హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Health tips: మీ శరీరంలో రక్తం తక్కువగా ఉందా? అయితే ఈ పండ్ల జ్యూస్​ తాగితే మేలు

Health tips: మీ శరీరంలో రక్తం తక్కువగా ఉందా? అయితే ఈ పండ్ల జ్యూస్​ తాగితే మేలు

ఎక్కువ రోజులు రక్తహీనత సమస్య కొనసాగితే.. ఆ తరువాత ఇతర సమస్యలు వచ్చిపడతాయి. అయితే మంచి ఆహారం, రక్తం పెంపొందించే ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని డాక్టర్లు, డైట్ స్పెషలిస్టులు సూచిస్తున్నారు.

ఎక్కువ రోజులు రక్తహీనత సమస్య కొనసాగితే.. ఆ తరువాత ఇతర సమస్యలు వచ్చిపడతాయి. అయితే మంచి ఆహారం, రక్తం పెంపొందించే ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని డాక్టర్లు, డైట్ స్పెషలిస్టులు సూచిస్తున్నారు.

బీట్​రూట్​లో మెగ్నీషియం, మాంగనీస్, జింక్ వంటివి ఉన్నాయి.. సాధారణంగా  హిమోగ్లోబిన్ పెరగడానికే అనుకుంటాం గానీ ఇదొక దివ్య ఔషధమని చాలామందికి తెలియదు. బీట్‌రూట్​ ప్రయోజనాలు చాలా ఉన్నాయి

  నిత్య జీవితంలో ఎదురయ్యే చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది బీట్‌రూట్(Beetroot). అయితే చాలామందికి బీట్​ రూట్​ తినడం ఇష్టముండదు. కానీ, బీట్​ రూట్​తో చాలా ప్రయోజనం ఉంటుంది. అందుకే ఇష్టం లేకపోయినా తీసుకోక తప్పదంటున్నారు నిపుణులు. బీట్ రూట్ జ్యూస్(juice) ‌‌తో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనివల్ల శరీరంలో రక్తం మోతాదును పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ A, విటమిన్ B6, ఐరన్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. బీట్ రూట్ జ్యూస్ ‌లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ఫొలేట్, విటమిన్ సీ, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ వంటివి ఉన్నాయి.. సాధారణంగా  హిమోగ్లోబిన్ పెరగడానికే అనుకుంటాం గానీ ఇదొక దివ్య ఔషధమని చాలామందికి తెలియదు. బీట్‌రూట్​ అంటే ఎంతగా ఇష్టముండదో..ప్రయోజనాలు అన్ని ఉన్నాయి. అందుకే ఇష్టం లేకపోయినా తీసుకోక తప్పదు. తినలేకపోతే జ్యూస్ చేసుకునైనా తాగండి. అది కూడా ఎలాగో తెలుసా. పరకడుపున రోజూ తాగితే కలిగే ప్రయోజనాలు ( Beet root juice benefits)అన్నీ ఇన్నీ కావు. బీట్‌రూట్‌లో మీకు తెలియని చాలా ఆరోగ్యకర ప్రయోజనాలున్నాయి.

  రక్తహీనతతో బాధపడే వారు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే(drink)  మంచి ఫలితం ఉంటుంది. రక్తం(blood) చాలా త్వరగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి త్వరిత కాలంలోనే బయట పడవచ్చు. ఇక ఇంట్లో పనుల వల్ల రోజంతా నీరసంగా ఉండేవారు ప్రతిరోజూ ఉదయం బీట్‌రూట్‌ జ్యూస్‌(Beetroot juice)తాగితే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. శక్తి అందుతుంది. దాంతో చురుగ్గా ఉంటారు. ఏ పనైనా చేయగలుగుతారు. హైబీపీ ఉన్నవారికి బీట్‌రూట్‌ ఒక ఔషధమనే చెప్పాలి. బీట్‌రూట్‌లో ఉండే పొటాషియం హైబీపీ(High BP)ని తగ్గిస్తుంది. గుండె జబ్బులు(heart problems) రాకుండా చూస్తుంది.

  ఇక కొలెస్ట్రాల్‌ అధికంగా ఉన్నవారు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే మంచిది. కొలెస్ట్రాల్‌ కరగడంతో పాటు బరువు కూడా తగ్గుతారు. గర్భిణీలు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగడం వల్ల..కడుపులో ఉండే బిడ్డకు మెరుగైన ఫోలిక్‌ యాసిడ్‌ (Folic acid) అందుతుంది. ఫలితంగా బిడ్డ ఎదుగుదల బాగుంటుంది. లివర్‌ సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా రోజూ బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగడం మంచిది. దీంతో లివర్‌‌లో ఉండే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోయి..లివర్ శుభ్రమవుతుంది. క్రమం తప్పకుండా బీట్‌రూట్ జ్యూస్ తాగడం అలవాటు చేసుకుంటే కొంతకాలానికి మీకు తెలియకుండానే మీలో జ్ఞాపకశక్తి పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

  బీట్ రూట్‌లో బోరాన్ అనే ఖనిజం ఉంటుంది. బీట్ రూట్ జ్యూస్ మన శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. బోరాన్, నైట్రిక్ ఆక్సైడ్ రెండూ కూడా సెక్స్ హార్మోన్లను ఉత్తేజ పరుస్తాయి. ఫలితంగా ఆరోగ్యకరమైన శృంగార సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు ఈ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Blood pressure, Drinkers, Fruits, Health benifits, Health Tips

  ఉత్తమ కథలు