హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Cervical cancer in women: గర్భాశయ కేన్సర్‌ను ఇలా గుర్తిస్తే.. త్వరగా తగ్గించుకోవచ్చు!

Cervical cancer in women: గర్భాశయ కేన్సర్‌ను ఇలా గుర్తిస్తే.. త్వరగా తగ్గించుకోవచ్చు!

గర్భాశయ కేన్సర్‌ బారిన పడుతున్న మహిళలు లైంగిక సంబంధాల Sexual relationship వల్లే దీని బారిన పడుతున్నారని నివేదికలు తెలుపుతున్నాయి. ఒకరి కంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధం కొనసాగిస్తే అది యూట్రెస్‌పై ప్రభావం చూపుతుంది. దీంతో పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ వ్యాధి, వ్యంధ్యత్వం, ప్రీమెచూర్‌ డెలివరీకి కారణం అవుతుంది.

ఇంకా చదవండి ...

ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ కేన్సర్‌ Cervical cancer బారిన మహిళల్లో దాదాపు 16 శాతం మంది భారతీయులే. అయినా.. చాలా కొద్ది మంది మహిళలకే గర్భాశయ కేన్సర్‌ పరీక్షలు నిర్వహించామని వైద్య నిపుణులు చెబుతున్నారు.

'గ్లోబోకెన్‌ 2020' నివేదిక ప్రకారం 18.3 భారతీయ మహిళలు సర్వైకల్‌ కేన్సర్‌ బారిన పడ్డారని అందులో ఈశాన్య రాష్ట్రాలైన ఐజ్వాల్, మిజోరాం, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పాపుంపరే ప్రాంతాల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయని తెలిపింది. 2018 లో ఎక్కువ శాతం గర్భాశయ కేన్సర్‌ బారిన వారి మరణాలు చోటుచేసుకున్నాయని Lancet global research వార్త పత్రిక ప్రచూరించింది.

ఇది కూడా చదవండి: వర్షాకాలం.. ఈ పనిచేస్తే డాక్టర్‌ను కలిసే అవసరమే ఉండదు!గర్భాశయ కేన్సర్‌ ముఖ్యంగా గర్భాశయ కణాల్లో వ్యాపించే ఒక రకమైన కేన్సర్‌. ఇది గర్భాశయం కింది భాగం యోనికి Uterus లింక్‌ అయి ఉన్న ప్రాంతంలో ఏర్పడుతుంది. ఈ వ్యాధిని ముందుగా నే నివారించవచ్చు. దీన్ని ముందుగానే గుర్తిస్తే.. మంచి చికిత్సతో నయం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ కేన్సర్‌ సర్వసాధరణమైన కేన్సర్‌లలో నాలుగో స్థానంలో ఉంది. ఈ గర్భాశయ కేన్సర్‌పై సరైన అవగాహన లేని కారణంగా 30 ఏళ్లలోపు మహిళలు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా 30–49 వయస్సు మహిళలకు ఈ వ్యాధి సోకుతుంది. దీనిపై సరైన చర్య తీసుకోకపోతే 2018–2030 మధ్య ఈ కేన్సర్‌ 5,70,000–7,00,000కు పెరుగే ప్రమాదం ఉందని WHO హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: పుదీనా అన్ని సీజన్లలో.. 16 విధాలుగా రక్షిస్తుంది!గర్భాశయ కేన్సర్‌కు కారణాలు..

  1. హ్యూమన్‌ పాపిల్లోమ వైరస్‌ (HPV) ఇన్ఫెక్షన్‌. లైంగిక చర్య ద్వారా సంక్రమిస్తుంది.

  2. తరచూ బ్లీడింగ్‌ అవ్వడం.

  3. సెక్స్‌ తర్వాత బ్లడ్‌ రావడం.

  4. పోస్ట్‌మోనోపాజల్‌ బ్లీడింగ్‌.

  5. యోని నుంచి ఒక రకమైన వాసన.

  6. వెన్నుపూస కింది భాగం లేదా పొత్తికడుపులో అసౌకర్యంగా ఉండటం.

పైన ఉన్న ఏ లక్షణాలు ఉన్నా.. వెంటనే సరైన ఒన్‌కాలజిస్ట్‌ను సంప్రదించాలి.

రిస్క్‌ ఫ్యాక్టర్స్‌...

ప్రమాదబారితంగా మారే కొన్ని సర్వైకల్‌ కేన్సర్‌ అంశాలు..

హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్‌..

ఇది సెక్సూవల్‌గా ట్రాన్సిమిట్‌ అవుతుంది. సర్వైకల్‌ కేన్సర్‌ బారిన పడటానికి ప్రధాన కారణం ఇదే.

స్మోకింగ్‌..

స్మోకింగ్‌ చేయని వారితో పోలిస్తే.. మహిళల్లో గర్భాశయ కేన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇది గర్భాశయంలోని శ్లేష్మాన్ని సృష్టిస్తుంది.దీంతో ప్రాణంతకమయ్యే అవకాశం ఉంటుంది.

ఇమ్యూనిటీ తక్కువగా ఉండటంతో ఎయిడ్స్‌కు కారణమయ్యే వైరస్‌.. వ్యాధి నిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది.దీంతో హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థ కేన్సర్‌ కణాలను నాశనం చేయడంతోపాటు వాటి పెరుగుదల, వ్యాప్తిని నిలిపేయడంలో సహాయపడుతుంది.

గర్భనిరోధక మాత్రలు..

ఈ మాత్రలు దీర్ఘకాలంపాటు ఉపయోగించడం వల్ల కూడా సర్వైకల్‌ కేన్సర్‌ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఓసీలు వాడితే ప్రమాదం పెరుగుతుంది. ఇవి వాడటం తగ్గించిన కొన్ని రోజులకు పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది.

ముందుగా గుర్తించడమే మంచిది...

వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ప్రకారం 2030 నాటికి గర్భాశయ కేన్సర్‌ను పూర్తిగా కనిపించకూడదని లక్ష్యంగా పెట్టుకుంది. 15 సంవత్సరాలలోపు ఉన్న బాలికలకు హెచ్‌పీవీ HPVవ్యాక్సిన్‌ పూర్తిగా వేయించుకోవాలి. మహిళలు గర్భాశయ సమస్యలు వచ్చినపుడు స్కానింగ్‌ చేయించడం వల్ల ప్రమాదం తగ్గుతుంది. గ్రామీణ భారతంలో ముందస్తు పరీక్షలకు కొన్ని అడ్డంకులు ఉన్నాయి. అది అజ్ఞానం, కేన్సర్‌ను గుర్తించడంలో భయం, మందులు, మౌలిక సదుపాయాలు, పేదరికం, నిరక్షరాస్యత అని వైద్యులు అంటున్నారు.

Published by:Renuka Godugu
First published:

Tags: Cancer, Women health

ఉత్తమ కథలు