Home /News /life-style /

DRIVE AWAY YOUR MID WEEK BLUES WITH THESE ALCOHOL BASED ICE CREAM IDEAS THAT ARE EASY TO MAKE AT HOME GH SRD

New Recepies: ఆల్కహాల్, ఐస్‌క్రీమ్‌ మిక్స్‌డ్ రెసిపీలు ట్రై చేశారా.. టేస్ట్ చేస్తే కిక్కే కిక్కు..

Photo Credit : Shutterstock

Photo Credit : Shutterstock

New Recepies: మందుబాబులు ఇంట్లోనే తమకు నచ్చిన ఆల్కహాల్‌ (Alcohol)తో టేస్టీ (Tasty) ఐస్‌క్రీమ్ తయారు చేసుకోవచ్చు. కాకపోతే అన్ని రకాల ఆల్కహాల్‌ డ్రింక్స్ మీకు ఇష్టమైన ఐస్‌క్రీమ్‌ ఫ్లేవర్‌తో సరిగా మిక్స్ కాలేవు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
ఐస్‌క్రీమ్‌ (Ice Cream) తినాలని చిన్న పెద్ద భేదం లేకుండా అందరికీ ఉంటుంది. అయితే ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ నచ్చుతుంది కాబట్టి ఇప్పటికే ఎన్నో ఫ్లేవర్స్‌తో వందల రకాలలో ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చారు తయారీదారులు. కానీ, తమకు నచ్చే ఆల్కహాల్ టేస్ట్‌తో ఐస్‌క్రీమ్స్‌ ఎవరూ తయారు చేయడం లేదని మందుబాబులు తెగ బాధపడిపోతుంటారు. అయితే మందుబాబులు ఇంట్లోనే తమకు నచ్చిన ఆల్కహాల్‌ (Alcohol)తో టేస్టీ (Tasty) ఐస్‌క్రీమ్ తయారు చేసుకోవచ్చు. కాకపోతే అన్ని రకాల ఆల్కహాల్‌ డ్రింక్స్ మీకు ఇష్టమైన ఐస్‌క్రీమ్‌ ఫ్లేవర్‌తో సరిగా మిక్స్ కాలేవు. కానీ మేం చెప్పబోయే 4 కాంబినేషన్స్ మాత్రం బాగా మిక్స్ అయి మైమరిపించే రుచితో మంచి కిక్ ఎక్కిస్తాయి. మరి ఆ ఐస్ క్రీమ్ రెసిపీస్ ఏంటి? వాటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

* కాఫీ & టకీలా
నీరసంగా ఉన్న మీ శరీరంలో తిరిగి ఎనర్జీ నింపేందుకు కాఫీ & టకీలా ఐస్‌క్రీమ్‌ బెస్ట్ ఆప్షన్. ఈ రెండు డ్రింక్స్ మిక్స్ చేస్తే కావాల్సిన కిక్ దొరుకుతుంది. కాఫీ, టకీలా అద్భుతమైన రుచులు ఐస్‌క్రీమ్‌తో కలిస్తే వచ్చే అనుభూతే వేరు. దీనిని తయారు చేయడానికి కాఫీ, టకీలా, ఐస్‌క్రీమ్‌ను ఒక గ్లాసులో యాడ్ చేసి ఎలక్ట్రిక్ బ్లెండింగ్ మెషిన్‌తో బాగా మిక్స్ చేస్తే సరిపోతుంది. వెనీలా ఐస్ క్రీమ్ టకీలాతో తీసుకుంటే బాగుంటుందని కూడా ట్రై చేసిన వారు అంటున్నారు.


* నిమ్మ & వోడ్కా
లెమన్ ఫ్లేవర్డ్ ఐస్‌క్రీమ్‌ను ఇష్టపడేవారు, దానిలో వోడ్కాను మిక్స్ చేయవచ్చు. ఈ కాంబినేషన్‌లో 40 శాతం వోడ్కా యాడ్ చేస్తే రుచి అదిరిపోతుంది. ఇలా చేస్తే గట్టిగా ఉన్న ఐస్‌క్రీమ్‌ ముక్కలు సాఫ్ట్‌గా తయారై అద్భుతమైన అనుభూతి దొరుకుతుంది.

* చాక్లెట్ & రమ్
చాక్లెట్ & రమ్ కాంబినేషన్ ఎవరికైనా సరే నచ్చి తీరాల్సిందే. ఐస్‌క్రీమ్‌ రూపంలో ఈ రెండు రుచులు కలిసినప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి.

ఇది కూాడా చదవండి : మీకు 18 ఏళ్లు దాటాయా..? అయితే, వెంటనే షుగర్ పరీక్ష చేయించుకోండి.. లేకపోతే, పెద్ద ప్రమాదమే..

* రెడ్ వైన్‌ & ఐస్‌క్రీమ్‌
రెడ్ వైన్‌ & ఐస్‌క్రీమ్‌ కాంబినేషన్ రెసిపీ రుచి చూస్తే మైమరిచి పోవాల్సిందే. దీనిని తయారు చేయడానికి ఒక కప్పు డబుల్ ఐస్‌క్రీమ్‌, స్వీట్ కండెన్స్‌డ్‌ మిల్క్, రెడ్ వైన్ ఒక గిన్నెలోకి తీసుకొని వాటిని బాగా బ్లెండ్ చేయాలి. తర్వాత ఆరు గంటలు ఫ్రిజ్‌లో స్టోర్ చేయాలి. ఆపై బయటికి తీసి సర్వ్ చేసుకొని లాగించేయొచ్చు.

* ఐస్ క్రీమ్ మార్టిని
30 మిల్లిలీటర్ల వోడ్కా, 30 మిల్లిలీటర్ల వైట్ చాక్లెట్ లిక్కర్, 30 మిల్లిలీటర్ల స్ట్రాబెర్రీ లిక్కర్, 3 స్కూప్స్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్, తగినంత చక్కెర యాడ్ చేసి ఐస్ క్రీమ్ మార్టిని తయారు చేయవచ్చు. ఈ కాంబో కూడా చక్కటి రుచిని అందిస్తుంది.
Published by:Sridhar Reddy
First published:

Tags: Alcohol, Food Items, Ice cream, Life Style

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు