హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Tea Side Effects: ఎక్కువగా టీ తాగుతున్నారా?టీ వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకోండి

Tea Side Effects: ఎక్కువగా టీ తాగుతున్నారా?టీ వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టీ తాగడం తప్పు కాదు. కానీ పరిమిత పరిమాణంలో తీసుకోవడం మంచిది. టీ వ్యసనం ఒక చెడు వ్యసనం. ఎందుకంటే మీ అలసటను పోగొట్టే ఈ టీ మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఈ రోజుల్లో టీ(Tea) అలవాటు లేనివారు చాలా తక్కువ మందే ఉంటారు. చాలామందికి టీ తాగితేనే రోజు ప్రారంభమవుతుంది. కొందరు రోజుకు కనీసం మూడు నుండి నాలుగు సార్లు టీ తాగుతారు. మీరు కూడా అలాంటివారైతే జాగ్రత్తగా ఉండండి. ఒత్తిడిలో ఉన్నప్పుడు మనం ముందుగా ఒక కప్పు టీ తాగడానికి ఇష్టపడతాం. అదే సమయంలో అధికంగా టీ తాగేవారికి రోజుకు ప్రతి 2 నుండి 3 గంటలకు టీ అవసరం. అయితే టీ తాగడం తప్పు కాదు. కానీ పరిమిత పరిమాణంలో తీసుకోవడం మంచిది. టీ వ్యసనం ఒక చెడు వ్యసనం. ఎందుకంటే మీ అలసటను పోగొట్టే ఈ టీ మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. కాబట్టి ఎక్కువ టీ తాగడం వల్ల మీకేం హాని కలుగుతుందో చూద్దాం

డీహైడ్రేషన్ సమస్య

పాల టీని తరచుగా తాగడం వల్ల చాలా మందిలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. అయితే టీలో ఉండే కెఫిన్ శరీరానికి అనేక విధాలుగా హాని కలిగిస్తుంది. అలాగే శరీరంలో నీరు పేరుకుపోకుండా చేస్తుంది. ఇది డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. కాబట్టి మీరు టీ తాగడం ద్వారా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే పరిమిత పరిమాణంలో తీసుకోడానికిప్రయత్నించండి.

మొటిమల సమస్య

పాలతో చేసిన టీని అధికంగా తీసుకోవడం వల్ల మీ చర్మంపై మొటిమలు ఏర్పడతాయి. పరిమిత పరిమాణంలో టీ తీసుకోవడం వల్ల శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. కానీ అదుపు లేకుండా తీసుకుంటే శరీరంలో చాలా వేడి పుట్టిస్తుంది. దీని వల్ల శరీరంలోని హార్మోన్లు అసమతుల్యత చెందుతాయి. మోటిమల సమస్య వస్తుంది.

రక్తపోటు అసమతుల్యత కావచ్చు

మీరు ఎక్కువగా టీ తాగినప్పుడు కొన్నిసార్లు మీ రక్తపోటు చాలా పెరుగుతుంది. అదే సమయంలో హార్ట్ బీట్ రేటును కూడా పెంచుతుంది.

Dhanteras 2022: మీ రాశి ప్రకారం ధంతేరస్ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే అవి కొనాలంట

నిద్రలేమి

మిల్క్ టీని తయారు చేయడానికి ఉపయోగించే బ్లాక్ టీలో కెఫిన్ గణనీయమైన మొత్తంలో ఉంటుంది. అయితే, రోజు రెండవ భాగంలో దాని వినియోగాన్ని నివారించండి. నిద్ర అసమతుల్యత కావచ్చు. సరైన సమయంలో పరిమిత మోతాదులో తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ అదుపు లేకుండా తీసుకుంటే నిద్రలేమికి దారి తీస్తుంది. దీంతో మొత్తం ఆరోగ్యం క్షీణిస్తుంది.

కడుపు ఉబ్బరం ఒక సమస్య

చాలా మంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగుతారు. ఇది కడుపు ఉబ్బరం చేస్తుంది. ఎందుకంటే పాలు, కెఫిన్ రెండూ గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ రెండూ కలిస్తే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. పరిమిత పరిమాణంలో తీసుకుంటే హాని లేదు. రాత్రి పడుకునే ముందు టీ తాగడం కూడా ప్రమాదకరమే.

టీ వినియోగాన్ని ఎలా పరిమితం చేయాలి?

టీ వినియోగాన్ని పరిమితం చేయడానికి ఆరోగ్యకరమైన జ్యూస్ తాగండి. ఉదాహరణకు స్మూతీస్, హెర్బల్ టీలు, పండ్ల రసాలు మొదలైనవి. శరీరాన్ని పూర్తిగా హైడ్రేట్ గా ఉంచడానికి ప్రయత్నించండి. అంటే నీరు ఎక్కువగా తాగాలి.

First published:

Tags: Health care, Life Style, Tea

ఉత్తమ కథలు