హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Hair tips: జుట్టు రంగు తెల్లబడుతుందా? అయితే ఈ పద్దతులు వాడి మీ జుట్టును కాపాడుకోండి

Hair tips: జుట్టు రంగు తెల్లబడుతుందా? అయితే ఈ పద్దతులు వాడి మీ జుట్టును కాపాడుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆహారపు అలవాట్లు, జీన్స్ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం (hair fall) జరుగుతుంది. జుట్టు (hair) రాలిపోతుంటే విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది. కొన్ని పద్దతులతో మీ జుట్టుకు వాడితే బలంగా తయారవుతుంది.

జుట్టు. మనిషి రూపంలో కొత్త అందాన్ని ఇస్తుంది. జుట్టు (hair) రాలిపోతుండటాన్ని (loss) చూసి తట్టుకోలేడు. ఇక అమ్మాయిలైతే (girls) మరేమరి. కేశాలు వారి అందాన్ని రెట్టింపు చేస్తాయని చెప్పడలో అతిశయోక్తి లేదు. అందుకే జుట్టు మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. మహిళల కురులు  (women hairs) మగవారికీ ఇష్టమే. కేశాలు ఎంత బాగా ఉంటే అంత అందంగా  (beauty) కనిపిస్తారు. జుట్టు ఎంత బాగుంటే అన్ని రకాల హెయిర్​ స్టైల్స్​ను ఫాలో అవుతారు. అయితే జుట్టు ఆడవారిలోనే కాదు మగవారికీ అందాన్ని చేకూరుస్తాయి. కాకపోతే మగవారు బట్టతల వస్తుందని తెలిసే సరికి పట్టించుకోవడం మొదలెడతారు. ఇక సెలెబ్రెటీలైతే సరే సరి వారి కోసం పర్సనల్ హెయిర్​ స్పెషలిస్టులను పెట్టుకుంటారు. అయితే మనలో చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం (hair fall) జరుగుతుంది. జుట్టు (hair) రాలిపోతుంటే విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది. కొన్ని పద్దతులతో మీ జుట్టుకు వాడితే బలంగా తయారవుతుంది. అలాగే జుట్టు నల్లగా మారుతుంది. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..

కరివేపాకు..

కొబ్బరి నూనెలో కరివేపాకు (curry leaf) వేసి మరిగించాలి. ఆ నూనె చల్లారాక వడ కట్టుకుని నిల్వ చేసుకోవాలి. ప్రతి రోజు ఈ నూనె కుదుళ్లకు పట్టించడం వల్ల జుట్టు తెల్ల పడకుండా ఉంటుంది. మిరియాలు మెత్తగా నూరి జుట్టు ఊడిన చోట రుద్దితే వెంట్రుకల (hairs) కుదుళ్లు గట్టి పడి తిరిగి పెరగటం మొదలవుతుంది. పసుపు, మాను పసుపు కలిపి పొడి చేసి ఆ పొడిని వెన్నతో ముద్దగా నూరి తలకు పట్టించి గంట సేపు ఆగిన తరువాత తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు చిట్లడం తగ్గుతుంది.

ఇది కూడా చదవండి: బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే ఏమవుతుంది ? అసలు బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు ఉంటుంది?

మినుములు, ఉసిరికాయ బెరడు, సీకాయ, మెంతులను పొడిగా నూరాలి. తర్వాత అర గ్లాసు నీళ్లలో రెండు స్పూన్ల పొడిని వేసి కలపాలి. ఆ నీటిని  హెయిర్ ప్యాక్ ( hair pack) లా వేసుకొని అరగంట తర్వాత తల స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

గుప్పెడు మందార ఆకులు, నాలుగు స్పూన్ల పెరుగు కలిపి నూరి తలకు పట్టించి  తల స్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే తెల్ల జుట్టు నల్లబడుతుంది.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?

ఇవి కూడా చదవండి:  తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి

వర్షంలో తడిచాక మీ జుట్టు పాడైపోతుంది కదా? ఈ చిట్కాలతో మీ జుట్టును కాపాడుకోండి..ముఖంలో కాంతి, తేజస్సు కావాలా ? మొటిమలు తగ్గిపోవాలా? అయితే ఇలా చేయండి

First published:

Tags: Beauty tips, Hair fall, Hair Loss, Hair problem tips