Home /News /life-style /

DOES YOUR HAIR FALL OUT TOO MUCH THEN EVERY NIGHT MUST TAKE THESE PRECAUTIONS FOR HAIRS PRV

Beauty tips: మీ జుట్టు మరీ ఎక్కువగా రాలిపోతుందా? అయితే రోజు రాత్రి ఈ జాగ్రత్తలు తీసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇప్పటి కాలుష్యం, షాంపూలు, హెయిర్ ప్రొడక్ట్స్ పూర్తిగా రసాయనాలకు అలవాటు పడిపోయారు. ఇవి జుట్టుకు ఎంతో నష్టం చేస్తున్నాయి. చాలా మందికి కూడా జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. ఇక అలా రాలిపోకుండా ఉండాలంటే ప్రతిరోజూ కూడా మీరు పడుకునే ముందు మీ జుట్టు (hair)ను బాగా దువ్వటం చెయ్యాలి.

ఇంకా చదవండి ...
    చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్​ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం (fall) జరుగుతుంది. జుట్టు రాలిపోతుంటే (hair fall) విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది. అయితే నల్లని ఒత్తైన జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పటి ఆరోగ్య పరిస్థితులు వలన జుట్టు రాలే (hair fall) సమస్యను ఎదుర్కొంటున్నారు.  ఇప్పటి కాలుష్యం, షాంపూలు, హెయిర్ ప్రొడక్ట్స్ పూర్తిగా రసాయనాలకు అలవాటు పడిపోయారు. ఇవి జుట్టుకు ఎంతో నష్టం చేస్తున్నాయి. చాలా మందికి కూడా జుట్టు (hair) ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. ఇక అలా రాలిపోకుండా ఉండాలంటే ప్రతిరోజూ కూడా మీరు పడుకునే ముందు మీ జుట్టు (hair)ను బాగా దువ్వటం చెయ్యాలి. ఇక ఈ సందర్భంలో మీరు ఎలా దువ్వాలంటే ఒక పెద్ద పంటి దువ్వెన ఉపయోగించి మీ జుట్టులోని అన్ని ముడులను మెల్లగా విప్పాలి. ఇక జుట్టు (hair)ను దువ్వేటప్పుడు పెద్ద పంటి దువ్వెన (big comb)తో దువ్వడం వల్ల మీ జుట్టు అసలు దెబ్బతినదు. ఇక ఇది మీ జుట్టును ఎంతో మృదువుగా చేస్తుంది. ఇంకా మీ జుట్టు చిక్కులను కూడా చాలా సులభంగా వదిలివేస్తుంది.

    మీరు రాత్రి పూట పడుకునే..

    ఒకవేళ మీకు పెద్ద జుట్టు కనుక ఉంటే మీరు రాత్రి పూట (night time) పడుకునే ముందు మీరు తప్పనిసరిగా దానిని అల్లిన తర్వాతనే పడుకోవాలి. ఇక రాత్రిపూట అల్లికలతో నిద్రపోవడం వల్ల బెడ్‌లో జుట్టు రాపిడి అనేది తొందరగా తగ్గుతుంది. ఇక దీని ఫలితంగా మీ జుట్టు చాలా తక్కువగా దెబ్బతింటుంది. ఇక అంతేకాకుండా మీ నిద్రలో జుట్టు కళ్ళు ఇంకా ముఖానికి కూడా ఇది దూరంగా ఉంటుంది. ఇక అలాగే ఖచ్చితంగా నిద్రపోయేటప్పుడు (before sleep) మీ జుట్టును ఎప్పుడూ కూడా అసలు గట్టిగా మాత్రం కట్టుకోకండి. ఇక మరీ మీరు గట్టిగా కనుక కట్టుకుంటే మీ జుట్టు చాలా త్వరగా విరిగిపోవడం అనేది జరుగుతుంది. దాని ఫలితంగా మీ జుట్టు సన్నగా మారుతుంది.

    మూలాలు కూడా చాలా బలహీనమవడం..

    ఇంకా జుట్టు మూలాలు కూడా చాలా బలహీనమవడం జరుగుతుంది. ఇక అలాగే మీరు బాగా నిద్రపోతున్నప్పుడు మీ జుట్టుకు కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటే ఇక ఖచ్చితంగా సిల్క్ దిండు కవర్ పడుకోడానికి ఉపయోగించండి. ఇది మీ జుట్టులో రాపిడి ధోరణిని తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది. అందువల్ల మీ జుట్టు తక్కువగా దెబ్బతింటుంది. ఇంకా అలాగే జుట్టు ఇక విరిగిపోవడం అనేది ఇక జరగదు.

    ఇక అంతేకాకుండా ఇది జుట్టు యొక్క సహజ నూనెలను కూడా అసలు గ్రహించదు. అందువల్ల మీ జుట్టు యొక్క తేమను ఇది నిలుపుకుంటుంది. అలాగే మీకు శాటిన్ లేదా సిల్క్ దిండు కవర్ కనుక లేకపోతే ఇక మీ జుట్టును రక్షించడానికి సిల్క్ స్కార్ఫ్ ని మీరు పడుకోవడానికి ఉపయోగించవచ్చు.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Beauty tips, Hair fall, Hair Loss, Sleep, Treatment

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు