Matcha Tea : జపాన్ మాచా టీ తాగారా... మీ టెన్షన్లన్నీ పరార్...

Matcha Tea : టీ అనగానే మనం ఎంతసేపూ లోకల్ బ్రాండ్లనే వాడుతుంటాం. కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా రుచులున్నాయి. అవన్నీ టేస్ట్ చూసే ఛాన్స్ ఉన్నప్పుడు... జీవితంలో ఒక్కసారైనా టేస్ట్ చూస్తే మంచిదేగా. ఆ అవకాశం మాచా టీ కలిగిస్తోంది. అసలేంటి ఈ టీ... దీనితో ప్రయోజనాలేంటి... తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: September 21, 2019, 5:40 AM IST
Matcha Tea : జపాన్ మాచా టీ తాగారా... మీ టెన్షన్లన్నీ పరార్...
మాచా టీ పొడితో టెన్షన్ పరార్
  • Share this:
మీరు రోజూ టెన్షన్లతో జీవిస్తుంటారా? పని ఒత్తిడి బాగా ఉంటుందా? అయితే మీకు సరైన టీ... జపనీస్ మాచా టీ. ఇది టెన్షన్, తలనొప్పి, ఆతృత, కంగారు, బడలిక, నీరసం, ఆందోళన వంటి లక్షణాల్ని పోగొట్టడంలో ఈ టీకి తిరుగులేని పరిశోధనలో తేలింది. మాచా అనే మొక్కల ఆకుల నుంచీ... పొడిని తయారుచేస్తారు. ఆ పొడే... మాచా టీ పొడి. చూడ్డానికి గోరింటాకు పొడిలా కనిపిస్తుంది. ఈ టీ తాగితే మన శరీరంలో డోపమైన్ D1 రిసెప్టర్లు, సెరొటోనిన్ 5HT1A రిసెప్టర్లు యాక్టివేట్ అవుతాయట. ఇవి రెండూ టెన్షన్, ఆతృతలను తగ్గించేవి. ఇవి యాక్టివేట్ అయితే... మనకే మంచిది. నిజానికి పూర్వ కాలం నుంచీ మాచా ఆకుల పొడిని... మందుల తయారీలో వాడేవాళ్లు. అప్పట్లో ఇది మనుషుల శరీరానికి మేలు చేస్తుంది అనుకునేవారు. దీనితో టెన్షన్ తగ్గించే ప్రయోజనం ఉందని జపాన్‌లోని కుమామోటో యూనివర్శిటీ పరిశోధనలో తేలింది.

మాచా పొడిని మొదట... ఎలుకలపై ప్రయోగించి చూశారు. ఆ పొడితో చేసిన టీ తాగిన ఎలుకల్లో... టెన్షన్ బాగా తగ్గిపోయింది. దాంతో మనుషులపై కూడా ప్రయోగాలు చేశారు. అవి కూడా అంతే సక్సెస్ అయ్యాయి. వేడి నీటిలో మాచా టీపొడిని కలుపుకొని... ఫిల్టర్ చేసి తాగితే చాలు. లేదంటే... మాచా టీ పొడి బ్యాగ్స్ ఉపయోగించినా అంతే ప్రయోజనం కలుగుతోంది. ఈ టీపొడి ప్యాకెట్లు ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలో లభిస్తున్నాయి.

మామూలు టీ పొడులకూ, మాచా టీ పొడికీ ప్రధాన తేడా ఒకటుంది. జపాన్‌లోని మాచా మొక్కలకు కొత్తగా వచ్చే ఆకుల నుంచీ ఈ పొడిని సేకరిస్తారు. ఆ ఆకుల్లో కూడా... 90 శాతం నీడలో పెరిగిన ఆకుల్ని మాత్రమే సేకరిస్తారు. అలా నీడలో పెరిగిన కొత్త ఆకుల్లోనే మన టెన్షన్ తగ్గించే అద్భుత లక్షణాలున్నాయని తేలింది. ఇంకా ఈ టీ పొడితో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా... ప్రధానంగా టెన్షన్ తగ్గేందుకు మాత్రం ఇప్పుడు జపనీయులు ఈ టీపొడినే వాడుతున్నారు.

First published: September 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com