హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

కుక్కలు క్యాన్సర్‌ను సైతం పసిగట్టేస్తాయి...అమెరికన్ శాస్త్రవేత్తల ప్రకటన...

కుక్కలు క్యాన్సర్‌ను సైతం పసిగట్టేస్తాయి...అమెరికన్ శాస్త్రవేత్తల ప్రకటన...

 రక్తంలోని క్యాన్సర్‌ కణాలను సైతం కుక్కలు పసిగడతాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అంతేకాదు శునకాలు క్యాన్సర్ కణాలు గుర్తించడంలో 97 శాతం సక్సెస్ సాధించినట్లు శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు.

  శునకంలా వాసన పసిగట్టే జంతువు ఈ ప్రపంచంలోనే లేదు అంటుంటారు.. బాంబ్ స్క్వాడ్, క్లూస్ టీమ్, రెస్క్యూ టీమ్‌లలో శునకాలు లేకుండా మనం  ఊహించలేము. అంతేకాదు కుక్కలు మనిషి కన్నా 10వేల రెట్లు ఎక్కువగా వాసనలను గ్రహిస్తాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రక్తంలోని క్యాన్సర్‌ కణాలను సైతం కుక్కలు పసిగడతాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అంతేకాదు శునకాలు క్యాన్సర్ కణాలు గుర్తించడంలో 97 శాతం సక్సెస్ సాధించినట్లు శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు.

  అమెరికాకు చెందిన హెల్త్ కేర్ సంస్థ, బయోసెంట్ డీఎక్స్ లీడ్ రీసెర్చర్ హీదర్ జున్‌క్వెరా తన పరిశోధనా పత్రంలో క్యాన్సర్ కణాలను గుర్తించడంలో కుక్కలు ప్రముఖపాత్ర పోషించనున్నాయని తెలిపారు. తన పరిశోధనలో భాగంగా హీదర్ నాలుగు బీగిల్ జాతికి చెందిన కుక్కలను ఎంపిక చేసుకున్నాడు. తర్వాత ఆరోగ్యకరమైన వ్యక్తులకు చెందిన రక్తపు శాంపిళ్లతో పాటు, ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకిన వ్యక్తి రక్తపు శాంపిల్‌ను కలిపి వరుసలో పెట్టి బీగిల్ శునకాలను వాసన చూసేందుకు వదలగా , ఆ శునకాలు ఆరోగ్యకరమైన వ్యక్తులు రక్తపు శాంపిళ్లను వదిలిపెట్టి, క్యాన్సర్ సోకిన వ్యక్తి రక్తపు శాంపిల్ దగ్గరే ఆగిపోయాయి. ఇలా శాంపిల్స్‌ను మారుస్తూ, వరుసగా మళ్లీ పరీక్షలు నిర్వహించినప్పటికీ, కుక్కలు మళ్లీ క్యాన్సర్ సోకిన రక్తం శాంపిల్ వద్దే ఆగడం విశేషం.

  ఇదిలాఉంటే ఫ్లోరిడాలో నిర్వహించిన అమెరికన్ సొసైటీ ఫర్ బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీ వార్షిక సమావేశంలో ఈ పరిశోధనా పత్రాన్ని ప్రవేశపెట్టనున్నారు.

  First published:

  Tags: Cancer, Health Tips, HOME REMEDIES, Life Style, World Cancer Day

  ఉత్తమ కథలు