హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Dry Ginger Milk: రాత్రి పడుకునే ముందు శొంఠి పాలను తాగండి.. ఇకపై ఈ రోగాలేవీ మీకు రావు..

Dry Ginger Milk: రాత్రి పడుకునే ముందు శొంఠి పాలను తాగండి.. ఇకపై ఈ రోగాలేవీ మీకు రావు..

Dry Ginger with Milk: రాత్రిపూట పడుకునే ముందు శొంఠి పాలు తాగడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు నయమవుతాయి. మరి శొంటి పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

Dry Ginger with Milk: రాత్రిపూట పడుకునే ముందు శొంఠి పాలు తాగడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు నయమవుతాయి. మరి శొంటి పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

Dry Ginger with Milk: రాత్రిపూట పడుకునే ముందు శొంఠి పాలు తాగడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు నయమవుతాయి. మరి శొంటి పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Dry Ginger with  Milk: మన వంటగదిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పదార్థాలున్నాయి. మనకు ఏ చిన్న సమస్య వచ్చినా.. హాస్పిటల్, మెడికల్ షాప్‌కు పరిగెడతాం. కానీ మన ఆరోగ్య సమస్యను పోగొట్టే.. ఎన్నో దివ్యౌషధాలు మన కిచెన్‌లోనే ఉన్నాయి. వీటిలో ఒకటి శొంఠి పొడి ( Dry Ginger). అల్లంతో తయారు చేసే ఈ శొంఠి.. పలు అనారోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది. రాత్రిపూట పడుకునే ముందు శొంఠి పాలు తాగడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు నయమవుతాయి. మరి శొంటి పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

Coconut oil: శీతాకాలంలో కొబ్బరినూనె మ్యాజిక్ లాగా పని చేస్తుందట..!

చలికాలం వచ్చిందంటే చాలు మనలో చాలా మంది తరచుగా జలుబు బారిన పడుతుంటారు. అలాంటి వారంతా రాత్రి పడుకునే ముందు పాలలో శొంఠి పొడిని కలిపి తాగితే జలుబు దూరమవుతుంది. శొంఠిలోని ఉండే యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు జలుబును వీలైనంత త్వరగా అంతం చేస్తాయి.

శొంఠి అనేక వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఉదర సంబంధ సమస్యలకు దివ్యౌషధం. గ్యాస్ సమస్య, ఆహారం జీర్ణం కాకపోవడం, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం.. ఇలా ఎలాంటి ఉదర సమస్యలకైనా చక్కగా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు పాలల్లో శొంఠి పొడిని కలిపి తాగితే చాలు.. ఈ సమస్యలు తగ్గుతాయి.

వీటిని తిన్న తర్వాత నీళ్లు అస్సలు తాగకండి.. తాగితే చాలా డేంజర్..

శీతాకాలంలో చాలా మంది గొంతు నొప్పి సమస్యలతో బాధపడతారు. ఇలాంటప్పుడు శొండి పొడిని పాలలో కలిపి రాత్రి పడుకునే ముందు తాగాలి. కొన్ని రోజుల పాటు ఇలా తాగడం వల్ల గొంతు నొప్పి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

చలికాలంలో, ఎముకల కీళ్లలో సమస్యలు మొదలవుతాయి. కీళ్ల సమస్యలు పెరిగినప్పుడు అల్లం పొడిని పాలలో కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది. అల్లం పొడిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది, ఇది ఎముక నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి చలికాలంలో జలుబు, జలుబు, జ్వరం వంటి సమస్యలు వస్తుంటాయి. అలాంటప్పుడు రాత్రి పడుకునే ముందు శొంఠిని పాలలో కలిపి తాగడం వల్ల వ్యాధి నిరోధక శక్తి మెరుగుతుంది. సీజన్‌లో వచ్చే వ్యాధులు దూరమవుతాయి.

శొంఠి పొడిలో ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల రక్తహీనత ఉన్న వారు శొంఠి పొడిని పాలల్లో కలిపి తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.

(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. వీటిని అమలుచేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.)

First published:

Tags: Ginger, Health, Health Tips, Life Style

ఉత్తమ కథలు