• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • DRY FRUITS HEALTH BENEFITS ALMONDS CASHEW PISTA TRY THESE DRY FRUITS TO CONSUME DURING WINTER TO STAY HEALTHY SU GH

Dry Fruits: శీతాకాలంలో అనారోగ్యాలా?... ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకోండి

Dry Fruits: శీతాకాలంలో అనారోగ్యాలా?... ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

Dry Fruits Health Benefits: సాధారణంగా శీతాకాలంలో మన శారీరక జీవక్రియల (metabolism) రేటు తక్కువగా ఉంటుంది. అందువల్ల తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు.

  • Share this:
Dry Fruits Health Benefits: సాధారణంగా శీతాకాలంలో మన శారీరక జీవక్రియల (metabolism) రేటు తక్కువగా ఉంటుంది. అందువల్ల తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. చలికాలంలో నూనెలో వేయించిన వంటలకు బదులుగా డ్రై ఫ్రూట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. వీటిల్లో ఉండే సూక్ష్మ పోషకాలు.. ఈ సీజన్‌లో ఎదురయ్యే అనారోగ్యాలకు దూరంగా ఉంచుతాయి. డ్రై ఫ్రూట్స్‌లో ఉండే కొవ్వులు శక్తిని ఇస్తాయి. అల్పాహారంగానూ వీటిని తీసుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో శరీర వేడిని కాపాడేందుకు ఇవి తోడ్పడతాయి. విటమిన్లు, ప్రోటీన్లు, healthy fatsతో నిండి ఉండే ఈ డ్రై ఫ్రూట్స్ బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. ఈ సీజన్‌లో దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. బాదం, జీడిపప్పు, పిస్తా, అంజీర్, వాల్‌నట్స్‌ వంటివి శీతాకాలంలో అనారోగ్యాలకు దూరంగా ఉంచగలవు.

1. బాదం పప్పులు (Almonds)
బాదంపప్పులకు డ్రై ఫ్రూట్స్ రాజుగా పేరుంది. బాదం గింజల్లో ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు, ఫైబర్, జింక్, విటమిన్ ఇ.. వంటివి సమృద్దిగా ఉంటాయి. ఇవి మన శరీరంలో రక్త ప్రసరణను, హిమోగ్లోబిన్ స్థాయులను మెరుగుపరుస్తాయి. శరీరంలో పేరుకుపోయే కొలెస్ట్రాల్ స్థాయులను బాదం నియంత్రిస్తుంది. ఇవి తక్షణ శక్తిని ఇవ్వడంతో పాటు చలికాలంలో శరీరం వేడిని కోల్పోకుండా చూస్తాయి.

dry fruits health benefits, dry fruits use, almonds health benefits, cashew health benefits, Health benefits, Health benefits In Winter Season, Winter Season, Dry fruits, Health benefits of dry fruits, Benifits of dry fruits, Almonds, Cashew, Walnuts, Figs, Pistachios, డ్రై ఫ్రూట్స్‌, డ్రై ఫ్రూట్స్ ఉపయోగాలు, బాదం, జీడిపప్పు, పిస్తా, అంజీర్
బాదం పప్పులు


2. జీడిపప్పు (Cashew)
జీడిపప్పుకు కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును నియంత్రించే శక్తి ఉంటుంది. మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనానికి ఇది సహాయపడుతుంది. జీడిపప్పు నుంచి తీసే నూనె(Cashew nut oil)ను చర్మ సమస్యలకు నివారిగా వాడుకోవచ్చు. ఇది శీతాకాలంలో చర్మం పొడిబారటం, కాలి మడమల పగుళ్లు వంటి సమస్యలను దూరం చేస్తూ... చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. జీడిపప్పు నుంచి విటమిన్ ఇ అధికంగా లభిస్తుంది. దీంట్లో ఉండే పోషకాలు వయసుతో పాటు వచ్చే సమస్యలను దూరం చేస్తాయి.

3. అక్రోట్లు (Walnuts)
శీతాకాలంలో అక్రోట్లను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయి. ఇవి చలి ప్రభావాన్ని తగ్గిస్తూ, చర్మం వేడిని కోల్పోకుండా కాపాడుతాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గిస్తాయి. ఈ సీజన్‌లో ఉండే పొడి వాతావరణం వల్ల ఎదురయ్యే జుట్లు, చర్మ సమస్యలను అక్రోట్లు దూరం చేస్తాయి.

4. అంజీర్ (Figs)
అంజీర్‌ ద్వారా విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు శరీరానికి అందుటాయి. విటమిన్ ఎ, బి 1, బి 12, ఐరన్, మాంగనీస్, కాల్షియం, సోడియం, భాస్వరం, క్లోరిన్, పొటాషియం.. వంటి సూక్ష్మ పోషకాలకు అంజీర్‌ నిలయంగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయులను నియంత్రిస్తూ డయాబెటిస్ రాకుండా కాపాడతాయిalmonds

5. పిస్తా (Pistachios)
పిస్తాను తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. ఇవి హానికరమైన UV కిరణాల నుంచి చర్మాన్ని కాపాడతాయి. ఫ్రీ రాడికల్, వృద్ధాప్య సమస్యలకు నివారిణిగా పనిచేస్తాయి. శీతాకాలంలో అతినీలలోహిత కిరణాలు మరింత శక్తిమంతంగా ఉంటాయి. వీటి ప్రభావాన్ని తగ్గిస్తూ, ఆరోగ్యంగా ఉండటానికి డ్రై ఫ్రూట్స్‌ను క్రమం తప్పకుండా తీసుకోవాలి.
Published by:Sumanth Kanukula
First published: