వర్షం (rain). అంటే ఇష్టపడని వారు ఉండరు. రైతన్నలు ఎదురుచూసే ఓ ఆత్మీయ బంధువు. పంటలు పండి.. మనకు తిండి ఉండాలంటే వర్షం కావాల్సిందే. చాలామంది తొలకరి వర్షానికి ముందు, పడేటప్పుడు భూమి నుంచి వచ్చే ప్రత్యేక వాసన (smell)ను ఇష్టపడతారు. వర్షపు నీరు చాలా శుద్ధమైనది (fresh) . భూమి మీద నీరే (water) ఆవిరై మేఘాలుగా మారి వర్షంగా కురుస్తుంది. వర్షాకాలం (monsoon) ఇష్టపడేవాళ్లు చాలామందే ఉంటారు. అందులో నేను కూడా ఒకదాన్ని. ముఖ్యంగా వానలో తడవడం అన్నా.. బయట వాన పడుతుంటే ఆ శబ్దం వింటూ దుప్పటి కప్పుకొని వేడి వేడి పకోడీలు తినడమన్నాచాలామందికి ఇష్టం. అలా వానలో తడిసిన తర్వాత మీ జుట్టు (hair), చర్మం (Skin) పాడవకుండా కొన్ని పద్దతులు పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ దీన్ని పాటించకపోతే చర్మం దెబ్బతింటుంది. జుట్టు రఫ్‌గా, చిక్కులు పడిపోయి కనిపిస్తుంది. ఊడిపోతుంది కూడా . అందుకే మీరు మళ్లీ కావాలని కానీ.. అనుకోకుండా కానీ వానలో తడిసినప్పుడు ఏం చేయాలనే దానిపై కొన్ని చిట్కాలు పరిశీలిద్దాం..
గోరు వెచ్చని నీటితో స్నానం..
ఇంటికి వచ్చిన తర్వాత.. గోరు వెచ్చని నీటి (Lukewarm water)తో చక్కటి స్నానం (bath) చేయడం మంచిది. అలా చేయడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత పెరగడం మాత్రమే కాదు.. మీ చర్మంపై ఉన్న దుమ్ము, ధూళి, టాక్సిన్లు వంటివన్నీ తొలగిపోతాయి. ఒకవేళ మీ ఇంటికి దగ్గర్లో వేప చెట్టు (neem tree) ఉంటే.. ఆ చెట్టు ఆకులు వేసి మరిగించిన నీటిని తలస్నానానికి ఉపయోగించండి. అప్పుడు వల్ల తలభాగం (head), శరీరంపై ఏర్పడే సూక్ష్మజీవులు తొలగిపోతాయి. వేపలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తాయి. ఒకవేళ మీ ఇంటి దగ్గర వేప చెట్టు లేకపోతే.. వేప గుణాలున్న షాంపూ (shampoo), సబ్బు ఉపయోగించి స్నానం చేయడం మంచిది.
ఆరబెట్టుకోండి..
వర్షాకాలంలో తడిసిన జుట్టును (hair) సరిగ్గా ఆరబెట్టుకోకపోతే జలుబు (cold) చేస్తుంది. తలలోని బ్యాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్లు వానాకాలంలో (rainy season) త్వరగా వ్యాపిస్తాయి. అలా జరిగితే చుండ్రు (dandruff), జుట్టు రాలిపోవడం (hair fall) వంటివి ఎక్కువగా జరుగుతాయి. ఇలా కాకుండా ఉండాలంటే మీరు తలస్నానం చేసిన తర్వాత జుట్టును సహజంగా టవల్‌తో తుడుచుకొని ఆరబెట్టుకోవచ్చు. లేదా ధూపం వేసుకోవడం, బ్లో డ్రయర్‌ని చాలా తక్కువ లెవల్‌లో పెట్టుకొని ఆరబెట్టుకోవడం చేయచ్చు.
ఇది కూడా చదవండి: ముఖంలో కాంతి, తేజస్సు కావాలా ? మొటిమలు తగ్గిపోవాలా? అయితే ఇలా చేయండి
చర్మానికి సబ్బు తప్పనిసరి..
జుట్టుకు నూనె (oil), షాంపూ, కండిషనర్ తప్ప మరే ఉత్పత్తులూ ఉపయోగించకూడదు. అలాగే చర్మానికి (skin) కూడా సబ్బు (soap), మాయిశ్చరైజర్ తప్ప.. మరే ఇతర ఉత్పత్తులు ఉపయోగించకుండా ఉండడం మంచిది. వివిధ పదార్థాలతో నీళ్లు కలవడం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగే అవకాశాలుంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఇతర ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.
(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Beauty tips, Hair fall, Hair Loss, Heavy Rains, Rains