Home /News /life-style /

Skin care: వర్షాకాలంలోనూ చర్మం జిడ్డుగా మారుతుందా? అయితే ఇలా చేయండి.. చర్మాన్ని రక్షించుకోండి

Skin care: వర్షాకాలంలోనూ చర్మం జిడ్డుగా మారుతుందా? అయితే ఇలా చేయండి.. చర్మాన్ని రక్షించుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొంతమంది ఎంత ప్రయత్నించినా, ఎన్ని క్రీములు, ఫేస్​ ప్యాక్​లు వాడినా తమ చర్మం(skin) జిడ్డు(oily)గా ఉంటుందని బాధపడుతుంటారు. అలాంటి వారు కొన్ని పద్దతులు పాటిస్తే జిడ్డును తొలగించుకోవచ్చు.

వర్షాకాలంలో (monsoon) చల్లటి వాతావరణం కారణంగా గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. తద్వారా, చర్మం తరచుగా జిడ్డు, నీరసంగా మారుతుంది. ఇది క్రమంగా మొటిమలు, మచ్చలకు దారితీస్తుంది. వాతావరణ పరిస్థితులు, కలుషితమైన గాలి కారణంగా ముఖంతో తేజస్సు తగ్గిపోతుంది. మొటిమలు (pimples) తయారవుతాయి. ఇక వేళకు తినకుండా ఒత్తిడికి లోనయ్యే వారికి నల్లటి వలయాలు (dark circles) కంటి చుట్టూ ఏర్పడతాయి. మనం తినే ఆహారం కూడా మన అందం (beauty)పై ప్రభావం చూపుతుంది. అందుకే వైద్యులు సరైన పోషక ఆహారం తీసుకోవాలని సూచిస్తారు. అయితే  కొంతమంది ఎంత ప్రయత్నించినా, ఎన్ని క్రీములు, ఫేస్​ ప్యాక్​లు వాడినా తమ చర్మం(skin) జిడ్డు(oily)గా ఉంటుందని బాధపడుతుంటారు. అలాంటి వారు కొన్ని పద్దతులు పాటిస్తే జిడ్డును తొలగించుకోవచ్చు.

గోబి ఆకులతో..

ఏ భాగంలో నల్లగా (black) ఉంటుందో ఆ భాగంలో గోబి ఆకుల (leaf)ను పేస్ట్ ను పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా వారానికి రెండు రోజులు చేయడం మంచిది. చర్మాన్ని శుద్ధి చేయడానికి పెరుగు (curd) బాగా సహాయపడుతుంది.  ఎలాగంటే శరీరంలో ఏ భాగం నల్లబడిందో ఆ భాగములో పెరుగు తీసుకొని బాగా మర్దన చేయాలి. ఇలా  20 నిమిషాల పాటు చేయడంవల్ల ఫలితాలు  ఉంటాయి.

గోరు వెచ్చని నీటితో..

చుట్టూ ఉండే అపరిశుభ్రత వల్ల సూక్ష్మక్రిములు మన శరీరంలోకి చేరతాయి. దీని వల్ల చర్మ సమస్యలు వస్తుంటాయి. దీనికి చెక్​ పెట్టేందుకు రోజుకు రెండుసార్లు గోరువెచ్చని నీటి (lukewarm water)తో ముఖం కడగాలి. తద్వారా మీ ముఖం కాంతివంతం అవుతుంది. ముఖంపై ఏమైనా సూక్ష్మ క్రిములు ఉంటే అవి చనిపోతాయి. అంతేకాదు, దుమ్ము, ధూళి కణాలను ఇది తొలగిస్తుంది. ఆపై మీ చర్మం ఎంతో మృదువుగా తయారవుతుంది.

ఇది కూడా చదవండి: ముఖంలో కాంతి, తేజస్సు కావాలా ? మొటిమలు తగ్గిపోవాలా? అయితే ఇలా చేయండి

ఎండకు కమిలి పోయిన చర్మం (skin) మెరుస్తూ ఉండాలంటే కలబంద (aloe Vera) జెల్ ను తీసుకొని చర్మానికి పట్టించండి. ఇది ధర్మంలోని మెలనిన్ మొత్తాన్ని తగ్గించడంతో పాటు పిగ్మెంటేషన్ తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. దీనివల్ల చర్మం క్రమంగా మెరుస్తూ ఉంటుంది. చర్మశుద్ధి సమస్య నుండి బయటపడడానికి కాకరకాయ రసం బాగా పనిచేస్తుంది.  ఎలాగంటే నల్లటి చర్మం (black skin) పై కాకరకాయ రసంతో 3  నుంచి నాలుగు సార్లు అప్లై చేయడం వల్ల  మెరుగైన ఫలితాలు చూడొచ్చు.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Beauty tips, Life Style, Monsoon rains

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు