దసరా సంబరాలు మొదలవుతున్నాయి. ఊరూ, వాడా దసరా నవరాత్రులకు సిద్ధమవుతూ, వివిధ రూపాల్లో అమ్మవారిని కొలిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఐతే... ఈ దసరాకీ, నీలి రంగులో మెరుస్తూ కనిపించే పాలపిట్టకూ సంబంధం ఉంది. నవరాత్రులు పూర్తయ్యాక... విజయ దశమి రోజున పాలపిట్టను చూడటాన్ని అదృష్టంగా, శుభ సుచికంగా ప్రజలు భావిస్తారు. ఎందుకంటే... దసరా అంటేనే చెడుపై విజయానికి గుర్తు. ఇదే దసరా రోజున రావణాసురుణ్ని అంతమొందించి శ్రీరాముడు ఘన విజయం సాధించాడు. అలాగే రాక్షసుల రాజు మహిషాసురిడిని నేల కూల్చి... కాళికా మాత ఘన విజయం సాధించింది. ఇలాంటి విజయాలకు ప్రతీకగా పాలపిట్టను సూచిస్తారు. ఆ పిట్ట కనిపిస్తే విజయం దక్కినట్లే. అందుకే... పండుగ నాడు పాలపిట్టను చూడాలి. అదృష్టంగా భావించాలని పండితులు చెబుతున్నారు.
మన అదృష్టమేంటంటే... పాలపిట్టలు అంతరించిపోయే పక్షుల జాతిలో ఉన్నప్పటికీ... అవి ఈ రోజుల్లోనూ అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా... వర్షాకాలం వచ్చాక... ఈ పక్షులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. పచ్చటి చేలలో తిరుగుతూ... బ్లూ కలర్లో మెరుస్తూ... ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అందువల్ల ఎక్కడ ఉన్నా... ఆ పక్షి మనకు ఈజీగా కనిపిస్తుంది. అందువల్ల పండుగ రోజున పంట పొలాలు ఎక్కువగా ఉండే ప్రదేశానికి వెళ్లండి... పాలపిట్టను చూడండి.
పండుగ నాడే ఎందుకు చూడాలి : పాలపిట్టను ఎప్పుడు చూసినా ఆనందమే. పండుగ రోజునే చూడటానికి చరిత్రలో ఓ కారణం కూడా ఉంది. పాండవులు... 12 ఏళ్ల వనవాసం, ఏడాది అజ్ఞాతవాసం ముగించుకొని... తమ రాజ్యానికి బయలుదేరుతున్న సమయంలో... పాలపిట్ట కనిపించిందట. ఆహా ఆ పక్షి ఎంత బాగుంది. అని వాళ్లు దాన్ని తనివితీరా చూశారు. ఐతే... ఆ తర్వాత చాలా జరిగాయి. కౌరవులు, పాండవులకు రాజ్యాన్ని ఇవ్వకపోవడం, తమ రాజ్యం కోసం వాళ్లు యుద్ధం చెయ్యడం, ఆ యుద్ధంలో వీర విజయం సాధించడం అన్నీ జరిగాయి. ఈ క్రమంలో పాల పిట్టను చూడటం వల్లే వాళ్లకు అన్ని విజయాలూ వరించాయనే ప్రచారం జరుగుతోంది. అందువల్ల పాలపిట్టను చూడాలి. ఒకవేళ పండుగ నాడు కనిపించకపోతే... బాధపడనక్కర్లేదు. పాలపిట్టను ఎప్పుడు చూసినా విజయోస్తే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dussehra 2019