దసరా నవరాత్రులు... ఏ అమ్మవారికి ఏ నైవేద్యం పెడతారో తెలుసా..?

Dussehra 2019 : ఏటా నవరాత్రి వేడుకలు ముగిశాక... పదో రోజున విజయదశమి జరుపుకుంటున్నాం. తొమ్మిది రోజుల పాటూ దుర్గమ్మకు వివిధ రూపాల్లో పూజలు చేశాక... పదో రోజున దసరా వేడుకలతో ఈ పండుగ ముగుస్తుంది. ఈ సంవత్సరం అక్టోబర్ 8న దసరా జరగనుంది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 27, 2019, 11:04 AM IST
దసరా నవరాత్రులు... ఏ అమ్మవారికి ఏ నైవేద్యం పెడతారో తెలుసా..?
ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు (Credit - Twitter - Îsmart Rowdy Fellow)
  • Share this:
Dussehra 2019 : దసరా సందడి మొదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ స్కూళ్లకు సెలవులు ప్రకటించాయి. దీంతో... అందరూ దసరా సెలవులకు వెళ్లి... అమ్మవారిని వివిధ రూపాల్లో కొలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచీ ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తారు. దేవీ నవరాత్రులలో భాగంగా... అమ్మవారిని ఒక్కోరోజు ఓక్కో రూపంలో పూజిస్తారు. అమ్మవారి ఒక్కో రూపానికీ... ఒక్కో పూజ ఉన్నట్లే... ఆమెకు సమర్పించే నైవేద్యం కూడా వేర్వేరుగా ఉంటుంది. చెడును అంతమొందించేందుకు... వివిధ సందర్భాల్లో అమ్మవారు... వివిధ రూపాల్లో అవతరించారు. ఆ రూపాలన్నింటికీ దసరా నాడు పూజలు చేస్తారు.

ఈ నెల 28న శనివారం నుంచీ... విజయవాడ దుర్గ గుడి సహా... అంతటా దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలూ నిర్వహిస్తున్నారు. అమ్మవారికి కుంకుమ పూజ అంటే చాలా ఇష్టం. అందువల్ల అమ్మవారికి చాలా ఆలయాల్లో కుంకుమ పూజలు కూడా జరుపుతున్నారు. అమ్మవారి అన్ని రూపాలకూ ఈ కుంకుమ పూజ నిర్వహించడం ఆనవాయితీ. ఈ తొమ్మిది రోజులూ... అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు పెట్టిన తర్వాత... భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు. మరి ఏ రూపంలో ఉన్న అమ్మవారికి ఏ నైవేద్యం అంటే ఇష్టమో తెలుసుకుందాం.

తొలిరోజు - శ్రీ బాలత్రిపుర సుందరీ దేవి, పొంగల్
రెండో రోజు - గాయత్రీ దేవి, పులిహోర
మూడో రోజు - అన్నపూర్ణా దేవి, కొబ్బరి అన్నం
నాల్గో రోజు - కాత్యాయని దేవి, అల్లం గారెలు
ఐదో రోజు - లలితా దేవి, దద్ధోజనం (పెరుగు అన్నం)ఆరో రోజు - శ్రీ మహాలక్ష్మీ దేవి, రవ్వ కేసరి
ఏడో రోజు - మహా సరస్వతి దేవి, కదంబం
ఎనిమిదో రోజు - మహిషాసుర మర్ధిని, బెల్లం అన్నం
తొమ్మిదో రోజు - రాజరాజేశ్వర దేవి, పరమాన్నం

ఇలా తొమ్మిది రోజులపాటూ... అమ్మవారిని వివిధ రూపాల్లో పూజించడం వల్ల సకల సౌభాగ్యాలూ కలుగుతాయని ప్రతీతి.
Published by: Krishna Kumar N
First published: September 27, 2019, 11:04 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading