Health Tips : నైట్‌ షిఫ్ట్ జాబ్ చేస్తే అయితే ఆ సమస్య వస్తుందట..

చాలామంది ఉద్యోగులు షిఫ్ట్స్ ఉండే ఉద్యోగం చేస్తున్నారు. నేడు ప్రతీ జాబ్‌లోనూ షిఫ్ట్స్ ఉంటాయి. ఇలాంటి ఉద్యోగాలు చేసేవారికి పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతున్నట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: June 23, 2019, 11:30 AM IST
Health Tips : నైట్‌ షిఫ్ట్ జాబ్ చేస్తే అయితే ఆ సమస్య వస్తుందట..
గడ్డం పెంచుకోవడం వల్ల లాభాలు
news18-telugu
Updated: June 23, 2019, 11:30 AM IST
ప్రతీ విషయానికి ఓ సమయం ఉంటుంది. ఆకలి, నిద్ర, ఇలా మన ఒంట్లోని అన్ని పనులూ ఓ పద్ధతి ప్రకారం జరుగుతాయి. సమయాన్ని బట్టి మన జీవగడియారమే ఈ ప్రకారం నడుచుకుంటుంది. ఇలాంటి తరుణంలో నిద్రవేళలను మార్చేసే షిఫ్ట్ ఉద్యోగాల కారణంగా అతిపెద్ద సమస్య అయిన సంతానలేమి సమస్య ఎదుర్కొంటున్నారు చాలామంది. కొన్నిరోజులు పగలు, కొన్నిరోజులు రాత్రి పూట ఉద్యోగాలు చేయడం వల్ల నిద్రవేళలు మారిపోయి జీవగడియారం దెబ్బతింటోంది.

నైట్ జాబ్స్ చేసే మహిళ్లలో సమయానికి అండం విడుదల కాకపోవడం, ఫలితంగా గర్బధరాన జరగకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటికి తోడు.. బయటితిండి, పోషకాలు లేని జంక్ ఫుడ్ తినడం కూడా సమస్యకు దారి తీస్తున్నాయి. ఇలా చేయడం వల్ల అండాశయంలో నీటితిత్తులు ఏర్పడుతున్నాయి. దీంతో అండం సరిగా విడుదల కావడం లేదు. ఇక ఊబకాయం కారణంగా మగవారిలో ఈస్ట్రోజెన్ స్థాయిలు ఎక్కువవుతాయి. ఈ కారణంగా స్తంభన లోపానికి దారితీస్తుంది. వీర్యకణాల సంఖ్య కూడా తగ్గుతుంది. సంతానం కలగాలంటే కనీసం 15 మిలియన్ల వీర్యకణాలైనా ఉండాలని.

రాత్రి షిఫ్ట్స్ జాబ్స్ చేయడం వల్ల ఒత్తిడి ఎక్కువవుతుంది. ఈ కారణంగా శృంగారాసక్తి కూడా తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి.. ఇలాంటి జాబ్స్ చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే సమస్యలు ఎక్కువయ్యే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

First published: June 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...