చక్కెర పానియాలు.. ముఖ్యంగా సాఫ్ట్ డ్రింక్స్ వీటిని అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కాఫీ, తియ్యని ద్రవాల్లో చక్కెర ఉంటుంది. వీటిని ప్రతిరోజూ తగిన పరిమాణంలో తీసుకోవాలి. లేకపోతే ఊబకాయం, టైప్ 2 డయాబెటీస్(Diabetes)కు కారణమవుతాయి. అంతేకాదు ఈ శీతల పానియాలు దంతాలకు సైతం హాని కలిగిస్తాయి. క్యావిటీస్‌కు ప్రధాన కార మై, దంతక్షాయనికి దారితీస్తుంది. సోడా నీటిని తీసుకున్నపుడు అందులో ఉండే చక్కెరలు నోటిలోని సూక్ష్మజీవుల (Bacteria)తో చర్య జరిపి యాసిడ్ ఉత్పత్తికి కారణమవుతాయి. దీంతో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.
బరువు పెరగడం...
ఈ సాఫ్ట్ డ్రింక్‌లు తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. సోడా ఇతర శీతల పానియాల్లో (Cool drinks) చక్కెర మోతాదు అధికంగా ఉంటుంది. దీంతో త్వరగా ఒబేసిటీ రావడానికి కారణమవుతాయి. ఒక కోకాకోల క్యాన్‌లోనే 8 స్పూన్ల ^è క్కెర ఉంటుందంటే ఇది ఆశ్చర్యగొలిపే విషయమే కదా! ఈ శీతల పానియాలు దాహాన్ని తీరుస్తాయి. కానీ, పూర్తిగా కాదు. తాత్కాలికంగా దాహార్తిని తీరుస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. కానీ, దీర్ఘకాలంపాటు అతిగా తినడానికి కూడా ఇవి కారణమవుతాయి.
డయాబెటీస్‌కు దారితీస్తుంది..
ఇన్సూలిన్ హార్మొన్ల ప్రధాన పని గ్లూకోజ్‌ను రక్తకణాల నుంచి ఇతర కణాలకు రవాణా చేయడం. శీతల పానియాలను తరచూ తీసుకోవడం వల్ల కణాలు ఇన్సూలిన్ ప్రభావానికి లోనై క్లోమం మరింత ఇన్సూలిన్(Insulin)ను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల రక్తంలో ఇన్సూలిన్ స్పైక్ ఏర్పడుతుంది. సోడాలో చక్కెర ఎక్కువగా ఉన్నందుకు ఫ్రక్టోజ్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇన్సూలిన్ నిరోధకత ఏర్పడుతుందని అందరికీ తెలుసు. ఫలితంగా శీతల పానియాలు తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటీస్‌కు కారణమవుతుందని అనేక నివేధికలు తెలుపుతున్నాయి.
ఫ్యాటీ లివర్...
రీఫైన్డ్ చక్కెరలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌లు రెండు కలిపి ఉంటాయి. శరీర కణాలు గ్లూకోజ్‌ను త్వరగా గ్రహిస్తాయి. ఫ్రక్టోజ్ ప్రత్యేంగా కాలేయంపై ప్రభావం చూపుతుంది. ఎక్కువ సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల.. ఎక్కువ పరిమాణం ఫ్రక్టోజ్ కలిగి ఉంటుంది. ఫలితంగా అది శరీరానికి ఓవర్‌లోడ్ అవుతుంది. లివర్‌లో ఉండే ఫ్రక్టోజ్ తిరిగి కొవ్వుగా మారుతుంది. తిరిగి లివర్‌కు చేరుకుంటుంది. ఇది ప్రాణాంతకమైన ఫ్యాటీ లివర్(Fatty liver) కు దారితీస్తుంది.
దంతాక్షయం...
చల్లటి పానియాలు పంటికి హాని కలిగిస్తాయి. సోడాల్లో ఫాస్పరిక్, కార్బొనిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి రెండు దంతాక్షయానికి కారణమవుతాయి. పళ్ల ఎనమిల్‌ను డ్యామేజ్ చేస్తుంది. చక్కెరతో కూడిన యాసిడ్ బ్యాక్టిరియాకు అవసరమైన వాతావరణం. ఇది క్యావిటీకి కారణమవుతుంది.
అధిక క్యాలరీస్..
ఈ పానియాల్లో క్యాలరీస్ లేనివి. ఇందులో ఖనిజాలు, పోషకాలు కూడా ఉండవు. మామూలు సాఫ్ట్‌డ్రింక్ బాటిల్‌లో దాదాపు 150–200 కేలరీలు ఉంటాయి. ఇవన్నీ చక్కెర, కేలరీలు మాత్రమే. ఇవి అప్పటికీ మీ దాహాన్ని తీరుస్తాయి కానీ, కాలక్రమేణా అది ఓ అలవాటుగా మారిపోతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health problem, Obesity