Home /News /life-style /

DOES WOMEN GAIN WEIGHT WITH SEX HERE IS THE EXPERTS ANSWERS MS GH

Weight Gain: శృంగారంతో మహిళలు బరువు పెరుగుతారా..? వాస్తవాలు తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Women Gain Weight With Sex: మహిళలు బరువు పెరగడం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. యుక్తవయస్సు, నెలవారి రుతుచక్రం వంటి అనేక అంశాలు వారి బరువును నిర్ణయిస్తాయి. కేవలం దాని వల్లే బరువు పెరుగుతారనుకోవడం అపోహే..

  • News18
  • Last Updated :
మానవ జీవనానికి ఆకలి, నీరు, నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం. శృంగార జీవితం సంతోషంగా ఉంటే మనిషి మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాడని అనేక అధ్యయనాల్లో తేలింది. అయితే, చాలామందికి శృంగారం తర్వాత మహిళలు బరువు పెరుగుతారని అపోహ ఉంటుంది. వివాహానికి ముందు నాజుగ్గా ఉండే మహిళలు కూడా వివాహం అయ్యాక లావైపోతుంటారు. ఇది వారిని చిరాకు పెట్టే అంశం.

అయితే, మహిళలు బరువు పెరగడం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. యుక్తవయస్సు, నెలవారి రుతుచక్రం వంటి అనేక అంశాలు వారి బరువును నిర్ణయిస్తాయి. కేవలం దాని వల్లే బరువు పెరుగుతారనుకోవడం అపోహే..

వివాహం తర్వాత బరువు పెరగడానికి కారణం..?

వివాహానికి ముందు సన్నగా నాజుగ్గా ఉండే మహిళలు వివాహం తర్వాత తమ శరీరంలో అనేక మార్పులను గమనించవచ్చు. ముఖ్యంగా బరువు పెరుగుతుంటారు. వారి తొడలు, పిరుదులు, నడుము భాగాల్లో అనేక మార్పులు వస్తాయి. అయితే వీటన్నిటి వెనుక శృంగారంతో పాటు భిన్నమైన కారణాలు ఉండవచ్చు. పీసీఓఎస్ వంటి సమస్యలు, హార్మోన్ల అసమతౌల్యత వంటివి కూడా వారు బరువు పెరగడానికి కారణం కావొచ్చు.

ప్రతీకాత్మక చిత్రం


మానసిక స్థితి మెరుగవ్వడం...

వివాహం తరువాత మహిళల్లో మానసికంగా ఒత్తిడి తగ్గడం, స్థిరత్వం, భద్రత వంటి భావనలు బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. అయితే, వివాహ తర్వాత కేవలం మహిళలే కాకుండా పురుషులు కూడా బరువు పెరుగుతుంటారు. పెళ్లి అయిపోయిందన్న భద్రతతో చాలామంది ఆనందంగా ఉంటారు. అయితే కొందరిలో కొత్త బాధ్యతలు ఒత్తిడిని పెంచుతాయి. తద్వారా హార్మోన్ల అసమతౌల్యత సమస్య ఎదురు కావచ్చు.

ఆహారంపై శ్రద్ధ వహించడం...

వివాహం అయిన తర్వాత పురుషులు, మహిళలు ఆహారం పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తుంటారు. మంచి పోషకాలున్న ఎక్కువ కేలరీలు గల ఆహారాన్ని తీసుకోవడానికి ప్రాధాన్యతనిస్తారు. ఇది బరువు పెరగడానికి కారణంగా మారుతుంది.

గర్భం దాల్చడం...

గర్భం దాల్చడం వల్ల స్త్రీ శరీరంలో చాలా మార్పులు వస్తాయన్నది వాస్తవం. కడుపులో బిడ్డ పెరిగే క్రమంలో సహజంగానే మహిళలు బరువు పెరుగుతారు. తల్లీ, బిడ్డ క్షేమం కోసం గర్భధారణ సమయంలో క్రమం తప్పకుండా ఆహార నియమాలు పాటించాల్సి వస్తుంది. ఆ తర్వాత తల్లి పాలివ్వటానికి ఎక్కువ పోషకాలులన్న ఆహారం తీసుకోవాల్సి వస్తుంది. దీనితో పాటు గర్భాధారణ సమయంలో శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది కనుక ఇది కూడా బరువు పెరగడానికి దోహదం చేస్తుంది.

శృంగారం మంచిదే..

సాధారణంగా శృంగారం వల్ల పెద్దమొత్తంలో క్యాలరీలు కరుగుతాయి. తద్వారా మీ శరీరంలోని చెడు కొలస్ట్రాల్ తగ్గుతుంది. ఇది కూడా ఒక రకమైన వ్యాయామంగానే చెప్పవచ్చు. 30 నిమిషాల పాటు శృంగారంలో పాల్గొంటే 100 క్యాలరీలను కరిగించుకోవచ్చని అనేక అధ్యయనాలు పేర్కొన్నాయి. కాబట్టి, మీరు శృంగారంలో ఎంత చురుగ్గా ఉంటే అంత బరువు తగ్గుతుందని గుర్తించుకోండి. దీనితో పాటు శృంగారం మీ హృదయానికి కూడా మంచి చేస్తుంది. మీరు సెక్స్ చేసినప్పుడు, మీ హృదయ స్పందన నిమిషానికి 120- నుండి 130 సార్ల వరకూ పెరుగుతుంది. కాబట్టి, మీ భాగస్వామితో ఎక్కువ సేపు బెడ్రూమ్ లో గడపడం వల్ల మీరు బరువు పెరుగుతారని భావించడం సరికాదని గుర్తుంచుకోండి. వాస్తవానికి శృంగారానికి, బరువు పెరగడానికి సంబంధం లేదు. మీరు తీసుకునే ఆహారం, మీ మానసిక స్థితి బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. కాబట్టి, బరువు పెరుగుతామనే అపోహ వీడి మీ భాగస్వామితో శృంగారాన్ని ఆస్వాదించండి.
Published by:Srinivas Munigala
First published:

Tags: Health care, Health Tips, Life Style, Women, Women health

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు