలో కూడా సంభవిస్తాయి’ అని చెప్పారు.

ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులు ప్రారంభంలో.. నిరంతరం దగ్గు, అప్పుడప్పుడు దగ్గినప్పుడు రక్తం రావడం, ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, బరువు తగ్గడం, ఆకలి ఎక్కువగా వేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. అదే విధంగా క్యాన్సర్‌ ప్రభావం చూపుతున్న అవయవాన్ని బట్టి కొంతమంది రోగులలో గొంతు బొంగురుపోవడం, అలసట, అస్థి నొప్పి, ఛాతీలో భారం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయని వివరించారు.

ఇదీ చదవండి: ఐటీ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. వర్క్‌ఫ్రం హోమ్‌తో పాటు భారీగా జీతాలు ఆఫర్..!


* సకాలంలో వైద్య పరీక్ష అవసరం

క్యాన్సర్‌ను సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. చాలా ఆలస్యం అయ్యే వరకు ఈ వ్యాధి లక్షణాలు కనిపించవు. అందువల్ల వైద్యులు, ఆరోగ్య నిపుణులు ఎల్లప్పుడూ ప్రజలు రెగ్యులర్ మెడికల్ చెకప్ చేయించుకోవాలని సూచిస్తుంటారు. తద్వారా వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు. వ్యాధి ప్రారంభ దశలో చికిత్స తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఊపిరితిత్తుల కేసుల్లో చాలా భాగం రోగ లక్షణాలు కనిపిస్తాయని, చాలా తక్కువ సందర్భాల్లో లక్షణాలు కనిపించవని డాక్టర్‌ బాలసుబ్రమణియన్‌ పేర్కొన్నారు. ఛాతీ ఎక్స్‌రే లేదా CT స్కాన్‌లో క్యాన్సర్‌ బయటపడుతుందని తెలిపారు.

* ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణాలు ఏంటి?

ఊపిరితిత్తుల క్యాన్సర్లు చిన్న సెల్, నాన్-స్మాల్ సెల్ కావచ్చు. ఇది వ్యక్తి ఊపిరితిత్తులలో ప్రారంభమవుతుంది. లేదా క్యాన్సర్ కణాలు ఒక అవయవం నుండి మరొక అవయవానికి వ్యాపించే మెటాస్టేజ్‌ల వల్ల కూడా కావచ్చు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణాలలో ఒకటి సిగరెట్ తాగడం. ఒక వ్యక్తి ఎక్కువ కాలం పాటు ఆస్బెస్టాస్ వంటి హానికరమైన పదార్థాలకు గురైనప్పుడు కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. ఇంట్లో, పనిలో హానికరమైన రసాయనాలకు గురికావడం కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. ఈ వ్యాధి వారసత్వంగా కూడా వచ్చే సూచనలు ఉన్నాయి.

* ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎవరికి ఉంది?

పొగతాగే వారికి ఊపిరితిత్తులలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ధూమపానం చేయనివారిలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రాబల్యం కనిపిస్తుంది. సెకండ్‌హ్యాండ్ స్మోకర్లు లేదా ధూమపానం చేసేవారు విడుదల చేసే గాలి పీల్చి ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడిన వారు 10-15 శాతం మంది ఉన్నారు.

* ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ఆహారం కారణమా?

మయోక్లినిక్ నివేదికలో.. ‘బీటా-కెరోటిన్ సప్లిమెంట్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ముఖ్యంగా పొగతాగే లేదా ఆస్బెస్టాస్‌కు గురైన వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. 29,000 మంది ధూమపానం చేసే పురుషులపై జరిపిన ఒక అధ్యయనంలో 5 నుంచి 8 సంవత్సరాల పాటు రోజుకు 20 mg బీటా-కెరోటిన్‌ను స్వీకరించే వారిలో 18 శాతం మంది ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారిన పడ్డారు. 18,000 మంది వ్యక్తులపై జరిపిన మరో అధ్యయనంలో ధూమపానం, లేదా ఆస్బెస్టాస్ ఎక్స్పోజర్ ఉన్న 28 శాతం మంది వ్యాధి బారిన పడ్డారు. ఈ వ్యక్తులు 4 సంవత్సరాల పాటు రోజుకు 25,000 యూనిట్ల రెటినాల్ (విటమిన్ A రూపం)తో పాటుగా 30 mg బీటా-కెరోటిన్ తీసుకున్నారు.’ అని పేర్కొంది.

ఆర్సెనిక్, రాడాన్ ఉన్న నీటిని తాగే వ్యక్తులు కూడా ఈ ప్రాణాంతక వ్యాధికి గురవుతారని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (యూఎస్‌ సీడీసీ) తెలిపింది.

Published by:Mahesh
First published:

Tags: Cancer, Cancer cells, Health, Smoking habbit

ఉత్తమ కథలు