హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

food while Alcohol: ఆల్కాహాల్​ తాగే సమయంలో ఈ పదార్థాలు అసలే తినొద్దు.. లేదంటే ఆరోగ్య సమస్యలే..

food while Alcohol: ఆల్కాహాల్​ తాగే సమయంలో ఈ పదార్థాలు అసలే తినొద్దు.. లేదంటే ఆరోగ్య సమస్యలే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మద్యం సేవించే సమయంలో ఎలాంటి పదార్థాలు(items) తినకూడదో మీకు తెలుసా. మద్యం సేవించే సమయంలో కొన్ని పదార్ధాలు స్టఫ్‌గా తీసుకోకూడదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

కొందరు బాధలో ఉన్నప్పుడు ఆల్కాహాల్ (Alcohol) సేవిస్తే, మరికొందరు సంతోషంగా ఉన్నప్పుడు తాగుతారు. ఏది ఏమైనా చాలామందికి తాగడం మాత్రం కామన్​గా పెట్టుకుంటారు. స్నేహితులతో సరదాగా మాట్లాడుకోవడానికీ తాగేవారు ఉన్నారు. కొత్త కొత్త బంధాలు ఏర్పరుచుకోవడానికీ తాగుతారు. బంధువులు ఒక్కచోట కలిసినా చాలామంది చేసే పని సిట్టింగ్​. మరికొంతమంది తమ పుట్టినరోజు లాంటి ఏదైనా సంతోషకరమైన సందర్భంలో మద్యం పుచ్చుకుంటారని తెలిసిందే. అయితే కొందరు మద్యం సేవించే సమయంలో ఎక్కువగా తిను పదార్థాలు (food while Alcohol) తీసుకుంటారు. మరికొందరు మందుబాబులు ఎలాంటి స్టఫ్ లేకుండా బీరు(beer) సీసాలకు సీసాలు, లేక గ్లాసులకు గ్లాసులు లాగించేవాళ్లు లేకపోలేదు. చివరగా ఇంకొక్క క్వార్టర్ ఉంటే బాగుండేదంటూ మందుబాబులు ముచ్చట్లు చెబుతుంటారు. కొన్ని ప్రాంతాల్లో సంప్రదాయం పేరుతో మద్యం సేవిస్తుంటారు. కొన్నిచోట్ల అలవాటు చేసుకున్న కారణంగా ఆల్కహాల్ తీసుకుంటారు, కానీ మద్యం(Alcohol) సేవించే సమయంలో ఎలాంటి పదార్థాలు(items) తినకూడదో మీకు తెలుసా. మద్యం సేవించే సమయంలో ఈ పదార్ధాలు స్టఫ్‌గా తీసుకోకూడదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

ఆల్కాహాల్ సేవిస్తూ వేరుశెనగ,  పొడి జీడిపప్పు(Cashew) తినడం చాలా మందికి ఇష్టం. కానీ ఈ రెండు పదార్థాలను ఎప్పుడూ మద్యం సేవిస్తూ తినకూడదు. వేరుశెనగ, జీడిపప్పులో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి చాలా హానికరం. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెపోటు(Heart Attack) వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఆల్కహాల్ తాగుతూ వీటిని తినడం ద్వారా వాంతులు చేసుకునే అవకాశం కూడా ఉందట. కొంతమందికి సోడా లేదా కోల్డ్ డ్రింక్‌తో పాటు మద్యం సేవించే అలవాటు ఉంది. ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆల్కహాల్‌లో సోడా లేదా శీతల పానీయం కలిపి తాగడం వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గుతుంది. అందుకే వీలైతే నీళ్లు కలుపుకుని ఆల్కహాల్ సేవించాలి.

ఆల్కాహాల్ తో జిడ్డు పదార్థాలు తినవద్దు

ఆల్కాహాల్ సేవించేటప్పుడు లేదా ఆల్కాహాల్ సేవించిన తర్వాత ఎప్పుడూ జిడ్డు ఉండే పదార్ధాలను తినకూడదు. తద్వారా కడుపులో గ్యాస్, కడుపులో మంట లాంటి సమస్యలు తలెత్తవచ్చు. చిప్స్‌ను కూడా స్టఫ్‌గా తినకూడదు. చిప్స్ తినడం వల్ల మీకు చాలా దాహం వస్తుంది. దీనివల్ల కాస్త నియంత్రణ కోల్పోయి మందుబాబులు మరింత ఎక్కువ మద్యం తాగుతారు.

పాల ఉత్పత్తులను తినవద్దు

కొంతమంది ఆల్కాహాల్ తో జున్ను లాంటివి తింటారు. పొరపాటున కూడా అలా తినకూడదు. పాల ఉత్పత్తుల(Milk Products)తో తయారైన వస్తువులను మద్యం సేవించే సమయంలో లేదా ఆ తర్వాత ఒక గంట సమయం వరకు తినకూడదు. పాలతో చేసిన వస్తువులను తినడం వల్ల జీర్ణక్రియను దెబ్బతీస్తాయి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ఆల్కాహాల్ సేవిస్తున్న సమయంలోగానీ లేక ఆ తర్వాత ఒక గంటసేపు వరకు తియ్యని పదార్థాలు తినకూడదు. మద్యంతో తీపి తింటే మత్తును రెట్టింపు చేస్తుంది. దీనితో, వ్యక్తి తన నియంత్రణ కోల్పోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

First published:

ఉత్తమ కథలు