Sleep tips: రాత్రి తిన్నాక కొద్దిసేపు నడిస్తే హాయిగా నిద్ర పడుతుందా? మంచి నిద్ర కోసం ఏం చేయాలి?

ప్రతీకాత్మక చత్రం

రాత్రి భోజనం (dinner) చేసిన తర్వాత మీరు చేసే కొన్ని కొన్ని పనులు (do some works) మీ నిద్ర (sleep)ను ప్రశాంతంగా ఉంచేలా చేస్తాయట. వాటిలో ముఖ్యంగా నడక (walk) ఒకటి. దాని గురించి ఒకసారి తెలుసుకుందాం..

  • Share this:
    కరోనా (corona) లాక్​డౌన్​ కారణంగా చాలామంది రాత్రిళ్లు (night) మేల్కునే ఉన్నారు. దీంతో అన్​లాక్‌ అనంతరం మళ్లీ సాధారణ జీవితం గడపాలనుకున్నా.. సాధ్యం కావడం లేదని పలువురు అంటున్నారు. దీనికి ప్రధాన కారణం. నిద్రలేమి (Insomnia). లాక్​డౌన్​ కాలంలో పనేమీ లేకపోవడంతో ఇంట్లోనే ఇష్టం వచ్చిన సమయంలో నిద్రించేవారు. కానీ. మళ్లీ రొటీన్​ జీవితంలోకి అడుగుపెట్టాక అది ఇబ్బందిగా మారుతోంది. ఉద్యోగస్తులకైతే మరీ కష్టం. రాత్రిళ్లు నిద్ర లేకపోవడం (sleeping problems), ఉదయాన్నే ఆఫీసులో నిద్ర (sleep) రావడం లాంటి సమస్యలు వస్తుంటాయి. నిద్ర లేకపోవడం (No sleep) వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. ఏకాగ్రత లోపించడం వల్ల ఏ పని పూర్తి చేయలేకపోతుంటారు.  రాత్రి భోజనం (dinner) చేసిన తర్వాత మీరు చేసే కొన్ని కొన్ని పనులు (do some works) మీ నిద్ర (sleep)ను ప్రశాంతంగా ఉంచేలా చేస్తాయట. వాటిలో ముఖ్యంగా నడక (walk) ఒకటి. దాని గురించి ఒకసారి తెలుసుకుందాం..

    15 నుంచి 20 నిమిషాలపాటు నడక..

    రాత్రి భోజనం (dinner) చేసిన తర్వాత 15 నుంచి 20 నిమిషాలపాటు నడక (walk) ప్రారంభించండి. తరువాత నిద్ర పోవడానికి వెల్లండి. దీంతో మంచిగా నిద్ర పట్టడమే కాకుండా జీర్ణక్రియ (digestive) కూడా పెరగుతుంది. మీలో ఉన్న ఒత్తిడి కారణంగా నిద్ర రాకపోతే లేదా మనసులో అలజడి కారణంగా కూడా నిద్ర (sleep) రాదు. అలాంటి పరిస్థితుల్లో మీకు ఇష్టమైన సంగీతాన్ని (listen music) వినండి లేదా మంచి సాహిత్యం చదవండి లేదా ఆరోగ్యానికి (health) సంబంధించిన పుస్తకాలను (books) చదవండి. ఇలా చేస్తే మనసు (heart) కాస్త కుదుటపడి గాఢమైన నిద్ర (deep sleep) రావడానికి ఆస్కారం ఉంటుంది.

    ఇది కూడా చదవండి: బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే ఏమవుతుంది ? అసలు బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు ఉంటుంది?

    మరుసటి రోజు చేయవలసిన పని గురించి..

    పడుకునే ముందు రోజంతా చేసిన పనిని (work) మర్చిపొండి. మరుసటి రోజు చేయవలసిన పని గురించి ఏమాత్రం ఆలోచించకండి. అన్ని విషయాలను ఉదయం వరకు మర్చిపొండి. మరుసటి రోజు పనిగురించి ఆలోచిస్తే ఒత్తిడి పెరిగి నిద్ర పట్టదంటున్నారు వైద్యులు.

    నిద్రమాత్రలు వాడుతుంటే..

    ఒకవేళ మీరు నిద్రలేమి (insomnia)తో బాధపడుతుంటే, నిద్రమాత్రలు (sleeping tablets) వాడుతుంటే మీరు యోగా నిపుణులను సంప్రదించండి. వారి సలహాలు పాటించి శ్వాసక్రియను (breath) పాటించండి. రాత్రి పడుకునేముందు శ్వాసను పూర్తిగా తీసకోండి. దీంతో మీ మస్తిష్కానికి ప్రాణవాయువు చేరి మీకు నిద్ర సంపూర్ణంగా వస్తుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)



    ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?

    Published by:Prabhakar Vaddi
    First published: