Beauty tips: మీ జుట్టు చిక్కులు చిక్కులుగా ఉంటుందా? అయితే కోడిగుడ్లతో ఇలా మృదువుగా చేసుకోండి.

ప్రతీకాత్మక చిత్రం

చాలామందికి జుట్టు రాలిపోవడం (hair fall), ఒత్తుగా ఉండకపోవడం, చిక్కులు చిక్కులుగా ఉండటం తదితర సమస్యలతో బాధపడుతారు. ఇలాంటి వారు కోడిగుడ్ల (eggs)తో తయారు చేసిన పదార్థాన్ని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. మీ జుట్టు మృదువుగా (smooth), ఒత్తుగా మారుతుంది. ఆ కొడిగుడ్లతో తయారు చేసే పదార్థం వివరాలు ఒకసారి తెలుసుకుందాం..

  • Share this:
    జుట్టు (Hair) ఎక్కువ ఉంటే అందంగా కనిపిస్తారు. అందుకే జుట్టు ఒత్తుగా, మృదువుగా కనిపించడానికి చేయని ప్రయోగాలు అంటూ ఉండవు. ఇక మహిళలకైతే (women) జుట్టు ఎంత బాగుంటే అంత అందం. అయితే చాలామందికి జుట్టు రాలిపోవడం (hair fall), ఒత్తుగా ఉండకపోవడం, చిక్కులు చిక్కులుగా ఉండటం తదితర సమస్యలతో బాధపడుతారు. ఇలాంటి వారు కోడిగుడ్ల (eggs)తో తయారు చేసిన పదార్థాన్ని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. మీ జుట్టు మృదువుగా (smooth), ఒత్తుగా మారుతుంది. ఆ కొడిగుడ్లతో తయారు చేసే పదార్థం వివరాలు ఒకసారి తెలుసుకుందాం.. మొదటగా రెండు కోడిగుడ్లుని అలాగే మూడు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ ను తీసుకుని అందులో కోడిగుడ్లు పగులగొట్టి ఒక బౌల్ లో పోసుకోవాలి. ఇక అలా ఆ బౌల్ లో పోసిన కోడిగుడ్ల సొన ఇంకా లోపలి పదార్థానికి ఆలివ్ ఆయిల్ ను కలపాలి. ఇక ఆ తరువాత ఈ రెండు పదార్థాలు బాగా కలిసే వరకు బాగా షేక్ చేయాలి. ఇలా బాగా కలిపిన ఆ మిశ్రమాన్ని తీసుకొని మీ జుట్టుకు అప్లై చేసుకోవాలి.

    బాగా కలిపిన తర్వాతే..

    అయితే ఆ మిశ్రమం బాగా మిక్స్ (mix) అయిన తర్వాత మాత్రమే అప్లై తలకి (head) అప్లై చేయాలి. మిశ్రమం బాగా మిక్స్ అవ్వక ముందు జుట్టుకు అప్లై చేయడం అంత మంచిది కాదు.ఇలా ఆలివ్ ఆయిల్ ఇంకా కోడిగుడ్ల మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేసి దాదాపు ఒక గంట సేపు పాటు జుట్టును అలాగే ఉంచుకోవాలి.

    ఇలా ఒక గంట సేపు ఆ మిశ్రమాన్ని జుట్టుకే ఉంచుకోవడం వలన ఆ మిశ్రమం అనేది పూర్తిగా జుట్టుకు పడుతుంది. ఇక ఒక గంట సేపు గడిచిన తర్వాత (after one hour) జుట్టుకు అప్లై చేసిన ఆ మిశ్రమాన్ని చల్లటి నీటితో కడగాలి. ఇక అలాగే సల్ఫేట్ లేని షాంపూతో జుట్టును బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేయడం వలన జుట్టు చాలా స్మూత్ (smooth) గా ఎలా తయారవుతుంది.

    కోడిగుడ్లలో చాలా రకాల ప్రొటీన్లు (proteins) అనేవి దాగి ఉంటాయి. అందువల్ల ఇవి మన జుట్టుకు ఎక్కువగా స్మూత్ నెస్ (smoothness) ను ఇస్తాయి.  అంతే కాకుండా మన జుట్టును స్ర్టెయిట్ చేసేందుకు అలాగే ఇంకా మృదువుగా చేసేందుకు కూడా ఇవి బాగా సహకరిస్తాయి. ఎందుకంటే ఆలివ్ ఆయిల్ (olive oil) అనేది చాలా అద్భుతంగా పని చేసే ఒక హెయిర్ కండిషనర్ (hair conditioner). అందుకే ఈ రెండు మిశ్రమాలను కలిపి మన జుట్టుకు అప్లై చేయడం వలన మన జుట్టు ఎంతో స్మూత్ గా తయారవుతుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    ఇవి కూడా చదవండి: పాలు తాగితే అధిక బరువును తగ్గించుకోవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

    గదిలో ఒంటరిగా కూర్చుంటే తలనొప్పి తగ్గుతుందా? మరి నొప్పి తగ్గాలంటే ఇంకేం చేయాలి?

    శరీరం నుంచి దుర్వాసన అధికంగా వస్తుందా? అయితే ఈ చిట్కాలతో సమస్య నుంచి బయటపడండి

    Published by:Prabhakar Vaddi
    First published: