మీరు రోజూ టెన్షన్లతో జీవిస్తుంటారా? పని ఒత్తిడి బాగా ఉంటుందా? అయితే మీకు సరైన టీ... జపనీస్ మాచా టీ. ఇది టెన్షన్, తలనొప్పి, ఆతృత, కంగారు, బడలిక, నీరసం, ఆందోళన వంటి లక్షణాల్ని పోగొట్టడంలో ఈ టీకి తిరుగులేని పరిశోధనలో తేలింది. మాచా అనే మొక్కల ఆకుల నుంచీ... పొడిని తయారుచేస్తారు. ఆ పొడే... మాచా టీ పొడి. చూడ్డానికి గోరింటాకు పొడిలా కనిపిస్తుంది. ఈ టీ తాగితే మన శరీరంలో డోపమైన్ D1 రిసెప్టర్లు, సెరొటోనిన్ 5HT1A రిసెప్టర్లు యాక్టివేట్ అవుతాయట. ఇవి రెండూ టెన్షన్, ఆతృతలను తగ్గించేవి. ఇవి యాక్టివేట్ అయితే... మనకే మంచిది. నిజానికి పూర్వ కాలం నుంచీ మాచా ఆకుల పొడిని... మందుల తయారీలో వాడేవాళ్లు. అప్పట్లో ఇది మనుషుల శరీరానికి మేలు చేస్తుంది అనుకునేవారు. దీనితో టెన్షన్ తగ్గించే ప్రయోజనం ఉందని జపాన్‌లోని కుమామోటో యూనివర్శిటీ పరిశోధనలో తేలింది.
మాచా పొడిని మొదట... ఎలుకలపై ప్రయోగించి చూశారు. ఆ పొడితో చేసిన టీ తాగిన ఎలుకల్లో... టెన్షన్ బాగా తగ్గిపోయింది. దాంతో మనుషులపై కూడా ప్రయోగాలు చేశారు. అవి కూడా అంతే సక్సెస్ అయ్యాయి. వేడి నీటిలో మాచా టీపొడిని కలుపుకొని... ఫిల్టర్ చేసి తాగితే చాలు. లేదంటే... మాచా టీ పొడి బ్యాగ్స్ ఉపయోగించినా అంతే ప్రయోజనం కలుగుతోంది. ఈ టీపొడి ప్యాకెట్లు ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలో లభిస్తున్నాయి.
మామూలు టీ పొడులకూ, మాచా టీ పొడికీ ప్రధాన తేడా ఒకటుంది. జపాన్‌లోని మాచా మొక్కలకు కొత్తగా వచ్చే ఆకుల నుంచీ ఈ పొడిని సేకరిస్తారు. ఆ ఆకుల్లో కూడా... 90 శాతం నీడలో పెరిగిన ఆకుల్ని మాత్రమే సేకరిస్తారు. అలా నీడలో పెరిగిన కొత్త ఆకుల్లోనే మన టెన్షన్ తగ్గించే అద్భుత లక్షణాలున్నాయని తేలింది. ఇంకా ఈ టీ పొడితో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా... ప్రధానంగా టెన్షన్ తగ్గేందుకు మాత్రం ఇప్పుడు జపనీయులు ఈ టీపొడినే వాడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health Tips, Japan, Life Style, Tips For Women, Women health