Health Tips : బరువు తగ్గాలా... పార్స్‌లీ టీ తాగండి...

Parsley Tea Health Benefits : పార్స్‌లీ టీ వల్ల ప్రయోజనాలేంటో, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

news18-telugu
Updated: July 10, 2020, 6:07 AM IST
Health Tips : బరువు తగ్గాలా... పార్స్‌లీ టీ తాగండి...
బరువు తగ్గాలా... పార్స్‌లీ టీ తాగండి... (credit - twitter - WT Remedies)
  • Share this:
Parsley Tea Weight Loss Tips : మనం ఏదైనా వస్తువు మోస్తూ ఉంటే... కాసేపయ్యాక అది బరువుగా అనిపిస్తే... దాన్ని కింద పెడతాం. వస్తువు కాబట్టి అలా చెయ్యగలం. అదే శరీర బరువు ఎక్కువైతే... చాలా ఇబ్బంది. దాన్ని ఎలా వదిలించుకోవాలన్నదే పెద్ద సమస్య. డాక్టర్లు ఎన్నో చెబుతారు. డైట్ ట్రైనర్లు ఎన్నో సూచిస్తారు. చుట్టుపక్కల వాళ్లంతా రకరకాల సలహాలు ఇస్తారు. బరువు ఎక్కువగా ఉండేవారు అన్నింటినీ పాటిస్తూ ఉంటారు. కానీ ఎన్ని చేసినా ఈ బరువు తగ్గడం అన్నది మాత్రం అంత ఈజీ కాదన్నది ఎక్కువ మంది చెప్పే మాట. అలాగని ప్రయత్నం మానకూడదు. మానితే మరింత బరువు ఎక్కువైపోతూ ఉంటారు. ఐతే... బరువు తగ్గించేందుకు పార్స్‌లీ టీ బాగా ఉపయోగపడుతోందని తాజా పరిశోధనల్లో తేలింది.

పార్స్‌లీ టీ అంటే : ఈ పేరు మీకే కాదు... నాకూ కొత్తగానే అనిపించింది. ఇలాంటి టీ కూడా ఉంటుందా అన్న డౌట్ మనకు రావడం సహజం. ఇది అచ్చం కొత్తిమీరలా కనిపించే ఆకుల టీ. కానీ కొత్తిమీర, పార్స్‌లీ రెండూ ఒకటి కాదు. అసలీ పార్స్‌లీ ఆకులు మనకు బయట దొరికే అవకాశాలు తక్కువ. అందువల్ల ఈ టీ తాగాలనుకునేవారికి పార్స్‌లీ టీ పొడి, పార్స్‌లీ టీ బ్యాగ్స్... సూపర్ మార్కెట్లలో లభిస్తున్నాయి. అమేజాన్ లాంటి ఈ-కామర్స్ సైట్లలో కూడా దొరుకుతున్నాయి. కాబట్టి... ఆ టీ పొడి (టీ బ్యాగ్ కంటే టీ పొడి మేలు) కొనుక్కొని... వాడితే మంచిది. ఎందుకంటే... పార్స్‌లీ ఆకుల్లో విటమిన్ A, B (ఫోలేట్), C, Kతోపాటూ... ఐరన్, పొటాషియం, కాల్షియం, ఫార్పరస్, ఫ్లేవనాయిడ్ క్వెర్సెటిన్ (విష వ్యర్థాల్ని తరిమేసే యాంటీ ఆక్సిడెంట్) వంటివి ఉంటాయి. లక్కేంటంటే... ఈ టీ తాగితే... మన శరీరంలో వ్యర్థ కొవ్వులు మాత్రమే బయటకు పోతాయి. పోషకాల్ని మనం నష్టపోవట్లేదు.

డయాబెటిస్ ఉన్న వారి రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించడంలో కూడా పార్స్‌లీ టీ ఉపయోగపడుతోంది. గ్లూకోజ్ లెవెల్స్ సరిగా ఉన్నప్పుడు... మన శరీర బరువు కూడా పద్ధతిగా ఉంటుంది. అప్పుడు మన లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. ఫలితంగా మన జీర్ణవ్యవస్థ కూడా చక్కగా పనిచేస్తూ మనం ఆరోగ్యంగా ఉంటాం. అందువల్ల తీపి జ్యూస్‌లు, డ్రింకులు, పానీయాలు తాగేబదులు... పార్స్‌లీ టీ తాగితే అన్నీ లాభాలే.

పార్స్‌లీ టీ తయారీ విధానం : ఓ కప్పు నీటిలో (200ML) పార్స్‌లీ టీ పొడి వెయ్యాలి. ఓ ఐదు నిమిషాలు సిమ్ లో మరగనివ్వాలి. ఆ తర్వాత ఫిల్టర్ చెయ్యాలి. ఇప్పుడా పార్స్‌లీ టీ నీరులో... తీపి కోసం కొద్దిగా తేనె కలుపుకోవచ్చు. ఈ టీని రోజూ రెండుసార్లు తాగుతూ ఉంటే... బయటకు తెలియకుండా... లోలోపల మన శరీరంలో చెడు కొవ్వు అలా అలా కరిగిపోతూ ఉంటుంది. కొన్ని రోజులకే మనం బరువు తగ్గగలం అని పరిశోధకులు చెబుతున్నారు.

 

Pics : బిగ్ బాస్ బ్యూటీ నివేదితా సొగసరి అందాలు
ఇవి కూడా చదవండి :


Health Tips : టైప్-2 డయాబెటిస్ తగ్గేందుకు ఈ ఆహారం తినండి...

Health Tips : బరువు తగ్గాలా... కుంకుమ పువ్వుతో ఇలా చెయ్యండి...

Health Tips : పుట్టగొడుగుల సూప్... తయారీ విధానం ఇదీ...

Health Tips : డైటింగ్, ఎక్సర్‌సైజ్ రెండూ చేస్తున్నారా... డేంజరే

Health Tips : కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్... ఇంటి దగ్గరే తయారుచేసుకోండి

Health Tips : స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి 7 సహజ మార్గాలు
Published by: Krishna Kumar N
First published: July 10, 2020, 6:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading