Dussehra 2019 : దసరా ప్రత్యేకతలేంటి? ఈ సంవత్సరం ఎలా జరుగుతుంది?

Dussehra 2019 Date : వినాయక చవితితో మొదలయ్యే ఉత్సవాలు... దసరాకి మరింత వైభవంగా సాగుతాయి. ఆ తర్వాత 20 రోజులకు వచ్చే దీపావళిని అందరూ మర్చిపోలేని వేడుకలా జరుపుకుంటారు.

Krishna Kumar N | news18-telugu
Updated: September 23, 2019, 11:57 AM IST
Dussehra 2019 : దసరా ప్రత్యేకతలేంటి? ఈ సంవత్సరం ఎలా జరుగుతుంది?
దసరా ప్రత్యేకతలేంటి? ఈ సంవత్సరం ఎలా జరుగుతుంది? (Credit - Twitter - Temple Connect Official)
  • Share this:
Dussehra 2019 Date in India : దసరా... ఈ పండుగనే విజయదశమి అని కూడా పిలుచుకుంటున్నాం. ఏటా నవరాత్రి వేడుకలు ముగిశాక... పదో రోజున దసరా జరుపుకుంటున్నాం. ఈ రోజున దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు కార్యక్రమాలు, సంప్రదాయాలు, ఆచారాలూ నిర్వహిస్తారు. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో దసరా అంటే... రామాయణంలో రావణుడిపై శ్రీరాముడి విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. అలాగే తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో దసరా అంటే... రాక్షసుల రాజు మహిషాసురిడిపై దుర్గమ్మ (కాళికామాత) సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటూ దుర్గమ్మకు వివిధ రూపాల్లో పూజలు చేశాక... పదో రోజున దసరా వేడుకలతో ఈ పండుగ ముగుస్తుంది. ఈ సంవత్సరం అక్టోబర్ 8న దసరా జరగనుంది.

నవరాత్రులు : దసరా పండుగ నాడు ఉత్సవాలు కాస్త భిన్నంగానే ఉంటాయి. తొమ్మిది రోజుల పాటూ... దుర్గమ్మ విగ్రహాలకు పూజలు చేశాక... పదో రోజున అమ్మవారి విగ్రహాల్ని చెరువులు, నదుల్లో నిమజ్జనం చేస్తారు. అదే సమయంలో రావణాసురుడి దిష్టిబొమ్మలను తగలబెడతారు. ఆయనతోపాటూ... ఆయన సోదరులైన మేఘనాద, కుంభకర్ణుల దిష్టిబొమ్మల్ని కూడా తగలబెడతారు. ఈ పండుగ ముగుస్తూనే... దీపావళి వేడుకల సందడి మొదలవుతుంది. దసరా వచ్చిన 20 రోజుల తర్వాత మొదలయ్యే దీపావళిని దసరా నుంచే... వేడుకలా జరుపుకుంటూ ఉంటారు భారతీయులు.

చెడుపై విజయం : దసరా, విజయదశమిలో దేశవ్యాప్తంగా వేర్వేరు ఆచారాల్ని పాటిస్తున్నా... అన్నింటి సందేశమూ ఒక్కటే. చెడుపై మంచి విజయం. చెడు ఎప్పటికీ గెలవదు. మంచి ఎప్పటికైనా గెలిచి తీరుతుంది అనే. దసరా నాడు రామలీల మరో ప్రత్యేకత. ఇందులో భాగంగా... శ్రీరాముడి జీవిత కథను... పాటలు, నాటకాల రూపంలో ప్లే చేస్తారు. తద్వారా యువతకు, ముందు తరాల వారికీ... దసరా చరిత్ర తెలుస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది జరుపుకునే పండుకల్లో దసరా ప్రత్యేకమైనది. వారణాసిలో... శ్రీరామ కథను నెలపాటూ... రోజూ వినిపిస్తారు. అక్కడి రామనగర్‌లో జరిగే రామలీల... 31 రోజుల పాటూ కొనసాగుతుంది. ఈ సుదీర్ఘ సంప్రదాయ ఆచారాన్ని ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో... భారతీయ వారసత్వ సంపదగా గుర్తించింది.
Published by: Krishna Kumar N
First published: September 23, 2019, 11:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading